పాల్ వాకర్ మరణించిన కారును పరిశీలించనున్న పోర్షే

By Ravi

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు పాల్‌ వాకర్‌ (Paul Walker) కొద్ది రోజుల క్రితం ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే. ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్ యాక్సిడెంట్‌లో పాల్ వాకర్ తుదిశ్వాస విడిచాడు.

కాగా.. ఈ కారు ప్రమాదానికి సంబంధించి, యాక్సిడెంట్ ఏవిధంగా జరిగి ఉండొచ్చనే కోణంలో అటు పోలీస్ అధికారులు, ఇటు పోర్షే కంపెనీ ఇంజనీర్లు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉంటానికి కారణం ఏంటో, విచారణ చేయాల్సింది లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరిఫ్ డిపార్ట్‌మెంట్ అధికారులు పోర్షేను కోరినట్లు సమాచారం. ఇప్పటికే పలు సంస్థలు ఈ ప్రమాదంపై విచారణ జరుపుండగా, అందులో ఏ ఒక్కటి కూడా ఓ కొలిక్కి రాలేదు.

మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

పాల్ వాకర్ కార్ యాక్సిటెంట్

పౌల్ వాకర్ తన స్నేహితుడి 'పోర్షే కరెరా జిటి' (Porsche Carrera GT) స్పోర్ట్స్ కారులో కాలిఫ్లోర్నియాలోని శాంతా క్లారిటాకు వెళ్తుండగా, కారు అదుపు తప్పి, రోడ్డుకు పక్కగా ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగటం, ఆ మంటలు శరవేగంగా కారును చుట్టేయడంతో, పాల్ వాకర్ కారులోనే ప్రాణాలొదిలాడు.

పాల్ వాకర్ కార్ యాక్సిడెంట్

అయితే, ప్రమాద సమయంలో పాల్ వాకర్ డ్రైవర్ సీటులో లేడు. తన స్నేహితుడు కారు నడుపుతుండగా, పౌల్ వాకర్ కో-ప్యాసింజర్ సీట్లో కూర్చొన్ని ఉన్నాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

పాల్ వాకర్ కార్ యాక్సిడెంట్

ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్షే కరెరా జిటి కారులో వెళ్తుండగానే, పౌల్‌కు ప్రమాదం జరిగింది. పౌల్ వాకర్ జీవించి ఉండగా తీసిన చివరి ఫోటో ఇది. పౌల్ శాంటా క్లారిటాకు బయలుదేరే ముందుగా ఈ ఫొటో తీశారు. పోర్షే ఈ కారు శకలాలను పరిశీలించనుంది.

పాల్ వాకర్ కార్ యాక్సిడెంట్

ఇప్పటి వరకు మొత్తం 6 ఎడిషన్‌ల ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలు రాగా, పాల్ వాకర్ ఇందులో టోక్యో డ్రిఫ్ట్ చిత్రం మినహా మిగిలిన అన్ని చిత్రాల్లోను నటించాడు. ప్రస్తుతం 7వ ఎడిషన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా తెరకెక్కుతోంది.

పాల్ వాకర్ కార్ యాక్సిడెంట్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌తో పాటుగా పౌల్ వాకర్ అనేక హాలీవుడ్ చిత్రాల్లో నటించాడు. పౌల్ చివరి చిత్రం 'పాన్ షో క్రానికల్స్' అనే కామెడి డ్రామా. ఈ చిత్రంలో పౌల్‌తో పాటుగా మ్యాట్ డిల్లన్, బెర్నాండ్ ఫ్రాసెర్‌లు నటించారు.

Most Read Articles

English summary
According to a recent report, the Los Angeles County Sheriff’s Department has called upon Porsche engineers to examine what’s left of Paul Walker’s Carrera GT to determine the cause of his fatal accident.
Story first published: Friday, December 20, 2013, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X