ట్యాక్సీలో పసిపాపను మరిచిపోయిన జంట: చివరికి ఏమైందో తెలుసా ?

ఓ ట్యాక్సీలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఓ జంట కారు వెనుక సీటులో ఉంచిన పాపను తీసుకోవడం మరిచిపోయారు. కాసేపటి తరువాత బిడ్డను గుర్తుకుతెచ్చుకుని బయటకు వెళితే ట్యాక్సీ వెళ్లిపోయింది.

Written By:

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఓ జంట ట్యాక్సీలో విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇద్దరూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లిన తరువాత ట్యాక్సీలో మరిచిపోయిన తమ పాపను గుర్తుకుతెచ్చుకున్నారు. బయటకు వెళ్లి చూస్తే ట్యాక్సీ అక్కడి నుండి వెళ్లపోయింది. ఆ దంపతులు ఏం చేసారు ? తమ పాపను తిరిగి ఎలా పొందారు ? అరబ్‌లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలు....

గల్ఫ్‌కు చెందిన ఓ జంట టూర్ కోసం అరబ్ వెళ్లారు, తమ విహారయాత్రను పూర్తి చేసుకుని సొంత నగరానికి బయలుదేరే క్రమంలో ఓ ట్యాక్సీ తీసుకుని ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అయితే ట్యాక్సీ వెనుక సీటులో ఉన్న పాపను తీసుకోవడం మరిచిపోయారు.

లగేజ్ మొత్తం తీసుకుని విమానశ్రయంలోకి వెళ్లిన తరువాత తన భార్య వద్ద బిడ్డ లేకపోవడాన్ని గమనించిన తండ్రి వెంటనే బయటకు వచ్చి చూస్తే ట్యాక్సీ లేదు.

మరి కాసేపట్లో విమానం ప్రయాణానికి సిద్దమవుతుండగా, వీరిద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ విషయమై వెంటనే విమానాశ్రయ అధికారులను సంప్రదించారు.

ఎయిర్ పోర్ట్ పోలీసులు ఆ ప్రాంతానికి సమీపంలోని అరబ్ రవాణా అధికారిని అప్రమత్తం చేశారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ జిపిఎస్ సహకారంలో ఏఐ రికా వీధుల్లో ఈ జంట ప్రయాణించని కారును ట్రాక్ చేసి గుర్తించారు.

వెంటనే కారులో పాప ఉన్న విశయం గురించి డ్రైవర్‌కు వివరించగా, వెంటనే డ్రైవర్ కారులోని వెనుక సీటును గమనించాడు. అదృష్టవశాత్తు పాప సురక్షితంగా నిద్రపోతోంది.

క్షణం ఆలస్యం లేకుండా హుటాహుటిన పాపను తీసుకుని అదే కారులో ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని ఆ దంపతులకు పాపను అప్పగించాడు.

ఈ జంట కారులో నుండి దిగిన తరువాత వెనుక వైపు గమనించలేదని డ్రైవర్ తెలిపాడు. ఇదే విశయమై పాపను ఎలా మరిచిపోయారని తండ్రిని ప్రశ్నిస్తే, నా భార్య వద్ద పాప ఉందనుకున్నానని పోలీసులకు వివరించాడు.

ఏదేమైనప్పటికీ స్వల్పంగా టెన్షన్ పడినా విమానం స్టార్ట్ అయ్యేలోపు పాప తల్లిదండ్రుల చెంతకు చేరింది, అదే విమానంలో ఆ జంట ప్రయాణానికి సిద్దమైంది.

కాబట్టి, పాఠకులారా..!. పార్క్ చేసిన కారులో చిన్న పిల్లల్ని ఉంచకండి. బాహ్య వాతారణంలోకంటే, కారులో ఊపిరి ఆడంటం చాలా వరకు కష్టతరం. చిన్నపిల్లలకు ఇది మరింత కష్టం. కాబట్టి మీతో పాటు చిన్నపిల్లల్ని కారులో తీసుకెళ్లేటపుడు వారి పట్ల కాస్త శ్రద్ద వహించండి....

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Parents Forget Baby In UAE Taxi On Way To Airport
Please Wait while comments are loading...

Latest Photos