రష్యా యొక్క ప్రపంచపు అతి పెద్ద సబ్‌మెరైన్ గురించి ఆసక్తికరమైన విషయాలు

Written By:

రష్యా యొక్క అణుశక్తి సామర్థ్యాలను పరోక్షంగా ప్రదర్శించేందుకు పుతిన్ సిద్దమయ్యాడు. పూర్తి స్థాయి అణు శక్తి సామర్థ్యం ఉన్న ప్రపంచపు అతి పెద్ద అణు జలాంతర్గామిని తెల్ల సముద్రం నుండి పుతిన్ స్విమ్మింగ్ పూల్‌గా పిలువబడే బాల్టిక్ సముద్రానికి చేర్చుతున్నారు. ప్రపంచపు అతి పెద్ద సబ్‌మెరైన్‌గా పేరుపొందిన డిమిటీ డాన్స్కోయ్ గురించి ఆసక్తికరమైన విషయాలు.

అతి పెద్ద టైపూన్-క్లాస్ కు చెందిన ఈ డిమిటీ డాన్స్కోయ్ తెల్ల సముద్రాన్ని వీడి నార్వే మరియు డెన్మార్క్ తీరం మీదుగా ప్రయాణించి ఫిన్లాండ్, స్వీడన్ మరియు పోలాడ్‌ భూ బాగాలకు మధ్యలో ఉండే బాల్టిక్ సముద్రానికి చేరుకోనున్నాది.

ప్రచ్ఛన యుద్దం కాలంలో అనేక దేశాలను భయబ్రాంతులకు గురిచేసిన ఈ రష్యా సబ్‌మెరైన్ పొడవు సుమారుగా 574 అడుగులు పొడవు ఉంది.

రష్యా వద్ద ఉన్న పరాక్రమమైన అణు శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ, రష్యా అణు బలమేంటో ప్రపంచ దేశాలకు పరోక్షంగా హెచ్చరించడానికి రష్యా సిద్దమైంది. అందులో భాగమే ఈ శక్తివంతమైన డిమిటీ డాన్స్కోయ్‌ను తెల్ల సముద్రం నుండి బాల్టిక్ సముద్రానికి తీసుకొస్తోంది.

అత్యంత భయకరమైన మరియు శక్తివంతమైన ఈ ప్రపంచపు అతి పెద్ద జలాంతర్గామిలో 20 కి పైగా అణి క్షిపణులతో పాటు 200 కు పైగా ఆయధాలు ఉన్నాయి.

సెయింట్ పీటర్‌బర్గ్ లో నిర్వహించే పరేడ్ కోసం దీనిని తెల్ల సముద్రం నుండి బాల్టిక్ సముద్రానికి తరలిస్తున్నట్లు రష్యన్ అధికారి పేర్కొన్నారు. అయితే పరోక్షంగా రష్యా తమ అణు శక్తి సామర్థ్యాలను ప్రపంచ ప్రదర్శన చేస్తోంది.

దీని సామర్థ్యం 5,000 మైళ్లుగా ఉంది. అమెరికా నుండి రష్యా కు అన్ని వైపులా ఉన్న మహాసముద్రాలను చుట్టేయగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది.

  • స్థాన భ్రంశం నీటి ఉపరితలం మీద - 23,200 నుండి 24,500 టన్నులు
  • స్థాన భ్రంశం నీటి లోపల - 33,800 నుండి 48,000 టన్నులు
  • మునిగి ఉండే రోజుల సంఖ్య - 120 కి పైగా
  • గరిష్ట మునక - 400 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.

  • పొడవు - 175 మీటర్లు (574 అడుగుల 2 అంగుళాలు)
  • వెడల్పు - 23 మీటర్లు (75 అడుగుల 6 అంగుళాలు)
  • లోతు - 12 మీటర్లు
  • సిబ్బంది - 160 మంది

డిమిటీ డాన్స్కోయ్‌ అణు జలాంతర్గామి వేగం నీటి ఉపరితలం మీద 22.2 కిలో నాట్స్ (గంటకు 253.57 మీటర్లు) మరియు నీటి లోపల 27 నాట్స్(గంటకు 31 మీటర్లు)గా ఉంది.

ప్రొపల్షన్ వ్యవస్థ

నీటిలోపల గానీ లేదంటే నీటి ఉపరితలం మీద గానీ సబ్‌మెరైన్ బలంగా ముందుకు దూసుకెళ్లడానికి ప్రొపల్షన వ్యవస్థ తప్పనిసరి. డిమిటీ డాన్స్కోయ్‌ అణు జలాంతర్గామిలో రెండు ప్రైజరైజ్డ్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లు మరియు రెండు వివి-టైప్ స్టీమ్ టర్బైన్లు ఉన్నాయి.

120 రోజుల పాటు నీటిలోపలే ఉండే సామర్థ్యం ఉన్న ఇందులో ఆరు టార్పెడొ గొట్టాలున్నాయి.

టార్పెడ్ ట్యూబులు

ఎక్కువ రోజుల పాటు నీటలోపల ఉండటం ద్వారా జలాంతర్గామి లోపలికి చేరే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపింగ్ చేసేందుకు ఈ టార్పెడొ ట్యూబులు ఉపయోగపడతాయి.

ఈ జలాంతర్గామిని 1980 లో సోవియట్ ఆర్మీ అభివృద్ది చేసింది. రష్యన్ అకులా శ్రేణికి చెందిన దీనిని 941 ప్రాజెక్ట్ క్రింద షార్క్ అనే అర్థం వచ్చేలా డెవలప్‌చేశారు.

రష్యా దీనిని నిర్మించడానికి ప్రధాన కారణం, అమెరికా అభివృద్ది చేసిన సుమారుగా 192 వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఓహియో శ్రేణి జలాంతర్గామికి పోటీగా రష్యా ఈ డిమిటీ డాన్స్కోయ్‌ తయారుచేసింది.

అమెరికా మీద పోటీగా ఆరింటిని రూపొందిస్తే, ఇప్పుడు ఒకటి మాత్రమే ఉంది. దీనిని ఆధారంగా రష్యా నూతనంగా ఓ క్షిపణి పరీక్షకు సిద్దమైంది. అందుకోసం దీనిని బాల్టిక్ సముద్రానికి తీసుకొస్తున్నారు.

అయితే బాల్టిక్ సముద్రం యొక్క లోతు పరీక్షలకు అంత అనువుగా లేకపోవడం చేత. కేవలం ప్రదర్శన నిమిత్తం దీనిని ఇక్కడకు తరలిస్తున్నట్లు తెలిసింది.

శక్తివంతమైన ఈ అణు జలాంతర్గామికి 1359 - 1389 కాలంలో మొస్కోని పరిపాలించిన రాజు డిమిటీ డాన్స్కోయ్‌ పేరును పెట్టారు.
Via - Dailymail  

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Russia Launches Worlds Largest Submarine To Baltic
Please Wait while comments are loading...

Latest Photos