ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది: కుక్కల కోసం రోల్స్ రాయిస్ కారు!

Written By:

'ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది' అని చాలా మంది చెబుతూ ఉంటారు. వారి మాటేమో కానీ, నిజంగా కుక్కకే అలాంటి మంచి రోజు వస్తే.. రోల్స్ రాయిస్ వంటి అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను సామాన్యులు దగ్గరి నుంచి చూడటమే అసాధ్యం, కానీ అలాంటి కార్లను కుక్కల కోసం వినియోగిస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..!

చాలా మంది డబ్బున్నోళ్లు తమ పెంపుడు కుక్కలను ఇంట్లో మనుషుల కన్నా ఎక్కువగా చూసుకుంటుంటారు. కుక్కల కోసం ప్రత్యేక గదులు, కార్లు, భోజనం ఇలా సకల సదుపాయాలను కల్పిస్తుంటారు. అలాంటి ధనికుల కోసమే ఓ డిజైనర్ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చాడు. రోల్స్ రాయిస్ కార్లు కేవలం మనుషులకే కాదు, కుక్కల కోసం వాడుకోవచ్చాని తన డిజైన్ ద్వారా తెలియజేస్తున్నాడు.

ఆ వివరాలేంటో.. కుక్క విలాసాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

లండన్‌కి చెందిన ఆటోమోటివ్ అండ్ ప్రోడక్ట్ డిజైనర్ నీల్స్ వాన్ రోయిజ్ ఈ రోల్స్ రాయిస్ డాగ్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశాడు.

రోల్స్ రాయిస్ అందిస్తున్న లగ్జరీ సెడాన్ ఘోస్ట్ షాషీని ఆధారంగా చేసుకొని నీల్స్ ఈ షూటింగ్ బ్రేక్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశాడు.

కుక్కలు సులువుగా కారులోకి ప్రవేశించడాని, బయటకి రావటానికి వీలుగా కారు వెనుక భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కారులో డ్రైవర్, కోప్యాసింజర్‌కు మాత్రమే సీట్లు ఉంటాయి. మిగిలిన స్థలాన్ని మొత్తం కుక్కల కోసమే కేటాయించారు.

కుక్క మెడలో ఓ ఎలక్ట్రానిక్ వేరబల్ కాలర్ ఉంటుంది, కుక్క కారు సమీపంలోకి రాగానే అది ఆటోమేటిక్‌గా వెనుక డోర్ ఓపెన్ అవుతుంది.

ఈ రోల్స్ రాయిస్ కారును కుక్కల కోసం డిజైన్ చేసినప్పటికీ, విలాసం విషయంలో ఎక్కడా కూడా రాజీపడకుండా డిజైన్ చేశారు.

కుక్కల కోసం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ కాన్సెప్ట్ కారు.

కుక్కల కోసం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ కాన్సెప్ట్ కారు.

కుక్కల కోసం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ కాన్సెప్ట్ కారు.

కుక్కల కోసం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ కాన్సెప్ట్ కారు.

కుక్కల కోసం డిజైన్ చేసిన రోల్స్ రాయిస్ కాన్సెప్ట్ కారు.

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఘోస్ట్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Every dog has his day! That's what comes to mind after what Rolls-Royce have decided to take along with them to the 2015 Geneva Motor Show. Luxury carmaker Rolls-Royce is taking along a shooting brake concept, designed exclusively for dogs.
Please Wait while comments are loading...

Latest Photos