మంచి రీ సేల్ వ్యాల్యూ కలిగిన టాప్-9 వాహనాలు

By Anil

ప్రస్తుతం కాలంలో వాహనాలు అనేవి ఎలక్ట్రానిక్ వస్తుల మాదిరిగా అయిపోయాయి. ఎందుకంటే ఒక సారి కొన్న వాటిని తిరిగి అమ్మాలంటే వాటి అతి దారుణమైన ధరలకు అడుగుతుంటారు. కొన్ని వాహనాలకు మార్కెట్లో మంచి రీ సేల్ వ్యాల్యూ ఉంటుంది. మరి కొన్నింటికి అసలు రీ సేల్ వ్యాల్యూనే ఉండదు. అయితే ఎటువంటి వాహనాలకు మంచి రీ సేల్ వ్యాల్యూ ఉంటుంది అని తెలుసుకోవాలి అనుకునే వారందరూ ఈ కథనం చదవాల్సిందే.
Also Read: బాలీవుడ్ తారలకు ఇష్టమైన బైకులు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా గొప్ప రీ సేల్ వ్యాల్యూ గల తొమ్మిది పాత వాహనాల గురించి సమాచారం క్రింది గల స్లైడర్లలో కలదు.

విల్లీస్ జీపు

విల్లీస్ జీపు

ఇది చూడటానికి మరీ పాతగా కనిపించినప్పటికీ విల్లీస్ జీపు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అత్యంత శక్తివంతమైనదో కాదో అనే విశయంలో సందేహం ఉన్నప్పటికీ ఇది ఆఫ్ రోడ్ మీద రైడింగ్‌ కోసం వచ్చినపుడు ఈ విల్లీస్ జీపు ముందు నూతన ఎస్‌యువిలు సైతం తల దించుకోవాల్సిందే. ఇది 3 లక్షల వరకు ఉన్నప్పటకీ దీనికి మంచి రీసేల్ వ్యాల్యూ ఉంది.

Picture credit: BrokenSphere/Wiki Commons

 కాంటెస్సా

కాంటెస్సా

హిందుస్తాన్ మోటార్స్ వారు ఈ కాంటెస్సా కారును దేశీయంగా అందుబాటులో ఉంచినపుడు ఇది ఏకైక లగ్జరీ కారుగా వెలుగొందినది. ఇందులో అత్యంత శక్తివంతమైన ఇంజన్ లేనప్పటకీ దీనికి అతి విశాలమైన క్యాబిన్ మరియు హైవేల మీద దీనితో ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది. దీనికి కూడా దేశీయ మార్కెట్లో మంచి రీసేల్ వ్యాల్యూ ఉంటుంది.

Picture credit: D'Costa's Contessas/Wiki Commons

ఫియట్

ఫియట్

హిందుస్తాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారుకు ఉన్న ఏకైక పోటీ ఫియట్‌కు చెందిన ప్రీమియర్ పద్మిని. ఇది కూడా అంబాసిడర్ తరహాలో మంచి ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉన్నప్పట్టికీ ఇందులో అత్బుతమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం కాలంలో చాలా మంది ఇలాంటి కార్లను కొనుగోలు చేసి వాటికి అల్లాయ్ వీల్స్ మరియు ఆధునిక ఫీచర్లను జోడించి డిజైన్ చేయించుకుంటున్నారు.

Picture credit: luc106/Wiki Commons

జిప్సీ

జిప్సీ

జిప్సీ ఒక మంచి ఆఫ్ రోడ్ వెహికల్ అయినప్పటీకి ఇది ఆన్ రోడ్ మీద కూడా చక్కటి పనితీరును కనబరుస్తుంది. మీరు గమనించినట్లయితే ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని వినియోగిస్తోంది. మంచి డిజైన్ ఫీచర్లతో తయారైన ఈ మారుతి వారి జిప్సీ వారి వాహనం కేవలం 2.5 లక్షల రుపాయల నుండి అందుబాటులో ఉంది.

