వేలంలో భారీ వెల పలికిన ఒరిజినల్ బ్యాట్‌మొబైల్

By Ravi

బ్యాట్‌మ్యాన్ చిత్రాలలో ఉపయోగించే బ్యాట్‌మొబైల్స్‌కి మంచి క్రేజ్ ఉంటుంది. ఇటీవల హెరిటేజ్ ఆక్షన్స్ నిర్వహించిన వేలంలో ఓ పురాతన ఒరిజినల్ బ్యాట్‌మొబైల్ అత్యధిక వెల పలికింది. ఈ వేలంలో 1956 ఓల్డ్స్‌మొబైల్ 88 వాహనం 1.37 లక్షల డాలర్ల వెల పలికింది.

ఈ కారును బ్యాట్‌మ్యాన్ అభిమానులు ఫొర్రెస్ట్ రాబిన్సస్, లెన్ పెర్హామ్‌లు నిర్మించారు. ఈ కారును కస్టమైజ్ చేయటానికి వారికి 3 ఏళ్ల సమయం పట్టిందట. ఇందులో 324 రాకెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. 1940-50 మధ్య కాలంలోని బ్యాట్‌మ్యాన్ కామిక్‌లలో ఈ కారు కనిపిస్తుంది.

ఈ కారు బాడీని పూర్తిగా కస్టమైజ్ చేశారు. అలాగే దీని పొడవు (5181 మి.మీ.), వెడల్పు (2108 మి.మీ.)లను కూడా పెంచారు. ఈ ఒరిజినల్ వెర్షన్ బ్యాట్‌మొబైల్‌ను ప్రమోషన్ ఈవెంట్స్ కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాతి కాలంలో దీనిని న్యూ హాంప్‌షైర్‌లో దశాబ్ధాల కాలం పాటు అలానే వదిలేశారు. ఆ తర్వాత ఈ కారును రీస్టోర్ చేసి, వేలానికి ఉంచారు.

లింకోల్న్ ఫ్యూచురా మోడల్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఒరిజినల్ బ్యాట్‌మొబైల్‌ని తయారు చేశారు. పలు టెలివిజన్ షోలలో వచ్చిన బ్యాట్‌మ్యాన్ కార్యక్రమాల్లో కూడా ఈ కారును ఉపయోగించారు.

Original Batmobile
Most Read Articles

English summary
The original Batmobile, a 1956 Oldsmobile 88 fetched USD 137,000 at an auction organized by Heritage Auctions.
Story first published: Wednesday, December 17, 2014, 15:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X