సముద్రం పాలైన 1200 జాగ్వార్ ల్యాండ్ రోవర్, మినీ లగ్జరీ కార్లు

By Ravi

భారీ సంఖ్యలో వాహనాలను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించాలంటే చవకైన రవాణా మార్గం సముద్ర మార్గం ఒక్కటే. దాదాపు అనేక కార్ల తయారీ కంపెనీలు ఈ మార్గం గుండానే తమ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. అయితే, ఒక్కొక్కప్పుడు జరిగే విపరీత పరిణామాల వలన ఇటు కార్ కంపెనీలు అటు ఇన్సూరెన్స్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాంటి ఓ సంఘటనే ఇటీవల బ్రిటన్‌లో చోటు చేసుకుంది. దాదాపు 14,000ల వాహనాలను, ఇతర సామాగ్రిని తరలిస్తున్న ఓ రవాణా నౌక (కార్గో షిప్) బ్రిటన్‌కు సమీపంలోని ఐల్ ఆఫ్ వైట్ అనే ప్రాంతం సముద్రంలో ఓ వైపుకు ఒరిగి పోయింది. ఓడరేవుకు అతి సమీపంలో ఈ ప్రమాదం జరింది. అయితే, అప్పటికే భారీ ఆస్థి నష్టం కూడా జరిగిపోయింది. ఈ నౌకలో దాదాపు 1200 లకు పైగా లగ్జరీ కార్లున్నాయి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

హోయెగ్ ఒసాకా కార్ ట్రాన్స్‌పోర్టర్ కంపెనీ గడచిన శనివారం రాత్రి సౌతాంప్టన్ పోర్ట్ నుంచి తన ప్రయాణం ప్రారంభించింది. ఈ నౌకలో 1400 వాహనాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. కాగా.. ఈ నౌక మునకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. కావాలనే దీనినే ముంచేశారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

ఈ రవాణా నౌకలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారు చేసిన 1,200 కార్లు, 65 మినీ కార్లు మరియు దాదాపు 60-70 శాతం నిర్మాణ రంగానికి చెందిన వాహనాలు (జెసిబి లాంటివి) ఉన్నాయి.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

తమకు సంబంధించిన 1200 కార్లు ఈ నౌకలో ఉన్నాయని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రతినిధి ధృవీకరించగా, తమకు చెందిన 105 నిర్మాణ రంగానికి చెందిన వాహనాలు ఉన్నాయని జెసిబి ధృవీకరించింది.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

ఈ కార్గో షిప్ దాదాపు 45 డిగ్రీల కోణంలో ఓ పక్కకు ఒరిగిపోయి ఉంది. ఆ సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని రక్షణ బలగాలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగాయి. ఓడకు మునకు సంబంధించి కారణాలను అన్వేషించేందుకు విచారణ ప్రారంభమైంది.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

దాదాపు సగానికి ఒరిగిపోయి ఉన్న ఈ రవాణా నౌకను తిరిగి సముద్రంపై ప్రయాణించేలా చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. ఈ నౌక బరువు దాదాపు 51,000 టన్నులు.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

వాస్తవానికి ఈ షిప్‌లో 5400 కార్లను తీసుకువెళ్లవచ్చు. అయితే, కేవలం 1400 వాహనాలను మాత్రమే తరలిస్తున్నప్పుడు ఓవర్‌లోడ్ కారణంగా ఇది పక్కకి ఒరిగిపోయే ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కడలి పాలైన 1200 లగ్జరీ కార్లు

విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ నౌకలో ఇప్పటి 500 టన్నులకు పైగా ఇంధనం ఉంది. ఇలా షిప్ ఒరిగిపోవటం వలన ఇంధనం లీక్ అయినట్లయితే, అది సముద్రంపై తెట్టులా పేరుకొని జలచరాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉంది.


Most Read Articles

English summary
A cargo ship carrying 1400 vehicles has been grounded off the Isle of Wight. The ship, carrying goods and cars worth millions was grounded deliberately by the ship's crew for reasons unknown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X