వేలంలో రూ.180 కోట్లు పలికిన అరుదైన 1950 ఫెరారీ 375 ప్లస్

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న కారును చూశారా? దీని పేరు 'ఫెరారీ 375 ప్లస్', 1950 దశకంలో దీనిని తయారు చేశారు. అప్పట్లో మోటారు రేసుల్లో ఈ కారే నెంబర్ వన్‌గా ఉండేది. ఫెరారీ కార్లలో కెల్లా అత్యంత అరుదైనది. ఈ మోడల్ కార్లను కేవలం ఐదు యూనిట్లు మాత్రమే తయారుచేశారట.

అత్యంత అరుదైన ఈ ఫెరారీ 375 ప్లస్ కారు 1954 స్పోర్ట్ కార్ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం ఈ పురాతన కారు వేలానికి వచ్చింది. బ్రిటన్‌కు చెందిన వేలం సంస్థ బోన్‌హామ్స్ గత శుక్రవారం బ్రిటన్‌లోని లీసెస్టర్‌లో దీన్ని వేలం వేయగా, ఇది ఏకంగా రూ.180 కోట్ల వెల పలికింది.

Ferrari 375 Plus

బ్రిటన్‌లో ఇప్పటివరకూ వేలం వేసిన కార్లలో అత్యంత ఖరీదైన కార్లలో ఫెరారీ 375 ప్లస్ కారు ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. గతంలో 1954 మోడల్ మెర్సిడెజ్ బెంజ్ కారు ఒకటి రూ.190 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ తర్వాత వేలంలో అత్యంత అధిక వెల పలికిన కారు ఇదే.

ఫెరారీ 375 ప్లస్ కారులో 4.9 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 330 బ్రేక్ హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పినిన్ ఫరీనా ఆల్ అల్లాయ్ ఓపెన్ బాడీవర్క్ ఫ్రేమ్‌పై దీనిని తయారు చేశారు. దీని గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లకు పైమాటే.

Most Read Articles

English summary
The first of five Ferrari 375-Plus racing cars is sold for £9,600,000 at the Goodwood Festival of Speed auction. The brutally fast 375-Plus was Ferrari's ultimate weapon to win the 1954 Sports Car Championship.
Story first published: Monday, June 30, 2014, 14:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X