చైతూకి విలువైన కానుకిచ్చిన సమంత

Written By:

సమంత, చైతన్య నటీనటులుగా తెరమీదకు వచ్చిన వీళ్లు అతి త్వరలో ఒక్కటికాబోతన్న సంగతి తెలిసిందే. జనవరి 29న పెద్దల ఒప్పందంతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు చెట్టపట్టాలేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య సమంత సూపర్ బైకులను అమితంగా ప్రేమించే చైతూకి ఖరీదైన స్పోర్ట్స్ బైకును బహుకరించింది. ఈ కాస్ట్లీ గిఫ్ట్ గురించి ఓ లుక్కేసుకుందాం రండి...

2010 లో ఏమాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత, నాగ చైతన్య కలయికలో అనేక సినిమాలు చేసింది. చివరికి అతని మొదటి సినిమా హీరోతోనే జీవితాన్ని పంచుకోనుంది.

అధికారికంగా ఎంగే‌జ్‌మెంట్‌కు ముందు ఈ జంట అనేక మార్లు మీడియా కంటికి చిక్కింది. అయితే వాటిని ఎప్పుడూ గాసిప్స్ అంటూ కొట్టిపారేసేవారు. అయితే గత జనవరి 29 న పెద్దల సమక్షంలో ఎంగే‌జ్‌మెంట్‌ ద్వారా ఒక్కటయ్యారు.

నాగ చైతన్యకు స్పోర్ట్స్ బైకులు, కార్లంటే అమితమైన ఇష్టం. అందుకు గాను సమంత ఈ మధ్య అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైకును కానుకగా ఇచ్చింది.

ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ మెక్కానికా వెర్గెరా అగస్టా(MV Agusta) కు చెందిన ఎఫ్4 సూపర్ బైకును ప్రెజెంట్ చేసింది. దీని ధర రూ. 27 లక్షలు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. 

హైదరాబాద్‌లోని ఓ ఆర్‌టిఎ కార్యాలయం వద్ద ఈ ప్రేమ పక్షులు జంటగా కనిపించాయి. వీరిక్కడ ఎందుకున్నారని ఆరా తీస్తే, సమంత చైతూకి ఇస్తోన్న ఖరీదైన బైకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్లు తెలిసింది.

నాగ చైతన్య ఈ బైకుకు టిఎస్07ఎఫ్ఎమ్2003 అనే నెంబర్ కోసం సుమారుగా రూ. 4.5 లక్షల రుపాయలు వెచ్చించినట్లు తెలిసింది.

ఎమ్‌వి అగస్టా ఎఫ్4 సూపర్ బైకు విశయానికి వస్తే, ఇందులో 998సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్లు గల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 192.30బిహెచ్‌పి పవర్ మరియు 110.80ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది.

తెలుగు చిత్ర సీమలో కనులపండుగలా చైతూ, సమంత అతి త్వరలో పెళ్లిచోసుకోనున్నారు.

అద్భుతమైన కార్లను కలిగి ఉన్న అక్కినేని ఫ్యామిలీ

వెండి తెర ద్వారా తెలుగువారితో అత్యంత సాన్నిహిత్యం ఏర్పరచుకున్న అక్కినేని కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబానికి ఒక చక్కటి ఉదాహరణగా అభివర్ణించవచ్చు. అక్కినేని కుటుంబం యొక్క కార్ల కలెక్షన్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

 

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Samantha Presents Costly Gift For Naga Chaitanya
Please Wait while comments are loading...

Latest Photos