డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

By N Kumar

ఆటోమొబైల్ ప్రపంచం అనేది ఎన్నో నిజాలతో నిండి ఉంది. అందులో మొదటి సారిగా స్టీరింగ్ ఎప్పుడు కనుక్కున్నారు అనే విషయం నుండి వాహనాలలో క్రూయిజ్ కంట్రోల్ వినియోగించడం ఎప్పటి నుండి మొదలు పెట్టారు అనే విషయం వరకు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట చదివి ఉంటారు.

అందుకే మళ్లీ అలాంటి నిజాలు కాకుండా, సరికొత్త ఎవరికీ తెలియని ఏడు కొత్త ఆటోమొబైల్ నిజాలు గురించి క్రింది కథనంలో అందిస్తున్నాము. ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి కూడా.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

దీనిని చూస్తే ఇక్కడ వృత్తాకార సర్కిల్ ఉంది అనే విషయం అందరికీ అర్థం అవుతుంది. ఇలాంటి వాటిని చాలా రోజుల క్రితం చూసుంటాం. ఎందుకంటే ఈ రోజుల్లో ట్రాఫిక్ లైట్ల రావడం వలన వాటని తొలగించేశారు. అయితే ఫ్రాన్స్ ఇప్పటికీ ఈ పద్దతినే వాడుతోంది.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

దీని అర్థం కుడివైపు మాత్రమే నడపండి అని అయితే మన ఇండియాలో కాదులేండి. ఇండియాలో కుడి వైపు వెళ్లాలి, ఎడమ వైపులో రావాలి. కాని కుడి వైపు రావాలి ఎడమ వైపు వెళ్లాలి రావాలి అనే రూల్ ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 165 దేశాల్లో ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. రష్యాకు చెందిన ఎలిజబెత్ రాణి 1752 లో ప్రవేశపెట్టిన ఈ నియమం యూరప్ మొత్తం పాకిపోయింది. ఇండియాలో ఉండే నియమాన్ని సుమారుగా 75 దేశాలు పాటిస్తున్నాయి.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

ఫైన్ మామూలుగా చాలా మంది చెల్లిస్తూనే ఉంటారు. కాని జుస్సి సలొనొజా అనే ఈ ఫిన్‌లాండ్ వాసి గరిష్ట వేగంతో బైకు మీద వెళ్లినందుకు ఆ దేశానికి చెందిన ట్రాఫిక్ పోలీసులకు సుమారుగా 170,000 యూరోలు చెల్లించాడు. 2003 లో గంటకు 40 కిమీలు మాత్రమే వెళ్లాల్సిన రోడ్డు మీద 80 కిమీల వేగంతో వెళ్లినందుకు ఇలా చెల్లించాడు. అయితే మాత్రం ఇంత మొత్తంలో చెల్లించాలా అనే కదా మీ ప్రశ్న. ఆ దేశంలో సంపాదించించే మొత్తాన్ని బట్టి ఫైన్ ఆధారపడి ఉంటుందట.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడితే ప్రతీది కూడా ఎక్కడో విన్నట్లు ఉంటుంది. అందుకే వాహనం ద్వారా మొదటి సారిగా మరణించిన వ్యక్తి గురించి చెపుతున్నాం. 1869 లో మ్యారీ వార్డ్ అనే వ్యక్తి అప్పట్లో అందుబాటులో ఉండే స్టీమ్ ఇంజన్ వాహనపు చక్రాలకు బలి అయ్యాడు. అలా ప్రపంచ వ్యాప్తంగా మొదటి ఆటోమొబైల్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిగా ఇతను చరిత్రలో నిలిచిపోయాడు.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

డ్రైవింగ్ సమయంలో డ్రైవర్లు చేసే పనుల మీద నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపుగా 30 శాతం మంది డ్రైవర్లు ఇతర వాహన డ్రైవర్లను దూషిస్తుంటారని వెల్లడైంది. ఎక్కువ ఇతర డ్రైవర్లు చేసే ర్యాష్ మరియు తప్పుడు డ్రైవింగ్‌ల గురించి వేలెత్తి చూపిస్తూ దూషిస్తుంటారు.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

భూమి నుండి చంద్రునికి మధ్య దూరం సుమారుగా 3,84,403 కిలోమీటర్లుగా ఉంది. ఈ మొత్తం దూరాన్ని గంటకు 97 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆపకుండా వెళితే సుమారుగా 157 రోజుల తరువాత చంద్ర మండలాన్ని చేరుకుంటాము. కాని కాంతి కేవలం నాలుగు సెకండ్ల సమయంలో ఈ దూరాన్ని చేధిస్తుంది.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

మన ఇండియాలో ఎక్కువ మంది ప్రయాణం సమయంలో ఎవో కబుర్లు మాట్లాడుకుంటూ లేదంటే పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తుంటారు. కాని ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 54 శాతం మంది డ్రైవర్లు వాహనం నడుపుతున్నప్పుడు ఎటువంటి శబ్దం చేయకుండా డ్రైవ్ చేయడానికి ఇష్టపడుతున్నారు.

డ్రైవర్లకు డ్రైవింగ్ గురించి తెలియని ఏడు ఆసక్తికరమైన నిజాలు

ఇండియాలో ఎన్ని రకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయో తెలుసా ?

సమ్మర్‌లో రైడింగ్ చేస్తున్నారా ? అయితే ఇవి పాటించండి

Most Read Articles

English summary
Seven Interesting Car And Driving Facts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X