3.5 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును కొనుగోలు చేసిన బార్బర్

Written By:

స్వయం కృషి సినిమా గురించి తెలియని వారు ఉండరు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన చిత్రం అనేక మందిలో స్పూర్తిని నింపింది. నిజమే కృషి చేయనిదే ఏదీ కూడా సిద్దించదని చెప్పే సూత్రాన్ని క్షవరం చేసే రమేష్ బాబు తన జీవితానికి అన్వయించుకున్నాడు. అదే ఇప్పుడు ఆయనను ఈ స్థాయిలో నిలిపింది.

అనేక లగ్జరీ కార్లు, కోట్ల సంపద, టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి యాజమాని అయ్యాడు. క్షవరం వృత్తితో రమేష్ బాబు ఈ స్థాయికి చేరుకున్నాడు. అయినా కూడా తన వృత్తిని మాత్రం వదులుకోలేకపోతున్నాడు.

రమేష్ బాబు గురించి చదువుతున్నపుడు స్వయం కృషి చిత్రంలో చిరంజీవి గుర్తొస్తున్నాడు కదూ... ఎంత సంపాదించినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన వృత్తిని మరిచిపోవద్దు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది.

ఒక్క వ్యక్తికి హెయిర్ కట్ చేస్తే వచ్చేది రూ. 75 లు. కానీ బెంగళూరుకు చెందిన రమేష్ బాబు రమేష్ బాబు సుమారుగా రూ. 3.2 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ మే బ్యాక్ కారును కొనుగోలు చేసాడు.

ఈ మెర్సిడెస్ మేబ్యాక్ కారును జర్మనీ నుండి దిగుమతి చేసుకున్నాడు. ప్రస్తుతం ఇలాంటి కారు బెంగళూరు మొత్తం మీద కేవలం మూడు మాత్రమే ఉన్నయి. ఒకటి ఇతని వద్ద, విజయ్ మాల్యా వద్ద మరియు బిల్డర్ వద్ద మరొకటి ఉంది.

రమేష్ బాబు ప్రస్తుతం ఓ సెలూన్‌తో పాటు రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. అయినప్పటికీ రోజుకు ఐదు గంటల పాటు తన షాపులో రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లకు హెయిర్ కట్ చేస్తున్నాడు.

రమేష్ బాబు ఫిబ్రవరి 2017లో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ కారును భారీ బ్యాక్ లోన్‌తో కొనుగోలు చేశాడు. ఇతని వద్ద మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ లకు చెందిన కార్లను కలిగి ఉన్నాడు. వీటిని ఇతని అద్దె కార్ల వ్యాపారం కోసం వినియోగిస్తున్నాడు.

రమేష్ బాబు ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ, బెంగళూరులో మెర్సిడెస్ మేబ్యాక్ కారును కలిగి ఉన్న మూడవ కస్టమర్ నేనే అని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపాడు.

దేవుడు నావంటే ఉన్నాడు, ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో శ్రమించానని. నా కోరిక ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రతి లగ్జరీ కారును కొనుగోలు చేయడమే అని తెలిపాడు. రోల్స్ రాయిస్ తరువాత మెర్సిడెస్ మేబ్యాక్ కారును నడపడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని చెప్పుకొచ్చాడు.

నేను పడ్డ బాధను ఎప్పటికీ మర్చిపోలేను.... మా నాన్న చనిపోయాక మా అమ్మగారు కష్టపడి పెంచారు. అమ్మను బాగా చూసుకోవడానికి సెలూన్ షాపును ప్రారంభించాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వృత్తిని ఎప్పుటికీ వదులుకోనని తెలిపాడు.

వ్యాపారరీత్యా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని ఖరీదైన లగ్జరీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు రమేష్ బాబు పేర్కొన్నాడు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Car Crazy Bangalore Barber Owns A Fleet Of Luxury Cars Including This Mercedes-Maybach
Please Wait while comments are loading...

Latest Photos