స్వతంత్ర భారత దేశంలో, ఇప్పటికీ నడుస్తున్న బ్రిటీష్ సొంత రైల్వే

బ్రిటీష్ కాలంలో నెలకొల్పిన ఈ రైల్వే సంస్థ స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ వ్యక్తిగతంగా సేవలందిస్తోంది....

By Anil

ఇండియన్ రైల్వే ఇది భారతీయ ప్రజల యొక్క జీవనాడి, ప్రతి రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తోంది. దేశీయంగా ప్రజా రవాణాలో ఇండియన్ రైల్వే ఎంతో కీలకమైన రవాణా సాధనం. చాలా మంది భారతీయుల దైనందిన జీవితంలో ఇండియన్ రైల్వే సర్వసాధారణం అయిపోయింది. ఇది లేని భారతీయుల జీవితం ఊహించుకోలేం.

1951 లో ఇండియన్ రైల్వే జాతీయం చేయబడింది. కాని ఇప్పుడు మనం మాట్లాడకోవాల్సింది ఇండియన్ రైల్వే గురించి కాదు. మనం ఎప్పుడో మరిచిపోయిన శకుంతల రైల్వేస్. చాలా మందికి ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు, కాని నిజం. దీని గురించి విన్న తరువాత ఇది ఇండియన్ రైల్వే‌లో ఒక జోన్ లేదా ఒక రైలు పేరు అయి ఉండొచ్చు అనుకుంటున్నారు కదా ? కాని కాదు, ఎందుకంటే ఈ శకుంతల రైల్వేస్ ఇప్పటికీ ఇండియన్ రైల్వేలో కలవకుండా భారత దేశంలో ప్రత్యేకంగా సేవలందిస్తోంది, దీని గురించి మరిన్ని వివరాలు ఇవాళ్టి స్టోరీలో....

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

శకుంతలరైల్వేస్, ఆంగ్లేయులు నెలకొల్పి వెళ్లిన తరువాత ఇప్పటికీ ఇండియన్ రైల్వేలో విలీనం అవకుండా రైళ్లను నడుపుతున్న ఒక ప్రయివేట్ రైల్వే సంస్థ ఇది. ఆంగ్లేయుల కాలంలోనే ఈ సంస్థ అవతరించింది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

వ్యక్తిగతంగా రైల్వే సేవలందించడం ప్రారంభించిన శకుంతలరైల్వేస్ ఇండియన్ రైల్వేలో భాగస్వామ్యం కానందువలన ఇప్పటికీ ఈ శకుంతలరైల్వేస్‌ మీద భారతీయ రైల్వే గుత్యాధిపత్యం చెలాయించలేకపోతోంది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

భారత దేశంలో 1951 కాలంలో రైల్వో వ్యవస్థను జాతీయ చేసే సమయంలో శకుంతలరైల్వే విభాగం ప్రయివేట్‌ది కావడం వలన దీనిని జాతీయం చేయలేకపోయారు. అప్పటిని నుండి ఇది ఇలాగే కొనసాగుతూ వచ్చింది. నిజానికి ఇది ఎందుకు భారతీయ రైల్వేలో విలీనం అవలేదో అనే విషయం తెలియరాలేదు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

1910 లో సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ (CPRC) లేదా శకుంతలరైల్వేస్ బ్రిటిష్‌కు చెంది కిల్లిక్-నిక్సన్ అనే సంస్థ చేత ప్రాణం పోసుకుంది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఆంగ్లేయుల పాలనలో బ్రిటీష్ రాజ్ అనే హయాంలో చాలా వరకు వ్యక్తిగత రైల్వే సంస్థలు ప్రాణం పోసుకున్నాయి. అప్పట్లో ఈ శకుంతలరైల్వేస్‌ను విదర్భా నుండి పత్తిని రవాణా చేయడానికి వినియోగించే వారు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

పత్తి రవాణా కోసం, నేడు ఇండియన్ రైల్వేగా విరాజిల్లుతున్న అప్పటి గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే(GIPR)కి మరియు సిపిఆర్ రైల్వేకి మధ్య ప్రత్యేక ఒప్పందం జరిగింది. ఆ తరువాత కాలంలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే సంస్థ భారతీయ రైల్వేగా అవతరించింది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

