క్వాడ్రోఫోయిల్: తొలి ఎలక్ట్రిక్ హైడ్రోఫోయిల్ స్పోర్ట్స్ బోట్

By Ravi

మనం ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ కార్లు చూశాం, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు చూశాం. కానీ, ఇకపై ఎలక్ట్రిక్ బోట్‌లను కూడా చూడనున్నాం. అలాంటి ఓ ఎలక్ట్రిక్ బోట్ కాన్సెప్టే ఈ 'క్వాడ్రోఫోయిల్' (Quadrofoil). ఇదొక ఎలక్ట్రిక్ హైడ్రోఫోయిలింగ్ పర్సనల్ వాటర్‌క్రాఫ్ట్ (పిడబ్ల్యూసి).

పేరుకు తగినట్లుగానే క్వాడ్రోఫోయిల్, నాలుగు హైడ్రోఫోయిల్స్‌ను ఉపయోగించుకొని సులువుగా నావిగేట్ చేసుకుంటుంది. ఇదొక అత్యంత తేలికైన మరియు పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైన వాటర్‌క్రాఫ్ట్. నాలుగు హైడ్రోఫోయిల్స్ కారణంగా క్వాడ్రోఫోయిల్ బాడీ నీటిపై తేలుతున్నట్లు అనిపిస్తుంది.

Quadrofoil

నీటిపై వెళ్తున్నప్పుడు ఇది ఎలాంటి అలలను సృష్టించదు. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ కారణంగా, బోరుమనే రెగ్యులర్ కంబస్టియన్ శబ్ధం వినిపించదు. మొత్తమ్మీద దీనిని నీటిపై సవారీ చేస్తున్నప్పుడు, నీటిపై ఎగురుకుంటూ పోతున్న భావన కలుగుతుంది.

క్వాడ్రోఫోయిల్ సరస్సులు, నదులు, సముద్రాలు అలాగే మోటార్ బోట్స్ మరియు పర్సనల్ వాటర్‌క్రాఫ్ట్‌లను నిషేధించబడే మెరైన్ ప్రొటెక్ట్ ఏరియాల్లో సైతం నడిపేందుకు ఇది వీలుగా ఉంటుంది. ఇది నీటిపై గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్ల (21 నాట్స్) వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులోని బ్యాటరీలు కేవలం 2 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతాయి. పూర్తి చార్జ్‌పై 100 కిలోమీటర్ల (54 నాటికన్ మైళ్ల) దూరం ప్రయాణించవచ్చు. మరి ఆలస్యం ఎందుకు.. ఈ క్వాడ్రోఫోయిల్ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ooAAnZIgj8o?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Quadrofoil is an electric hydrofoiling personal watercraft (PWC), which provides the most economically efficient and completely environmentally friendly mode of recreational marine transportation. Due to hydrofoiling and patented steering technology, riding feels like flying onwater and provides an entirely new and thrilling water experience.&#13;
Story first published: Friday, October 31, 2014, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X