ఆస్ట్రేలియన్ మోటోజిపిలో లొరెంజ్ బైక్‌లో ఇరుక్కుపోయిన పక్షి

By Ravi

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియన్ మోటోజిపి బైక్ రేస్‌లో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఈ రేస్ సమయంలో బైక్ వేగంగా నడుపుతున్న జార్జ్ లొరెంజ్ సూపర్‌బైక్‌లో ఓ పక్షి ఇరుక్కుపోయి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆస్ట్రేలియన్ మోటోజిపి క్వాలిఫైయింగ్ సెషన్ సందర్భంగా, ఫిలిప్ ఐల్యాండ్ సర్క్యూట్‌పై తన యమహా బైక్‌తో సవారీ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. (క్రింది వీడియోలో చూడొచ్చు).

ఈ రేస్ ట్రాక్‌పై ఉన్న సీగల్ పక్షి బైక్ వేగాన్ని గుర్తించి గాల్లోకి ఎగిరిపోదామని ప్రయత్నించింది. అయితే, దాని వేగం కన్నా బైక్ ఇంకా ఎక్కువ వేగంతో రావటం వలన అది బైక్ రేడియటర్‌లో ఇరుక్కుపోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో రేసర్ లొరెంజోకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు, అయితే సీగల్ పక్షి మాత్రం ప్రాణాలు విడిచింది.

తరచూ రేస్‌లు జరిగే ఇలాంటి రేస్ ట్రాక్‌లపై సరైన మెయింటినెన్స్ లేకపోవటం వలనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనను చూసిన పక్షి ప్రేమికులు మాత్రం అయ్యో పాపం పాలపిట్ట అని బాధపడుతున్నారు.
<center><center><center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/X5_gbdYxMWM?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

Most Read Articles

English summary
Jorge Lorenzo was the fastest during qualifying during last week's qualifying session at the Australian MotoGP. Amongst the excitement took place an unusual, but unfortunate event when an unlucky seagull got too close to Lorenzo's bike and got sucked into the radiator. The incident took place during the first lap.&#13;
Story first published: Saturday, October 26, 2013, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X