దుబాయ్ పోలీసుల కార్ కలెక్షన్‌లో చేరిన రోల్స్ రాయిస్ ఫాంటమ్

Written By:

ప్రపంచంలో కెల్లా అత్యధికంగా సూపర్ కార్లను పోలీసు వాహనాలు కలిగి ఉన్న దేశం దుబాయ్ చెప్పడంలో అతిశయోక్తి లేదేమో. దుబాయ్ పోలీసులు ఉపయోగించే విలాసవంతమైన, ఖరీదైన కార్లను చూస్తే, ఎవ్వరికైనా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

దుబాయ్ పోలీసుల వద్ద ఇప్పటికే ఫెరారీ, బుగాటి, ఆస్టన్ మార్టిన్, బిఎమ్‌డబ్ల్యూ, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్, కొయినిగ్‌సెగ్ వన్:1, బార్బస్, టొయోటా ల్యాండ్ క్రూజర్, లెక్సస్, మెక్ లారెన్, షెవర్లే కమారో, లాంబోర్గినీ, హమ్మర్ వంటి లగ్జరీ మరియు సూపర్ కార్ కంపెనీలకు చెందిన సూపర్‌కార్లు, వేగవంతమైన కార్లు, స్పోర్ట్స్ కార్లతో పాటుగా పలు సూపర్‌బైక్‌లు కూడా ఉన్నాయి.


కాగా తాజాగా.. దుబాయ్ పోలీసుల కార్ కలెక్షన్‌లోకి ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన మరియు అరుదైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూడా వచ్చి చేరింది. వైట్ అండ్ మెరూన్ కలర్‌లో పెయింట్ చేసిన రోల్స్ రాయిస్ కారును అబుదాబిలో ప్రదర్శించారు.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో శక్తివంతమైన 6.8 లీటర్, వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 453 బిహెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.1 సెకండ్ల వ్యవధిలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుంటుకుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు.

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఘోస్ట్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
The name Rolls Royce is synonymous with exquisite luxury. They have several products which are custom made for their customers. Over the years they have successfully bettered their luxury vehicles, by introducing more tech and luxurious elements in their models.
Please Wait while comments are loading...

Latest Photos