ఈఫిల్ టవర్ కన్నా ఎత్తైన, ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ షిప్‌ గురించి ఆసక్తికర విషయాలు

By N Kumar

ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ లగ్జరీ షిప్ హార్మనీ ఆఫ్ ది సీస్‌ను రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్స్ సంస్థ డెలివరీ ఇచ్చింది. దీనిని ఫ్రాన్స్‌లోని సెయింట్ నజైర్‌లో ఉన్న ఎస్‌టిఎక్స్ ఫ్రాన్స్ షిప్ యార్డులో డెలివరీ ఇచ్చారు. సప్త సముద్రాలను చుట్టేయగలిగే ప్రపంచపు అతి పెద్ద నౌక ప్రారంభ వేడుకల్లో రాయల్ కరేబియన్ క్రూయిజ్ లిమిటెడ్ యొక్క వ్యవస్థాపకులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ ఫియాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు. హార్మనీ ఆఫ్ ది సీస్ షిప్ లోని అక్వా థియేటర్ ముందు భారీ ఏర్పాట్లతో దీని ప్రారంభ వేడుకలు నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఒక జర్నలిస్ట్ ఈ షిప్ అంతర్గత అందాలను చూసి అత్భుతం అని కొనియాడాడు. హార్మనీ ఆఫ్ ది సీస్ నౌక అంతర్భాగం మరియు దాని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

పగలు రాత్రులు

పగలు రాత్రులు

ఫ్రాన్స్‌లోని ఎస్‌టిఎక్స్ షిప్ యార్డులో 2013 సెప్టెంబరులో హార్మనీ ఆఫ్ ది సీస్ నిర్మాణం చేపట్టారు. సుమారుగా 2,500 మంది వరకు ఉద్యోగులు పగలు, రాత్రులు దీనిని నిర్మించారు. సుమారుగా ఒక కోటి గంటల పాటు మానవ శక్తిని దీని నిర్మాణానికి వినియోగించారు. 40 నెలల కాలంలో దీని నిర్మాణం పూర్తి చేశారు.

తేలియాడే నగరం

తేలియాడే నగరం

తేలియాడే నగరంలా ఉన్న ఈ నౌకలో సుమారుగా 6,360 మంది అథిదులు మరియు 2,100 మంది ఉద్యోగులకు వసతులు కలవు. గరిష్టంగా ఇందులో 8,500 మంది వరకు ప్రయాణించవచ్చు.

భారీ కొలతలతో

భారీ కొలతలతో

నిజమే దీని కొలతలను మించిన షిప్‌ను మరెవ్వరైనా నిర్మించ తలపెట్టడం కూడా అసాధ్యమే. ఇది సుమారుగా 66 మీటర్లు వెడల్పు (217 అడుగులు), 362 మీటర్లు మీటర్లు పొడవు కలదు. అంటే ఈఫిల్ టవర్ కన్నా 50 మీటర్లు ఎత్తైనది.

నీటితో సాహస క్రీడలు

నీటితో సాహస క్రీడలు

ఈ ప్రపంచపు అతి పెద్ద షిప్‌లో ఒకే సారి 1400 మంది కూర్చునే అవకాశం ఉన్న థియేటర్. ఆరవ అంతస్థు నుండి 16 అంతస్థును కలిపే సుమారుగా 100 అడుగులు పొడవును కలిగి ఉండే గోళాకారపు నీటి గొట్టాలు కలవు.

బార్లు, బీర్లు

బార్లు, బీర్లు

ఇందులో బార్లు కూడా చాలా సంఖ్యలో ఉన్నాయి. వినియోగదారులకు మధ్యపానం, బీర్లు వంటి పానీయాలు సప్లై చేయడానికి రోబోట్లను కూడా వినియోగించారు.

