సీట్ బెల్ట్ ధరించలేదని టూ వీలర్ రైడర్‌కు ఫైన్ విధించిన గోవా పోలీసు

ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చేయడం కోసం వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ అధికారులు అనేక కొత్త చట్టాలు మరియు నియమాలను అమల్లోకి తెస్తున్నారు.

By Anil

ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం పోలీసు అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు గురించి తెలియని పోలీసు పూర్తి పోలీస్ వ్యవస్థకే మచ్చను తీసుకొస్తున్నారు. టూ వీలర్‌లో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణిస్తున్నాడని ఫైన్ విధించాడు ఓ పోలీస్. దీని గురించి మరిన్ని వివరాలు....

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చేయడం కోసం వివిధ రాష్ట్రాల ట్రాఫిక్ అధికారులు అనేక కొత్త చట్టాలు మరియు నియమాలను అమల్లోకి తెస్తున్నారు. వాహన చోదకుల భద్రత కోసం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు మంచివే.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

కానీ పోలీస్ అధికారులకు రూల్స్ పట్ల కనీసం అవగాహన లేనంత వరకు ప్రజల్లో పూర్తి పోలీస్ వ్యవస్థ పట్ల కలిగే చులకన భావం అలాగే ఉంటుంది. ట్రాఫిక్ మరియు పోలీస్ వ్యవస్థ మొత్తం అవాక్కయ్యే వింత సంఘటన ఒకటి గోవాలో చోటు చేసుకుంది.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

సతీష్ ఎస్ నాయక్ అనే రైడర్ బుల్లెట్ బైకు మీద గోవాలో రైడ్ చేస్తున్నపుడు జూన్ 7 వ తేదీన హెల్మెంట్ లేకుండా రైడింగ్ చేస్తున్న కారణంతో పోలీసు ఆపారు. గోవాలో హెల్మెంట్ తప్పనిసరిగా ధరించి రైడ్ చేయాలనే చట్టం అమల్లో ఉంది.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

హెల్మెంట్ ధరించి ప్రయాణించాలనే నియమాన్ని ఉల్లఘించినందుకు రూ. 100 జరిమానా విధించాడు. తదుపరి, చలానాలో నియమాన్ని ఉల్లఘించిన వ్యక్తి , ఉల్లంఘన వివరాలు మరియు ఉల్లంఘన చట్టం వంటి వివరాలు నింపి రైడర్‌కు అందించాడు.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

అయితే శిరస్త్రాణం ధరించలేదని వ్రాయాల్సిన ప్రదేశంలో సీట్ బెల్ట్ ధరించలేదని తప్పుగా నమోదు చేశాడు. నిజానికి టూ వీలర్లకు సీట్ బెల్ట్ ఉండదు. చదవడానికి ఎంతో ఫన్నీగా అనిపించే ఈ చలనా సోషల్ మీడియలో వైరల్ అయిపోయింది.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

పోలీస్ అధికారి వ్రాసిన చలానాను గమనిస్తే, మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 177 క్రింద సీట్ బెల్ట్ ధరించలేదని కారణంతో జరిమానా విధించినట్లు ఉంది. నిజానికి హెల్మెట్ ధరించనందుకు ఈ ఈ 177 సెక్షన్ చట్టం వర్తిస్తుంది. సీట్ బెల్ట్ ధరించనందుకు మోటార్ వెహికల్‌లో ఉన్న చట్టం సెక్షన్ 129.

టూ వీలర్ రైడర్‌ సీట్ బెల్ట్ ధరించలేదని ఫైన్ విధించిన పోలీస్

సెక్షన్ సరిగ్గానే నింపాడు, కానీ ఉల్లంఘనకు గల కారణం తప్పుగా వ్రాయడం జరిగింది. అధికారులకు చట్టాల మీద సరైన అవగాహన కూడా లేదు అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Rider Fined For Not Wearing Seatbelt
Story first published: Tuesday, June 13, 2017, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X