ముంబై మెట్రో రైలులో లీకేజ్ ప్రాబ్లం, షవర్ బాత్‌గా మారిన ట్రైన్

ఇదేంటి మెట్రో రైలులో షవర్ బాత్ ఫెసిలిటీనా వింతగా ఉందే అనుకోకండి. వాస్తవానికి ఇది మెట్రో రైలులోని లీకేజ్ ప్రాబ్లం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముంబై మెట్రో రైలు ప్రాజెక్ట్‌లోని ఓ కోచ్‌లో ఇలా నీరు లీక్ కావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముంబైలోని ఓ మెట్రో రైలులో వర్షం పడినప్పుడు రూఫ్ లీక్ కారణంగా రైలు పైభాగంలోకి చేరిన నేరుగా రైలులోకి వచ్చాయి. ఎయిర్ కండిషన్ కోసం అమర్చిన రంధ్రాల గుండి ఈ వర్షపు నీరు రైలులోకి ప్రవహించాయి. దీంతో ఇది షవర్ బాత్ ఎఫెక్ట్‌ను తలపిస్తోంది.

ఇప్పటికే ఈ దృష్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అనేక మంది నెటిజన్లు ఈ విషయం గురించి వ్యగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలలో కొందరు రెయిన్ డ్యాన్స్ అంటే, ఇంకొదరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని, మరికొదరు చైనా మేడ్ అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Rain In Train

సాధారణందా ఎయిర్-కండిషన్డ్ మెట్రో రైలు వర్షపు నీటిని లీక్ చేయకూడదు. ఏదైనా పొరపాటుగా లీక్ అయినా, అది చాలా చిన్నదై ఉండాలి. కానీ ముంబై మెట్రో రైలులో మాత్రం లీక్ భారీగా ఉంది. నిజం చెప్పాలంటే, బయటపడే వర్షాన్ని ఈ లీక్ మెట్రో రైలులో కురిపిస్తోంది.

అయితే, ఈ సమస్య అన్ని మెట్రో రైళ్లలో లేదు. మొత్తం 16 సర్వీసులకు గాను ఒక్క రైలులో ఏసి సరిగ్గా పనిచేయక పోవటం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లు మెట్రో రైలు అధికారులు పేర్కొన్నారు. ఈ సమస్య గుర్తించిన తర్వాత ఆ ట్రైన్‌ సేవలను నిలిపివేసి, స్టాండ్‌బైగా ఉంచిన రైలును ప్రవేశపెట్టామని వారు తెలిపారు.

రైలులో నీరు పడుతున్న సమయంలో ఓ ప్రయాణీకుడు తన సెల్‌ఫోన్‌లో బంధించిన ఓ వీడియోని మీరు కూడా చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/ohkBuF6Fx4w?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Mumbai Metro rail is pouring rain water from its Air Conditioning ducts. The train's AC unit reportedly malfunctioned during heavy shower. Take a look at this photo and video.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X