శకుంతలరైల్వేస్ ఏర్పాటు చేసుకున్న పట్టాల మీద GIPR రైళ్లు రాకపోకలు సాగించేవి. అందుకోసం గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే సంస్థ, శకుంతలరైల్వేస్‌కు డబ్బు కూడా చెల్లించేది. GIPR కాస్త ఇండియన్ రైల్వేగా అవతరించినప్పటికీ డబ్బు రూపేనా శకుంతలరైల్వేకు అద్దె అందుతూ వచ్చింది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఆశ్చర్యం ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఇండియన్ రైల్వే శకుంతలరైల్వేస్‌కు డబ్బు చెల్లించడం నిలిపివేసిందట. ఎందుకంటే శకుంతలరైల్వేస్‌కు చెందిన నిర్వహణ మరియు రిపేరీల బిల్లులను సమం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

శకుంతలరైల్వేస్‌లోని రైళ్లు ఇప్పటికీ న్యారో గేజ్‌ను వినియోగిస్తూనే ఉన్నాయి. అయితే ఇండియన్ రైల్వే యొక్క బ్రాడ్ గేజ్ కన్నా ఇవి కాస్త విభిన్నంగా ఉంటాయి.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఇండియన్ రైల్వే రైళ్లు శకుంతలరైల్వేస్ న్యారో గేజ్ పట్టాల పైన తిరుగుతున్నందుకు గాను బ్రిటీష్ సంస్థ స్థాపించిన ఈ సంస్థకు సుమారుగా కోటి రుపాయల వరకు అందుతున్నాయి.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

శకుంతల రైల్వేస్ ప్రస్తుతం ప్యాసింజర్ రైలు సేవలందిస్తోంది. ఈ రైలు మహరాష్ట్రలోని యావత్మల్ మరియు ముర్తిజాపూర్ నగరాల మధ్య నడుస్తోంది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఇది రోజులో కేవలం ఒక సారి మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. కాని కొన్ని వందల మందిని ఈ రెండు నగరాల మధ్య చేరవేస్తోంది.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

పూరాతణ రైలు కావడం వలన హెచ్చు ధరలతో కాకుండా రహదారి మీద టికెట్‌లతో పోల్చుకుంటే ఐదు నుండి ఆరు రెట్లు వరకు తక్కువ ఖర్చుతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించవచ్చు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఈ శకుంతలఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు గంటల ప్రయాణంలో సుమారుగా 190 కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తోంది. ఇది న్యారో గేజ్‌లో ప్రయాణిస్తుండటం వలన చూడటానికి బొమ్మ రైలులా ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది ఇందులో ప్రయాణించడానికి ఇష్టపడతారు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రైలు ఇప్పటికీ ఆవిరి యంత్రంతోనే పరుగులు పెడుతోంది. మరియు దీనికి కావాల్సిన అన్ని సిగ్నల్స్ కూడా మ్యాన్యువల్‌గా ఇస్తారు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఈ రైలులో ప్రయాణించారంటే ఇందులో వినియోగించిన సంకేతాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు అన్ని కూడా బ్రిటీష్ కాలం నాటివిగా గుర్తించవచ్చు. మరియు చాలా వరకు అన్నింటి మీద "made in liverpool" అనే వాక్యాన్ని గుర్తించవచ్చు.

శకుంతల ఎక్స్‌ప్రెస్ ఇండియన్ రైల్వేలో భాగం కాదు

ఈ రైలులో ప్రయాణించారంటే మీరు ఖచ్చితంగా 19 వ శతాబ్దంలో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. ఇందులో ప్రయాణం మీరు మీ పాఠశాలకు వెళ్లినట్లు ఉంటుంది. నిజ జీవితంలో ఎలాగో వెళ్లలేరు కాబట్టి కనీసం ఈ రైలులో అయినా ప్రయాణించండి. మహరాష్ట్రకు వెళ్లినపుడు వీలైతే ఓ సారి ఈ రైలులో ప్రయాణించి రండి.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

రైలు ప్రయాణం అంటే మనకు ఎంతో సరదా...కాని రైలు నడిపే వారికి అదో నరకం..!!

170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
Shakuntala Express Which Is Not Owned By India Still Runs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X