ఫెర్డినాండ్ పోర్షే మొట్టమొదటి కారు ఓ ఎలక్ట్రిక్ కారు

By Ravi

భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదే అన్న సత్యం మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం వినియోగిస్తున్న శిలాజ ఇంధనాలు (ప్రకృతి సిద్ధంగా లభించే పెట్రోల్, డీజిల్ మొదలైనవి) కొంత కాలం తర్వాత భూమిలో వాటి నిల్వలు తగ్గిపోవటం లేదా పూర్తిగా ఖాలీ అయిపోవటం జరిగే అవకాశాలున్నాయి. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఆధారపడక తప్పుడు. అలాంటి ఓ మంచి ప్రత్యామ్నాయ ఇంధనమే బ్యాటరీ/ఎలక్ట్రిక్ పవర్.

వాస్తవానికి ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి అనుకుంటున్నాం కానీ, వీటి తయారీకి కొన్ని దశాబ్ధాల ముందే బీజం పడింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ పోర్షే తొలుత తయారు చేసింది ఎలక్ట్రిక్ కారునే అనే విషయం మీకు తెలుసా..? 1898లో ఫెర్డినాండ్ పోర్షే (పోర్షే సంస్థ వ్యవస్థాపకుడు) తన 22వ ఏట తొలి కారును డిజైన్ చేశాడు.

అదొక విద్యుత్‌తో నడిచే కారు. దీని అధికారిక పేరు 'ఎగ్గర్-లోహ్నర్ ఎలక్ట్రిక్ వెహికల్ సి.2 ఫేటాన్' మోడల్. అనధికారికంగా దీనిని 'పి1' అని పిలిచేవారు. ఈ కారు ఇటీవలే ఓ ఆస్ట్రియన్ గ్యారేజ్‌లో బయటపడింది. 1902వ సంవత్సరం నుంచి ఈ కారును టచ్ చేయకుండా అలానే ఉంచారు. స్టట్‌గార్ట్ లోని పేర్షే మ్యూజియంలో ఈ తొలి పోర్షే ఎలక్ట్రిక్ కారును ఇటీవలే ఆవిష్కరించారు.

మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

ఆస్ట్రియాలోని మాఫెర్స్‌డార్ఫ్‌లో 1875వ సంవత్సరంలో జన్మించిన ఫెర్డినాండ్ పోర్షే, తన తండ్రి మాదిరిగా క్రాఫ్ట్‌మ్యాన్ (కొయ్య బొమ్మలు తయారు చేసే వ్యక్తి) కావాలనుకున్నాడు. అయితే, అతని దృష్టి విద్యుత్ రంగంపైకి మారింది. ఆ తర్వాత 1893లో ఫెర్డినాండ్ వియన్నాలోని ఓ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థలో అప్రంటీస్ చేసేందుకు వెళ్లాడు.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

ఆ కంపెనీలో ఫెర్డినాండ్ తన నైపుణ్యంతో త్వరితగతిన వృద్ధి చెంది, అందులో టెస్టింగ్ విభాగానికి హెడ్ అయ్యారు. ఆయన అదే కంపెనీలో పనిచేస్తుండగా, క్యారేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన 'జాకబ్ లోహ్నర్' హెడ్ లడ్‌వింగ్ లోహ్నర్‌ను కలిశారు. ఆ తర్వాత ఫెర్డినాండ్ తన అమెరికా పర్యటన సందర్భాల్లో లోహ్నర్‌ను తరచూ కలవటం, గుర్రపు జట్కా బండ్ల కాలం ముగుస్తుండటంతో ఓ ఎలక్ట్రిక్ అండ్ గ్యాస్ పవర్డ్ వాహనాలను తయారు చేద్దామని ఫెర్డినాండ్‌ను ఒప్పించడంతో ఈ ఆలోచనకు బీజం పడింది.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

వీరిద్దరి కృషి ఫలితంగా.. జూన్ 26, 1898లో వియన్నా రోడ్లపై ఓ ఎలక్ట్రిక్ వాహనం పరుగుల తీసింది. అదే 'పి1' ఎలక్ట్రిక్ కార్. ఫెర్డినాండ్ పోర్షే ఈ కారును నిర్మించారు. 'ట్యూడార్' బ్యాటరీల ద్వారా నడిచే ఓ 'ఆక్టాగనల్ ఎలక్ట్రిక్ మోటార్' (8 వైపుల డిజైన్ కలిగి ఉండే మోటార్ కావంటో ఆ పేరు వచ్చింది)ను కారును వెనుక భాగంలో అమర్చారు.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

