రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్న జపాన్ !

By Anil

ప్రపంచంలో మొట్టమొదటి సారిగా జపాన్‌ వారు రోబోలను ఉపయోగించి అద్దె కార్లను నడపాలని ప్రయోగాత్మకంగా ప్రయత్నించారు. అయితే త్వరలోనే జపాన్ రహదారుల్లో ఈ మానవ రహిత ట్యాక్సిలు తిరగనున్నాయి.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: అమ్మకాలకు సిద్దమైన రేంజ్ రోవర్ స్పోర్ట్ యస్.వి.ఆర్ : ధర, ఫీచర్స్..

మానవజాతి ఎన్నో విధాలుగా రోబోలను ఉపయోగించుకుంటూనే ఉంది. రోబో సినిమాలో ఉన్న రోబో ఎంత అడ్వాన్స్ గా ఉందో చూశారు కదా మరి అలాంటి నాటకీయ పరిణామాలకు జపాన్ దేశస్థులు ప్రాణం పోస్తున్నారని చెప్పవచ్చు.
మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు: పోలో లిమిటెడ్ ఎడిషన్ విడుదల: అక్టోబర్ 9 నుండి అందుబాటులోకి

ఈ ట్యాక్సిని నడిపిన రోబో గురించి క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.......

ఉమ్మడి భాగస్వామ్యంతో :

ఉమ్మడి భాగస్వామ్యంతో :

ఈ రోబో ట్యాక్సిని రెండు ఉమ్మడి సంస్థలు కలిసి రూపొందించారు, అవి జడ్.ఎమ్.పి అనే ఆటోమెటిక్ కార్లను అభివృద్ధి చేసే సంస్థ మరియు మొబైల్ ఇంటర్‌నెట్ సేవలకు చెంది దేనా సంస్థ. వీరి ఇద్దరి ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ రోబో ట్యాక్సి ప్రాణం పోసుకుంది.

ఎక్కడ ప్రవేశపెట్టారు :

ఎక్కడ ప్రవేశపెట్టారు :

జపాన్ రాజధాని నగరం అయిన టోక్యో సమీపంలోని బీచ్‌లో వీటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ రోబో ట్యాక్సిలు ఒక ప్రత్యేతమైన డాటా బేస్ అప్లికేషన్ ఆధారంతో సాధారణ రోడ్ల మీద పరుగులు పెట్టనున్నాయి.

నివాసితులకు ఉపయోగకరంగా :

నివాసితులకు ఉపయోగకరంగా :

జపాన్ లోని పియూజికావా నగరంలో వ్యాపార కేంద్రాలకు దగ్గరగా మరియు షాపింగ్ మాల్స్‌లో నివసిస్తున్న వారి సౌకర్యార్థం వీటిని అందుబాటులోకి తెచ్చారు. రోబో కేవలం మూడు కిలోమీటర్లు దూరం వరకు మాత్రమే నడుపుతుంది.

భధ్రత :

భధ్రత :

ఈ రోబో ట్యాక్సిలను పూర్తిగా భధ్రత లక్షణాలతో తయారు చేశారు. ఈ రోబో ట్యాక్సి డ్రైవర్ భద్రత పరంగా ఎప్పుడూ పర్యవేక్షిస్తు ఉంటుంది. ఒక వేళ ప్రమాదం ఉందని తలచిందంటే ముందుగానే హెచ్చరికలను జారి చేస్తుంది.

ప్రయోజనం :

ప్రయోజనం :

2020 లో జపాన్‌లో జరగనున్న ఒలంపిక్స్ క్రీడల సంధర్భంగా ఈ రోబో ట్యాక్సిలను ఉపయోగించనున్నారు. క్రీడల సందర్భంగా వచ్చే ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని కలిగిచాలని భావిస్తున్నారు.

ప్రమాదాలు :

ప్రమాదాలు :

ప్రస్తుతం డ్రైవర్ల యొక్క చెత్త డ్రైవింగ్ వలన ప్రమాదాల చాలా ఎక్కువా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోబో ట్యాక్సలను ఉపయోగించడం వలన ప్రమాదాల సంఖ్యను బాగా తగ్గించవచ్చని రవాణా రంగం నిపుణుల అభిప్రాయపడుతున్నారు.

గణనీయంగా :

గణనీయంగా :

2013 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 75 సంవత్సరాల వయస్సులోపు ఉన్న డ్రైవర్ల సంఖ్య దాదాపుగా 4.25 మిలియన్. ప్రస్తుతం ఈ సంఖ్య ఐదుకు చేరిఉంటుందని అంచనా. అయితే కొత్త నిభందనల ప్రకారం ఎవరయితే వేలిముద్రలను నమోదు చేసుకుని ఉంటారో వారు మాత్రమే డ్రైవింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

టెస్ట్ డ్రైవ్ :

టెస్ట్ డ్రైవ్ :

రోబోల పని తీరు ప్రయోగాత్మంగా పరీక్షించిన తరువాత. దీనిని పియూజికా నగరంలో వచ్చే ఏడాది మార్చి నుండి వాడుకలోకి తీసుకురానున్నారు.

Most Read Articles

English summary
Robot Taxis to transport spectators for the 2020 Tokyo Olympics.
Story first published: Saturday, October 10, 2015, 18:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X