భారత రవాణా చరిత్రకు జ్ఞాపకార్థకంగా కొత్త స్టాంపులను విడుదల చేసిన తపాలా శాఖ

Written By:

దేశీయంగా ఆటోమోటివ్ పరిశ్రమలో సంభవించిన మార్పులు, వివిధ రవాణా పద్దతుల్లో జరిగిన అభివృద్దికి గుర్తుగా భారత తపాలా శాఖ సుమారుగా 20 పోస్టల్ స్టాంపులను విడుదల చేసింది. దేశీయ రవాణా రంగంలో జరిగిన వివిధ రకాల రవాణా పద్దతులకు సూచకంగా ఈ స్టాంపులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

దేశీయ రవాణాలో జరిగిన మార్పులను గుర్తుకు చేస్తూ, తపాలా శాఖ ఒకే సారి 20 స్టాంపులను విడుదల చేయడం ఇదే ప్రథమం.

రవాణా కోసం ప్రారంభంలో వినియోగించిన పల్లకీలు, గుర్రపు జట్కాలు, ఎద్దుల బండ్లు, రిక్షాలు, తొలనాళ్లలో వినియోగించిన కార్లుతో పాటు ఆధునిక బస్సులు, రైళ్లు మరియు మెట్రో రైళ్లకు ఈ స్టాంపుల్లో స్థానం కల్పించడం జరిగింది.

యుగపు రవాణా సాధనాలు' అనే వాక్యాన్ని ముద్రించి ఈ ప్రత్యేకమైన స్టాంపులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. భారత దేశపు ఏకైక రవాణా మ్యూజియమ - హెరిటేజ్ రవాణా మ్యూజియమ్ లో ప్రదర్శించారు.

ఒకానొక కాలంలో దేశీయ రవాణాలో కీలకపాత్ర పోషించి, ప్రస్తుతం ఈ మ్యూజియమ్‌లో ఉన్న 15 వాహనాలకు గౌరవార్థంగా ఈ ప్రత్యేక స్టాంపులను విడుదల చేయడం జరిగింది. ఈ అన్ని విభిన్నమైన రవాణా స్టాంపులకు మ్యూజియమ్‌లో స్థానం కల్పించారు.

తపాలా శాఖ విభాగం గురుగ్రామ్ రీజియన్, హర్యాణా సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ కలప్నా రాజ్‌సింగ్‌హోత్ ఈ స్టాంపులను అధికారికంగా ఆవిష్కరించారు.

హెరిటేజ్ రవాణా ట్రస్టు ఫౌండర్ మరియు ట్రస్ట్ నిర్వాహకుడు తరుణ్ థక్రల్ గారు స్మారక వేదిక మీద ఈ స్టాంపులను ప్రెజెంట్ చేశారు.

స్మారక తపాలా బిళ్లలను ప్రెస్టేజ్ బుక్‌లెట్ రూపంలో ప్రింట్ చేసారు. వీటి ధరల శ్రేణి రూ. 5 నుండి రూ.25 ల మధ్య ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Postal Department Releases Stamps To Commemorate History Of Transport In India
Please Wait while comments are loading...

Latest Photos