 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్

స్కోడా ఆక్టావియా ఆర్ఎస్

దీనికి సమానంగా ఉన్న కార్లలో ఇది ఎంతో ఉత్తమమైన కారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్టావియా కారుతో పోల్చుకుంటే ఇది చాలా పాతది. అప్పట్లో స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారులో టుర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండేది. అయితే దాదాపుగా లక్ష కిలోమీటర్లు తిరిగిన కారు కూడా 2.5 లక్షల రుపాయల ధర పలుకుతోంది.

Picture credit: Thomas doerfer/Wiki Commons

యమహా ఆర్‌డి 350

యమహా ఆర్‌డి 350

కార్లు మాత్రమే కాదండోయ్ బైకులు కూడా గొప్ప రీసేల్ వ్యాల్యూను కలిగి ఉన్నాయి. అందుకు చక్కటి ఉదాహరణ యమహా ఆర్‌డి 350 బైకు. రెండు సిలిండర్లు గల 2-స్ట్రోక్ ఇంజన్ బైకులు కొన్ని లక్షల వరకు ప్రస్తుతం దేశీయంగా ఉన్నాయి. అయితే ఇవి కేవలం 20,000 రుపాయలకు కూడా అందుబాటులో ఉన్నాయి.

 యమహా ఆర్‌ఎక్స్ సిరీస్

యమహా ఆర్‌ఎక్స్ సిరీస్

యమహా ఆర్‌ఎక్స్ సీరీస్ బైకులు ఆ కాలంలో చక్కటి పనితీరు కనబరిచే ఉత్తమ బైకులు. అయితే నేటి కాలంలో ప్రస్తుతం కాలేజ్ కుర్రాళ్లు ఎక్కువగా వీటిని రైడ్ చేస్తుంటారు. చక్కటి మైలేజ్, చవక ధరలకు లభించే ఇంజన్ విడిభాగాలు, సులభంగా గుర్తించవచ్చు. దీనిని మీరు గమనిస్తే ఇది పొడవుగా ఉంటుంది.

రాయల్ ఎవ్ఫీల్డ్ స్టాండర్ట్ 350/500

రాయల్ ఎవ్ఫీల్డ్ స్టాండర్ట్ 350/500

ప్రస్తుత కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ భారీ స్థాయిలో అమ్మకాలు సాధిస్తోంది. కాని రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ప్రారంభంలో విడుదలైన క్యాస్ట్ ఐరన్ ఇంజన్‌లను కలిగి ఉన్న స్టాండర్డ్ 35 మరియు 500 బైకులు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ రేసులో ముందన్నాయి. స్టాండర్డ్ 350 బైకులు లక్షకు పైన ధర పలుకతున్నాయి.

ఎజ్డీ

ఎజ్డీ

దీనిని ప్రారంభంలో చాలా మంది వరకు అసహ్యించుకున్నారని తెలిసింది. అయితే ఎవ్వరికీ తెలియని నిజం ఏమిటి అంటే దీనికి భారీ స్థాయిలో ఫ్యాన్సు ఉన్నారు. ఇందులో ఉన్న అరుదైన ఫీచర్లలో సింపులు ఫూయల్ సిస్టమ్, ఎటువంటి రీడింగ్‌లు ఉండవు, గేర్ లీవర్ లా పని చేసే కిక్ రాడ్ వంటివి ఇందులో ఉన్నాయి. సాధారణంగా ఉండే ఈ ఎజ్డీ బైకు 30,000 రుపాయల ప్రారంభ ధరతో మరియు మంచి బైకు లక్ష రుపాయల వరకు ధర పలుకుతోంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం
  • అమెరికాను అడుక్కోవాల్సిన పని లేదు....స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న భారతదేశపు న్యావిగేషన్ సిస్టమ
  • పాత భారతీయ కార్ల గురించి మనం మిస్ అయ్యే 10 అంశాలు

Most Read Articles

English summary
9 Old Vehicles That Still Have A Good Resale Value In India
Story first published: Tuesday, March 8, 2016, 10:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X