ఇదేం చోద్యం.. కారును తిరగేసి నడుపుతున్నాడేంటి..?

By Ravi

వెర్రి వేయి విధాలు, అందులో ఇదొకటి. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు రిక్ సుల్లివాన్, ఇతను ఇల్లినాయిస్‌కి చెందిన ఓ కార్ మెకానిక్. కారును అందరూ నడిపే మాదిరిగా కాకుండా, కాస్తంత వెరైటీగా నడపాలనుకున్నాడు. ఇంకేముంది, ఇదిగో కారును ఇలా తిరగేసి నడిపి అందరిచేత ఔరా అనిపించుకుంటున్నాడు.

రెండు పికప్ ట్రక్కులను ఉపయోగించి, వాహనం తిరగబడి ఉన్నట్లుగా ఉండేలా డిజైన్ చేశాడు. ఇందుకోసం సుల్లివాన్ 1991 ఫోర్డ్ రేంజర్ మరియు 1995 ఎఫ్-150 పికప్ ట్రక్కులను ఉపయోగించాడు. ఈ రెండింటినీ ఒక్కటిగా చేర్చి, పికప్ ట్రక్ పైభాగం క్రందకు, క్రింది భాగం పైకి (తలకిందులుగా) ఉండేలా మోడిఫై చేశాడు.

మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తలక్రిందుల పికప్ ట్రక్

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రిక్ సిల్లివాన్ తయారు చేసిన ఈ అప్‌సైడ్ (తలకిందుల) ట్రక్ రోడ్-లీగల్ కావటం. అంటే, ఈ ట్రక్కును రోడ్డుపై తిప్పుకోవటానికి ఇతనికి అనుమతి ఉంది.

తలక్రిందుల పికప్ ట్రక్

రిక్ తయారు చేసిన ఈ వింత ట్రక్కులో డ్రైవరు, కో-డ్రైవరుకు మాత్రమే సీట్స్ ఉంటాయి.

తలక్రిందుల పికప్ ట్రక్

ఈ ట్రక్కు తయారీ కోసం సుల్లివాన్ దాదాపు 6 నెలల సమయాన్ని, 6000 డాలర్ల మొత్తాన్ని వెచ్చించాండు.

తలక్రిందుల పికప్ ట్రక్

తిరబడిన ఓ ఫోర్డ్ రేంజర్‌ను తన బాడీ షాప్‌కు తీసుకెవెళ్లాల్సిందిగా సుల్లివాన్‌కు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు, తన మెదడులో ఈ ఆలోచన పుట్టిందిట.

తలక్రిందుల పికప్ ట్రక్

సుల్లివాన్ తయారు చేసే కార్లకు ముందుగా ఎలాంటి ప్రణాళిక ఉండదు, ఆ సమయంలో ఏయే భాగాలు అందుబాటులో ఉంటే, వాటితో కారును మోడిఫై చేస్తుంటాడు.

తలక్రిందుల పికప్ ట్రక్

సుల్లివాన్ ఈ అప్‌సైడ్ డైన్ పికప్ వాహనంలో రోడ్డుపై వెళ్తున్నప్పుడు, ప్రతి ఒక్కరూ కళ్లు తిప్పుకొని, అతనివైపు చూడాల్సిందే.

తలక్రిందుల పికప్ ట్రక్

తొలిసారిగా చూసినప్పుడు అసలు ఇదేం వాహనం అనిపిస్తుంది, రెండోసారి చూసినప్పుడు ఇది ఓ తిరగబడిన ట్రక్ అని తెలుస్తుంది.

తలక్రిందుల పికప్ ట్రక్

ఒక్కసారైతే.. ఈ వాహనం నడుపుతున్నప్పుడు పోలీసుల బృందం సుల్లివాన్ వెంట్ రావటం, అతనికి కొంత భయాన్ని కలిగించిందట.

తలక్రిందుల పికప్ ట్రక్

అయితే, అలా వచ్చిన పోలీసులు అతడినేమీ అనకుండా, వారి సెల్‌ఫోన్‌లను బయటకు తీసి, కారును అన్ని యాంగిల్స్ నుంచి ఫొటోలు తీసుకోవటం ప్రారంభించారట.

Most Read Articles

English summary
What's the strangest pickup truck you have seen? Get behind the wheel of this pickup truck and you will surely turn heads.
Story first published: Friday, March 27, 2015, 16:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X