బాబర్ 3 అణు క్షిపణి పరీక్ష బూటకమని తేల్చిన సాంకేతిక విశ్లేషకులు

సోమవారం (09/01/2017) నాడు హిందూ మహాసముద్రం నుండి జలాంతర్గామి సాయంతో ప్రయోగించిన బాబర్-3 అణుక్షిపణి అంతా బూటకమే అని నిపుణులు తేల్చితెబుతున్నారు.

Written By:

హిందూ మహాసముద్రంలో జలాంతర్గామి నుండి ప్రయోగించిన అణ్వస్త్ర సామర్థ్యమున్న క్షిపణి బాబర్-3 ను విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. దీని తాలూకు ఫోటోలు మరియు వీడియోను ఇంటర్నెట్ ద్వారా పంచుకుంది. అయితే సాంకేతిక నిపుణులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పాక్ ప్రయోగించిన బాబర్-3 క్షిపణి అంతా బూటకమే అని తేల్చి చెబుతున్నారు.

హిందూ మహాసముద్రంలో జలాంతర్గామి నుండి ప్రయోగించిన అణ్వస్త్ర సామర్థ్యమున్న క్షిపణి బాబర్-3 ను విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. దీని తాలూకు ఫోటోలు మరియు వీడియోను ఇంటర్నెట్ ద్వారా పంచుకుంది. అయితే సాంకేతిక నిపుణులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి పాక్ ప్రయోగించిన బాబర్-3 క్షిపణి అంతా బూటకమే అని తేల్చి చెబుతున్నారు.

పాకిస్తాన్ అధికారులు వెలువరించిన కథనం మేరకు హిందూ మహాసముద్రంలో గుర్తు తెలియని ప్రదేశం నుండి జలాంతర్గామి ఆధారంగా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న బాబర్-3 క్షిపణిని విజయంవంతంగా ప్రయోగించినట్లు తెలిసింది.

ఈ క్షిపణి కేవలం 8 సెకన్ల వ్యవధిలో గంటకు 6750 కిలోమీటర్ల వేగంతో సుమారుగా 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది. అయితే క్యానిస్టర్ ఆధారంగా ప్రయోగించిన క్షిపణి 8 సెకన్ల పాటు ప్రయాణించిందా అంటూ రాజ్ అనే విశ్లేషకుడు ట్విట్టర్ ద్వారా ప్రశ్నను సందించాడు.

బాబర్-3 క్షిపణిని ప్రయోగించినట్లు నమ్మించడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వీడియో మరియు ఫోటోలను విడుదల చేసి తద్వారా చెయ్యని ప్రయోగాన్ని చేసినట్లు పాక్ నమ్మించే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు సాంకేతిక నిరూపిస్తున్నారు.

వీడియో ప్రకారం బాబర్-3 క్షిపణి తెలుపు రంగు నుండి నారింజ రంగులోకి మారిందని ఇమేజరీ ఎక్స్‌పర్ట్ వినాయక్ భట్ పేర్కొన్నారు. అంతే కాకుండా మిస్సైల్ అంత వేగంతో ప్రయాణించడం అసాధ్యం అని తెలిపాడు.

ప్రస్తుతం ప్రపంచ దేశాలు తమ దేశ రక్షణ కోసం అన్ని రకాల ఆయుధాలను తయారు చేసుకుంటున్నాయి. అందులో ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం మిస్సైళ్లను సాంకేతికంగా అభివృద్ది చేసుకుంటున్నాయి. అయితే మిస్సైళ్ల పరంగా వెనకబడిన పాకిస్తాన్ ప్రపంచ దేశాలను నమ్మించేందుకు పాక్ ఇలాంటి బూటక్ ప్రయోగాలను ఆశ్రయిస్తోంది.

ఇండియన్ అగ్ని-V కారణంగా ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత
అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్‌ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.

విడుదలైనప్పటి నుండి ఇండియాలో భారీ విక్రయాలు నమోదు చేసుకున్న భారత సామాన్య జనప్రియ కారు స్విప్ట్‌ను 2017 వెర్షన్‌గా మూడవ తరం స్విఫ్ట్‌గా ఈ ఏడాది ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతోంది. జపాన్ డిజైన్ శైలిలో వస్తోన్న దీనిని చూడాలనుకుంటే ఇక్కడున్న గ్యాలరీ మీద క్లిక్ చేయండి...
 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Wednesday, January 11, 2017, 18:28 [IST]
English summary
Pakistans Babur 3 Cruise Missile Launch Fake Say Some Indian Experts
Please Wait while comments are loading...

Latest Photos