వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

By Ravi

సాధారణంగా స్టేక్ బోర్డులకు ముందు, వెనుక రెండువైపులా చక్రాలు ఉంటాయి. కానీ ఈ స్కేట్ బోర్డ్ మాత్రం చాలా విశిష్టమైనది, ఇందులో ఇరువైపుల చక్రాలకు బదులుగా, స్కేట్ బోర్డు మధ్యలో ఒకే ఒక్క పెద్ద చక్రం ఉంటుంది. దీని పేరు 'వన్‌వీల్' (Onewheel).

ఇది కూడా చదవండి: బూస్టెడ్ బోర్డ్ - ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ వన్‌వీల్ ఒక సెల్ఫ్-బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్టేక్ బోర్డ్, దీనిపై సవారీ చేస్తుంటే, గాలిలో ఎగురుతున్న భావన కలుగుతుందని ఈ స్కేట్ బోర్డును తయారు చేసిన వారు చెబుతున్నారు. సెగ్‌వే మాదిరిగా కూడా ఇది కూడా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ పర్సనల్ ట్రాస్స్‌పోర్టరే.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

వన్‌వీల్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ మధ్య భాగంలో పెద్ద రంధ్రం మరియు అందులో పెద్ద చక్రంతో కూడిన ఓ డెక్ ఉంటుంది. ఈ డెక్ పరిమాణం దాదాపు ఓ ఎస్-వాకర్ బోర్డ్ అంత ఉంటుంది.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఇది సెల్ఫ్ బ్యాలెన్సింగ్ (సమతౌల్య బలం) మెకానిజంపై పనిచేస్తుంది. ఈ వన్‌వీల్ స్కేట్ బోర్డుపై మన బరువును రెండు కాళ్లపై సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగిపోవచ్చు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ వన్‌వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును ముందుకు నడపటానికి, దానిపై ఉన్న వ్యక్తి కాస్తంత ముందుకు వాలితే సరిపోతుంది, అలాగే దీని వేగాన్ని తగ్గించడానికి కాస్తంత వెనకు తూలితే సరిపోతుంది. టర్న్ చేయాలంటే మడిమ/వేళ్లతో నొక్కితే చాలు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

కాలిఫోర్నియాకు చెందిన ఫ్యూచర్ మోషన్ సంస్థ ఈ వన్‌‍‌‌వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డును తయారు చేసింది. సాలిడ్ స్టేట్ ఇనెర్షియల్ సెన్సార్స్ మరియు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఫంక్షన్‌ను సపోర్ట్ చేసే కంట్రోల్ ఎలక్ట్రానిక్స్‌ను ఉపయోగించి దీనిని తయారు చేశారు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

వన్‌వీల్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డులో 500వాట్ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ చక్రం మధ్యలోనే అమర్చబడి ఉంటుంది.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఈ ఎలక్ట్రిక్ మోటార్ 48వోల్ట్ లిథియం నానో-ఫాస్పోట్ బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీ స్కేట్ బోర్డు బాడీలోనే నిక్షిప్తం చేయబడి ఉంటుంది.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ బ్యాటరీని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు, అదే స్టాండర్డ్ చార్జర్ అయితే 2 గంటల్లో ఇది పూర్తిగా చార్జ్ అవుతుంది.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

బ్యాటరీలు పూర్తిగా చార్జ్ అయితే, దీనిని నడిపే రోడ్డు మరియు స్టైల్‌ను బట్టి దీనిపై 4 నుంచి మైళ్ల దూరం వరకూ వెళ్లవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 12 మైళ్లు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

వన్‍‌వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ తయారీ కోసం ధృడమైన అల్యూమినియం ఫ్రేమ్‌ను, డెక్ కోసం కెనడియన్ మ్యాపిల్‌ను ఉపయోగించారు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

ఫ్యూచర్ మోషన్ తమ వన్‍‌వీల్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ కోసం ఓ అప్లికేషన్ (ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల కోసం)ను కూడా తయారు చేస్తోంది. ఈ అప్లికేషన్ సాయంతో రైడింగ్ మోడ్స్, టాప్ స్పీడ్ లిమిట్, వీల్ లాక్ వంటి పలు ఫంక్షన్లను ఆపరేట్ చేసుకోవచ్చు.

వన్‌వీల్: అమేజింగ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్

వన్‌వీల్ ప్రస్తుతం ఫుల్లీ ఫండెడ్ కిక్‌స్టార్టర్ ప్రాజెక్ట్‌గా ఉంది. ఉత్పత్తి దశకు చేరుకుంటే, దీని ధర 1299 డాలర్లుగా ఉండనుంది (మన దేశ కరెన్సీలో సుమారు రూ.77,000 లకు పైమాటే).

ఫొటో మూలం: వన్‌వీల్

Most Read Articles

English summary
Onewheel launched successfully on Kickstarter in January 2014. Onewheel was imagined and developed by Kyle Doerksen, an inventor and design engineer who’s been dreaming about one wheeled vehicles for years.
Story first published: Monday, May 12, 2014, 9:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X