అప్పట్లో మోటార్ బరువే 287 పౌండ్లు ఉండగా, బ్యాటరీల బరువు 1100 పౌండ్లు ఉండేది. మొత్తం కారు బరువు 2997 పౌండ్లుగా ఉండేది. ఈ మోటార్ 12-స్పీడ్ సిస్టమ్ (6 ఫార్వార్డ్ గేర్స్, 2 రివర్స్ గేర్స్, 4 గేర్లను బ్రేకింగ్ కోసం ఉపయోగించే వారు)తో కంట్రోల్ చేయబడేది. ఇది గరిష్టం గంటకు 21 మైళ్ల (34 కిలోమీటర్ల) వేగంతో పరుగులు తీసేది.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకుంటే 49 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేకాదు.. అప్పట్లోనే ఇది ఓ కన్వర్టిబల్ టైప్ కారు. సీజన్‌ను బట్టి దీనిని ఓపెన్ చాసిస్ కారులా లేదా కూపే కారులా మార్చుకునే వెసలుబాటు ఉండేది. సెప్టెంబర్ 1899లో ఫెర్డినాండ్ పోర్షే తన పి1 కారును బెర్లిన్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ మోటార్ వాహన ప్రదర్శనకు తీసుకువెళ్లాడు.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

మొత్తం 120 ఎగ్జిబిటర్లు ప్రదర్శించిన 19 ఎలక్ట్రిక్ కార్లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఎలక్ట్రిక్ కార్ల 24 మైల్ రోడ్ రేస్‌లో పోర్షే తన పి1 కారును నడిపి, విజయం సాధించాడు (ఈ రేసులో కారులో డ్రైవర్‌తో కలిపి నలుగురు ప్యాసింజర్లు ప్రయాణించాలి). ఇందులో 8.6 కిలోమీటర్ల హైస్పీడ్ సెక్షన్, 7.8 కిలోమీటర్ల ఎఫీషియెన్సీ టెస్ట్ ఉండేవి.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

బెర్లిన్ ఎగ్జిబిషన్ తర్వాత ఫెర్డినాండ్ పోర్షే జాకబ్ లోహ్నర్ కంపెనీ ఛీఫ్ డిజైనర్‌గా మారిపోయాడు. ఆ తర్వాత 1900వ సంవత్సరంలో నాలుగు చక్రాలలో ఎలక్ట్రిక్ వీల్ హబ్ మోటార్లను అమర్చిన ఓ స్పోర్ట్స్ కారును తయారు చేసి ప్రపంచం దృష్టికిని ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. ఈ స్పోర్ట్స్ కారే ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి ఆల్-వీల్ డ్రైవ్ ప్యాసింజర్ వెహికల్‌గా రికార్డు కూడా సృష్టించింది.

ఫెర్డినాండ్ పోర్షే తొలి ఎలక్ట్రిక్ కారు

పోర్షే తన పేరుతో 1931లో సంస్థను స్థాపించడానికి ముందు ఆస్ట్రో-డైమ్లర్, డైమ్లర్-బెంజ్, స్టేయ్ర్ వంటి కంపెనీలకు కార్లను డిజైన్ చేసి పెట్టాడు. పోర్షే పేరుతో (బ్రాండ్‌తో) వచ్చిన మొట్టమొదటి కారు 'టైప్ 356', 1948లో దీనిని విడుదల చేశారు. ఆ తర్వాత పోర్షే క్రమక్రమంగా వృద్ధి చెందుతూ వచ్చి, నేడు ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ కార్లను అందజేసే సంస్థగా అవతరించింది. ఇదీ పోర్షే హిస్టరీ.. మీకు నచ్చిందా..?

Most Read Articles

English summary
Porsche is one among those early automobile companies with a rich racing heritage with several wins to its credit throughout history. A habit that continues to this day. Turns out this is a habit that started very early. As early as the very first Porsche.
Story first published: Sunday, March 30, 2014, 7:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X