యాక్సిడెంట్ చేసి పారిపోతున్న అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన ప్రీతి జింటా

By Ravi

బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీల్ లైఫ్‌లో హీరోయిన్‌గా నటించే ప్రీతి రియల్ లైఫ్‌లో కూడా నిజమైన హీరోయిన్ అనిపించుకుంది. గత ఆదివారం ప్రీతి జింటా తన కారులో ఎయిర్‌పోర్ట్ వెళ్తుండగా, హైవేపై అడ్డంగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ తెలుపు రంగు అంబులెన్స్ ఢీకొట్టి, అక్కడి నుంచి పారిపోయింది. ఇది గమనించిన ప్రీతి జింటా సదరు అంబులెన్స్ ఛేజ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే, మితిమీరిన వేగంతో వెళ్తున్న అంబులెన్స్‌ను ఆమె క్యాచ్ చేయలేకపోయింది.

ఈ విషయాన్నంతా ప్రీతి జింటా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రీతి జింటా చెన్నై వెళ్లటం కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లారని, తాను అంబులెన్స్ ఛేజ్ చేస్తుండటంతో ఆ వ్యక్తికి సాయం చేయలేకపోయాని, అతను ఆరోగ్యంగానే ఉంటాడని భావిస్తున్నానని ఆమె ట్వీట్ చేశారు. యాక్సిడెంట్ చేసిన అంబులెన్స్‌ను తను క్యాచ్ చేయలేకపోయినప్పటికీ, సదరు అంబులెన్స్‌ను రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను నోట్ చేసుకున్నాని ఆమె పేర్కొంది.

ఆ అంబులెన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ MH O4 FP 1634 అని ఆమె ట్వీట్ చేసింది. ఇలా అడ్డంగా రోడ్డు దాటడం తప్పే అయినప్పటికీ, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అంబులెన్సే ఢీకొట్టి పారిపోవటం విషాదమని అన్నారు. ప్రజలు ఇలా గుడ్డిగా ఎందుకు రోడ్డు దాటుతారో తనకు అర్థం కావడలేదని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆమె అన్నారు. ఏదేమైనప్పటికీ, ఈ విషయంలో ప్రీతి జింటా ఇతరుల మాదిరిగా చూసి చూడనట్లు వెళ్లిపోకుండా ఆ అంబులెన్స్‌ను క్యాచ్ చేయటానికి ప్రయత్నించడం చెప్పుకోదగిన విషయం. అయితే, అంబులెన్స్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎలాంటి సమాచారం లేదు.

Preity Zinta
Most Read Articles

English summary
Bollywood actress Preity Zinta played the good Samaritan on Sunday on the way to the airport when she spotted a man being struck down by an ambulance in a case of hit and run. Zinta tweeted to her followers that she saw a white ambulance hit an man crossing the road as she was on her way to the airport to take a flight to Chennai.
Story first published: Monday, April 22, 2013, 16:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X