ట్రాఫిక్‌లో నెమ్మదిగా వెళ్లకపోతే ఇలానే జరుగుతుంది

By Ravi

సాధారణంగా మీరు ఎలాంటి వాహనాన్నైనా నడపటం నేర్చుకునే ముందు, మీకు సౌకర్యవంతమైన వేగాన్ని మాత్రమే మెయింటైన్ చేస్తూ నడపాలి. అలాకాకుండా, యాక్సిలేటర్ ఇంకా ఉంది కదా అని, మితిమీరిన వేగంతో నడిపితే ప్రమాదాలు కొని తెచ్చుకోవటం ఖాయం.

చాలా మంది కుర్రకారు అమ్మాయిలను ఇంప్రెస్ చేయటానికో లేక రోడ్డు పక్కన ఉండే వారి దృష్టిని ఆకట్టుకునేందుకో వేగంగా బైక్ నడుపుతుంటారు. వాస్తవానికి మీరు వేగంగా నడిపితే, మిమ్మల్ని ఎవ్వరూ గుర్తించరు. పైపెచ్చు తిట్ల దండకాలు కూడా మొదలెడతారు.

కాబట్టి, రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు (ప్రత్యేకించి రద్దీగా ఉండే రోడ్లపై) వేగాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. అకస్మాత్ యాక్సిలరేషన్, అనవసరమైన ఓవర్‌టేక్‌లను చేయకూడదు. ఇదిగో ఈ వీడియోలో చూడండి, వేగంగా వచ్చిన ఓ బైకర్ తన వేగాన్ని అదుపు చేయలేక ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ పెద్దగా గాయాలు కాలేదు. సదరు బైకర్ బైక్ మాత్రం నుజ్జు నజ్జుయ్యింది. అదే అతను లైన్ డిసిప్లైన్ పాటించి ఉండి, తన బైక్ వేగాన్ని నియంత్రించుకోగలిగి ఉన్నట్లయితే ఈ ప్రమాదం తప్పి ఉండేది. మీరేమంటారు..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/uZIfKojavx4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Here we found a video in which the biker is riding fast and soon approaches a spot where there are many cars and bikes moving slowly. However, the rider decides not to slowdown and cut lanes to bypass all.&#13;
Story first published: Wednesday, February 26, 2014, 10:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X