అతిపొడవైన ట్రక్ జంప్ చేసి గిన్నిస్ రికార్డ్ సాధించిన రెనో ట్రక్

By Ravi

కార్లు, బైక్‌లో లాంగ్ జంప్ చేయటాన్ని మనం చూశాం. కానీ, లాంగ్ ట్రక్కుతో లాంగ్ జంప్ చేయటాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? చూడలేదా, అయితే ఈ వీడియోలో చూసేద్దాం రండి!

ఈఎమ్‌సి మరియు లోటస్ ఎఫ్1 బృందాలు కలిసి ఈ గిన్నిస్ రికార్డును సాధించాయి. ప్రపంచంలో కెల్లా అతిపొడవైన ట్రక్ జంప్ విభాగంలో ఈ రికార్డును సృష్టించారు. ఇందుకో భారీ రెనో ట్రక్‌ను ఉపయోగించారు. వేగంగా వచ్చిన రెనో ట్రక్ ఓ ఏటవాలు ట్రాక్‌పై నుంచి జంప్ చేస్తుంది. ఆ సమయంలో ట్రక్ క్రింది నుంచి ఫార్ములా వన్ కారు దూసుకుపోతుంది.

వళ్లు గగుర్పొడిచే ఈ స్టంట్‌ను యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సఫ్ఫోల్క్‌లో ఉన్న బెంట్‌వాటర్స్ వద్ద నిర్వహించారు. ఈ ట్రక్కును ప్రముఖ స్టంట్‌మ్యాన్ మైక్ రైయాన్ నడిపారు. ఈ ట్రక్ చేసిన లాంగ్ జంప్ దూరం 83 అడుగుల 7 ఇంచ్‌లు. ఈ స్టంట్ సమయంలో లోటస్ ఫార్ములా వన్ కారును మార్టిన్ ఇవనోవ్ నడిపారు. మరి ఆ స్టన్నింగ్ స్టంట్‌ను మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/TVBcEg6klJI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Renault truck jumps over Lotus F1 car and sets a Guinness World Record in UK. The record-breaking stunt was performed at Bentwaters Park, Suffolk in the United Kingdom with stuntman Mike Ryan behind the wheel of the truck.&#13;
Story first published: Tuesday, November 25, 2014, 15:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X