కోటి రూపాయల రోల్స్ రాయిస్ కారును ఢిల్లీ రోడ్ల నుండి బ్యాన్ చేసిన NGT!

Written By:

1996 లో అశోక్ కుమార్ జైన్ అనే వ్యక్తి రోల్స్ రాయిస్ కారును 112,350 బ్రిటీష్ పౌండ్స్(అంటే మన కరెన్సీ లో అక్షరాలా కోటి రూపాయల) వెచ్చించి దిగుమతి చేసుకున్నారు. కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు కాలుష్య నియంత్రణ సరిఫికేట్ కూడా ఉంది, కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (NGT) వారు ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధి(NCR) రోడ్ల నుండి ఈ కారును బ్యాన్ చేసారు.

చట్టపరంగా అన్ని సర్టిఫికేట్స్ ఉన్నా ఈ కారును ఎందుకు బ్యాన్ చేసారు గురించిన వివరాలు ఈ ఆర్టికల్ లో చదవండి.

ఈ కారు తయారు చేయబడి 15 సంవత్సరాలు అవుతోంది. నవంబర్ 2016లో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు 15 సంత్సరాలు పైబడిన పెట్రోల్ కార్లు మరియు 10 సంవత్సరాలు పైబడిన డీజిల్ కార్లు NCR రోడ్ల నుండి బ్యాన్ చేయబడ్డాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జైన్ NGT పైన ఒక పిటిషన్ దాఖలు చేసారు. తన పాతకాలపు కారు రిజిస్ట్రేషన్ మరియు కారు విలువను పునరుద్ధరించాలని అలాగే తన కారు భారత్ స్టేజ్ 4 (BS4) స్టాండర్డ్స్‌కు అప్‌గ్రేడ్ కాగలదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కారు BS4 అప్‌గ్రేడ్ విషయమై అశోక్ కుమార్ జైన్ రోల్స్ రాయిస్ ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్టు, రోల్స్ రాయిస్ ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాకపోతే NGT బెంచ్ చైర్మన్ రిటైర్డ్ సుప్రీమ్ కోర్ట్ జడ్జ్ స్వతంత్ర్ కుమార్ ఈ కారుకు ఢిల్లీ రోడ్ల మీద యథావిధిగా తిరగడానికి కావాల్సిన అనుమతులు ఇవ్వడానికి నిరాకరించారు.

రోల్స్ రాయిస్ ఈ కారులో బిఎస్-4 ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో అప్‌గ్రేడ్ చేసినా, కారు వయసు 15 ఏళ్లకు పైబడటంతో జైన్ తన వింటేజ్ కారును ఢిల్లీ-NCR రోడ్ల నడపడం కుదరదు. ఈ విషయం పాత కార్లున్న ప్రతిఒక్కరికి చేదు వార్తే అని చెప్పాలి.

  • ఏ కారైనా, ఎంతటి ఖరీదైన కారైనా సరే 15 ఏళ్ళు దాటినట్లయితే ఖచ్చితంగా ఢిల్లీ రోడ్ల మీద తిరగడానికి వీల్లేదు.
  • కాలం చెల్లిన కార్లను ఎలాగైనా వదిలించుకోవాడానికి ఓనర్లు ప్రయత్నిస్తారు. అందువలన ఈ కార్ల ధరలు చాల వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

ఓనర్ షిప్ ఇంటర్ స్టేట్ బదిలీ కోసం తప్పనిసరిగా ఉన్న "నో అబ్జెక్షన్ సర్టిఫికేట్" జారీ సమయంలో కారు వయసు 15 ఏళ్లకు మించినట్లయితే వాటిని ఆర్టిఓలు శాస్వతంగా రద్దు చేస్తాయి.

ఇతర రాష్ట్రాలలో కూడా పాత కార్లకు NGT యొక్క నిషేధాన్ని అమలు చేస్తే, ఆయా రాష్ట్రాలలో ఉన్న కోర్టులు కూడా పాత కాలపు కార్లకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఉన్న అనుమతులను నిరాకరించవచ్చు.

కార్ల ప్రియులకు, వింటేజ్ కార్ కలెక్షన్ మరియు వాటి వ్యాపారం ఇక మీదట తీరని కోరికగా మిగిలిపోవచ్చు.

English summary
Read In Telugu NGT just banned this 1 crore rupee Rolls Royce from Delhi NCR roads: Here’s why
Please Wait while comments are loading...

Latest Photos