బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్

By Anil

బిఎమ్‌డబ్ల్యూ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన హైబ్రిడ్ కారు ఎంతో మంది ఆకట్టుకుంది, దీనికి చాలా మంది దాసోహం అయిపోయారు కూడా. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశీయంగా కూడా దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పజడింది. ఇది దీని పేరు చెప్పలేదు కదా, ఇది బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ఐ8 హైబ్రిడ్ కారు

సాధారణ ప్రజలకు సాధారణమైన కారు కలల కారుగా ఉంటుంది, కాని భారత దేశపు సెలబ్రిటీలందరికీ ఇదే డ్రీమ్ కారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ కారును ఎంతో ప్రీతిగా ఎంచుకున్నాడు మరియు దేశీయంగా దీనిని ఎంచుకున్న మొదటి సెలబ్రిటీ కూడా సచినే. అయితే ఈ అరుదైన కారును మన బాలీవుడ్ సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ కూడా ఎంచుకున్నాడు. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో.....

డెలివరి

డెలివరి

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును ముంబాయ్ నగరంలో షారుఖ్ ఖాన్ బుధ వారం రోజున డెలివరీ తీసుకున్నాడు.

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు

షారుఖ్ ఖాన్‌కు ఐ8 కారును డెలివరీ ఇచ్చిన ముంబాయ్‌లోని నవనీత్ మోటార్స్ సంస్థ డైరక్టర్ శారద కచ్చాలియా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. తన ఇంటికి దీనిని స్వయంగా తీసుకెళ్లి మరీ డెలివరీ ఇచ్చారు.

షికారు

షికారు

షారుఖ్ ఖాన్ తాను బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును డెలివరీ తీసుకున్నాక ముంబాయ్ బాంద్రా రహదారి మీద షికారుకెళ్లాడు. ఈ విషయం తరువాతే తెలిసింది షారుఖ్ దీనిని ఎంతగా ఇష్టపడ్డాడో అని.

ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా

ఎటువంటి భద్రతా సిబ్బంది లేకుండా

ఈ కారు మీద బయటకు వెళ్లిన షారుఖ్ ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా ఒంటరిగా రైడ్‌కు వెళ్లాడు.

అమితాసక్తితో....

అమితాసక్తితో....

షారుఖ్ ఖాన్ ఇంతకు ముందు బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారును ఎక్కువగా వినియోగిస్తుండేవాడు, అయితే ఇతని ప్రపంచంలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. దీనిని డెలివరీ తీసుకున్న వెంటనే రైడింగ్‌కు వెళ్లి తమ ఇష్టం ఏంటో తెలియజెప్పాడు.

ధర

ధర

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారు ధర రూ. 2.25 కోట్లు ఎక్స్ షోరూమ్‌గా ఉంది మరియు దీని ఆన్ రోడ్ ధర రూ. 3.30 కోట్లుగా ఉంది. ఇదే ధరతో దీనిని షారుఖ్ ఖాన్ కొనుగోలు చేశాడు.

ఫ్యాన్యీ నెంబర్

ఫ్యాన్యీ నెంబర్

షారుఖ్ ఖాన్ బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును ఎంచుకున్న తరువాత బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌ యాజమానులు అమ్మేసిన కార్లను రిజిస్టర్‌లో ఎంటర్ చేస్తారు, అక్కడ ఇది 555 అనే నెంబర్‌ స్థానంలో ఉంది.

ఎందుకంత ఇష్టం

ఎందుకంత ఇష్టం

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన హైబ్రిడ్ కార్లలో బిఎమ్‌డబ్ల్యూ వారి హైబ్రిడ్ టెక్నాలజీ గల ఐ8 కారు ఒకటి. ఇందులోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, దీనికి 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు, దీని ద్వారా పవర్ మొత్తం వెనుక చక్రాలకు అందుతుంది. మరియు ముందు చక్రాలకు ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానం చేశారు.

 శక్తి (పవర్)

శక్తి (పవర్)

బిఎమ్‌డబ్ల్యూలోని ఐ8 కారులోని పెట్రోల్ ఇంజన్ 228 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ముందు చక్రలకు అనుసంధానం చేసిన ఎలక్ట్రిక్ మోటార్ 129 హార్స్ పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా మొత్తం మీద 357 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి అవుతుంది.

మైలేజ్

మైలేజ్

ఇందులో వినియోగించిన హైబ్రిడ్ సాంకేతికత ప్రకారం ఇది లీటర్‌కు సుమారుగా 40 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదని ప్రకటించారు.

పనితీరు

పనితీరు

బిఎమ్‌డబ్ల్యూ ఐ8హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు కేవలం 4.5 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.

ప్రత్యేకతలు

ప్రత్యేకతలు

ఇందులో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఆడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ కోసం ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, న్యావిగేషన్ సిస్టమ్, ఆటోమేటెడ్ బ్రేక్ సిస్టమ్ మరియు ఎన్నో ఆధునిక సదుపాయాలను ఇందులో అందించారు.

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

షారుఖ్ ఖాన్ కార్ కలెక్షన్

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కార్ల ప్రపంచంలో ఆడి ఏ6, రోల్స్ రాయిస్ ఫాంటమ్, బెంట్లీ కాంటినెన్షియల్ జిటి మరియు బిఎమ్‌డబ్ల్యూకు చెందిన కొన్ని కార్లు ఉన్నాయి.

అతి త్వరలో

అతి త్వరలో

ముంబాయ్ మరియు పూనే ఎక్స్ ప్రెస్ హై వే మీద సెలబ్రిటీలు తరచుగా తమ కార్ల ప్రయాణిస్తుంటారు. త్వరలో షారుఖ్ ఖాన్ కూడా తన సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఐ8 హైబ్రిడ్ కారులో ఈ రహదారి మీద ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కారును కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్

కోట్ల మంది అభిమానించే సచిన్ ఎవరి అభిమానో తెలుసా ?

Most Read Articles

English summary
Shahrukhkhan Gifted New Bmw I8 Hybrid Sports Car Himself
Story first published: Tuesday, June 21, 2016, 11:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X