అత్బుతమైన పార్కులు

అత్బుతమైన పార్కులు

ఈ అతి పెద్ద షిప్పు మధ్య భాగంలో భారీ స్థాయిలో పార్క్ కలదు. ఈ నౌకలో ఉన్న అత్భుతాలలో ఇదీ ఒకటి. ఈ తోటలో సుమారుగా 12,000 వరకు చెట్లు ఉన్నాయి.

విక్రయ వీధులు

విక్రయ వీధులు

ఇందులో ప్రయాణించే వారికి అనువుగా ఉండే విధంగా షాపింగ్ మాల్స్‌ను కూడా నిర్మించారు.

ఆడిటోరియమ్

ఆడిటోరియమ్

ఈ షిప్‌లో కాన్ఫరెన్స్‌లు మరియు వినోదాత్మకమైన ఈవెంట్‌లు నిర్వహించడానికి ఇందులో భారీ పరిమాణంలో ఉన్న ఆడిటోరియమ్‌‍లు కలవు.

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

ఇందులో ప్రయాణికులకు అత్భుతమైన నీటి వసతులను, నీటి ఆటలను, వాటర్ పార్క్‌లను అందుబాటులో ఉంచారు. ఈ హార్మనీ ఆఫ్ ది సీస్ షిప్పులో సుమారుగా 23 వరకు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. వేడి మరియు చల్లని నీటిని కూడా అందిస్తారు. నీటికి సంభందించిన పూర్తి వసతుల కోసం సుమారుగా 4.7 మిలియన్ పౌండ్ల వరకు ఖర్చు చేశారు.

జూదనిలయం

జూదనిలయం

ఈ హార్మనీ ఆఫ్ ది సీస్ షిప్‌లో జూదం ఆడేవారి కోసం ప్రత్యేకంగా జూదపు హోటళ్లను కూడా అందుబాటులో ఉంచారు.

వరుస గదులు

వరుస గదులు

ప్రపంచపు అతి పెద్ద షిప్ హార్మనీ ఆఫ్ ది సీస్ లో అత్యంత విలాసవంతమైన ప్రయాణాన్ని కల్పించడానికి సూట్ రూమ్‌లను భారీ సంఖ్యలో అందించారు.

తేలియాడే స్వర్గం

తేలియాడే స్వర్గం

ఒక్క సారి ఈ హార్మనీ ఆఫ్ ది సీస్ షిప్‌లోకి అడుగుపెట్టిన తరువాత మీరు స్వర్గంలో ఉన్నట్లు తలపిస్తుంది, స్వర్గంలో ఎలాంటి వసతులు ఉంటాయో అనే మన ఊహలకు మించి సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

చాలా ఏళ్ల తరువాత

చాలా ఏళ్ల తరువాత

రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్స్ సంస్థ సుమారుగా ఏడేళ్ల తరువాత ఈ అత్యంత ఖరీదైన, విలాసవంతమైన మరియు అతి పెద్ద షిప్‌ను తయారు చేసింది. అంతకు ముందు ఈ రాయల్ కరేబియన్ సంస్థ అల్లురే మరియు వయాసిస్ అనే షిప్‌లను తయారు చేసింది.

ధర

ధర

ఈ షిప్‌ను సుమారుగా 1.8 బిలియన్ డాలర్ల ఖర్చు చేసి తయారు చేశారు. ప్రపంచంలో అత్యంత ఖర్చుతో నిర్మితమైన షిప్పులలో కూడా ఇదే ముందుంది.

మొదటి ప్రయణం

మొదటి ప్రయణం

హార్మనీ ఆఫ్ ది సీస్‌గా పిలువబడే ఈ షిప్ ద్వారా విహార యాత్రలకు సంభందించిన ప్రయాణాన్ని అక్టోబర్‌ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని కథనాల కోసం...

వయాసిస్ ఆఫ్ ది సీస్ - ఫన్ ఫ్యాక్ట్స్ (పూర్తి చిత్రాలతో..)

Most Read Articles

English summary
Royal Caribbean Takes Delivery Worlds Largest Cruise Ship
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X