కారును చీల్చిచెండాడిన శునకాల గుంపు!!

Written By:

ఓ కుక్కల గుంపు పార్క్ చేసి ఉన్న కారు మీద దాడి చేసి ధ్వంసం చేయడాన్ని ఎప్పుడైనా చూశారా...? అయితే ఇవాళ్టి కథనాన్ని.. ఇందులోని వీడియోని చూడాల్సిందే. టర్కీలో ఆర్థరాత్రి రోడ్డు మీద పార్క్ చేసిన కారు మీద ఓ శునకాల గుంపు దాడి చేసింది.

ఇంతకీ ఇన్ని కుక్కలు ఒక్కసారిగా కారు మీద పడి, దానిని అంతగా ఎందుకు ధ్వంసం చేశాయో తెలుసా... కారు ముందు వైపు డిక్కీ లోపల ఓ పిల్లి దాక్కుంది అనే నెపంతో అన్ని కుక్కలు మూకుమ్మడిగా ఇలా చేశాయి.

టర్కీలో సెక్యురిటీ కెమెరాలో రికార్డయిన ఫుటేజీని పరిశీలిస్తే, తొలుత రెండు మూడు కుక్కలు వచ్చి కారు దగ్గర గట్టిగా అరుపులు చేయడం ప్రారంభించాయి. కాసేపటికి ఆ చుట్టు ప్రక్కల ఉన్న కుక్కలన్నీ కారును చుట్టుముట్టడం జరిగింది.

కారు ముందు భాగంలో ఉన్న ఫ్రంట్ బంపర్‌ను ఓ కుక్క తన పళ్లతో బలంగా పెకిలించడం ప్రారంభించింది, కాసేపటికి సగానికి పైగా బంపర్‌ను చీల్చేసి కారు నుండి వేరు చేసింది.

కుక్కల దాడి క్రమంలో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అసెంబుల్ పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇక మిగతా కుక్కలన్నీ బానెట్ క్రింద ఇంజన్ భాగంలో ఉన్న పిల్లిని వేటాడసాగాయి.

అయినప్పటికీ పిల్లిని పట్టుకోలేకపోయాయి కుక్కలు, ఇంతలో మరో కుక్క అలాగే ఉండిపోయిన మిగతా ఫ్రంట్ బంపర్‌ను పూర్తిగా లాగిపడేసింది. క్రింద గల వీడియో చివర్లో బంపర్ మొత్తాన్ని పెకిళించివేయడాన్ని చూడవచ్చు.

ఐకమత్యం ఎంత శక్తివంతమైనదో... ఇక్కడ ఉన్న వీడియోలో కుక్కలు నిరూపించాయి.

English summary
Read In Telugu Pack Of Dogs Rip A Car Apart To Find Their Eternal Foe
Please Wait while comments are loading...

Latest Photos