కార్వెట్ మ్యూజియంలో అగాధం; 8 వెలకట్టలేని కార్లు ధ్వంసం

By Ravi

సింక్‌హోల్స్ (హఠాత్తుగా ఏర్పడే అగాధాలు) మనకు కొత్తేమో కానీ, అమెరికన్లకు మాత్రమే పాతే. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉన్నట్టుండి సింక్‌హోల్స్ ఏర్పడి భీభత్సాన్ని సృష్టిస్తుంటాయి. (సింక్‌హోల్ అంటే భూమిలో ఏర్పడే ఓ లోతైన గుంత). తాజాగా అమెరికాలో మరో సింక్‌హోల్ ఏర్పడింది. అయితే, ఓ మ్యూజియం లోపల ఏర్పడింది. ఆ మ్యాజియం ఓ ప్రముఖ కార్ల కంపెనీకి చెందినది.

వివరాల్లోకి వెళితే.. జనరల్ మోటార్స్‌కు చెందిన జాతీయ కార్వెట్ మ్యూజియంలో సుమారు 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతున్న సింక్‌హోల్ ఏర్పండి. ఫిబ్రవరి 12, 2014వ తేదీన ఉదయం 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఈ కార్ మ్యూజియంలో సింక్‌హోల్ ఏర్పడటం నెమ్మదిగా ప్రారంభమై ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో అతిపెద్ద అగాధంగా మారిపోయింది.

Sinkhole Opens Under Corvette Museum

ఈ సింక్‌హోల్ తెల్లవారు జామున ఏర్పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ, ఈ సింక్‌హోల్ వలన మొత్తం 8 వెలకట్టలేని పురాతన షెవర్లే కార్వెట్ కార్లు మట్టిలో కలిసిపోయాయి. ఇందులో ఆరు కార్లు కార్వెట్ మ్యూజియంకి చెందినవి కాగా, మిగిలిన రెండు కార్లు జనరల్ మోటార్స్ నుంచి లోనుపై ఉన్నాయి.

ఈ కార్లలో 1962కి చెందిన నలుపు రంగు కార్వెట్, 1984 మోడల్ పిపిజి పేస్ కార్, 1992 మోడల్ మిలియన్త్ కార్వెట్, 1993 మోడల్ రూబీ రెడ్ 40వ వార్షికోత్సవ కార్వెట్, 2001 మోడల్ మాలెట్ హమ్మర్ కార్వెట్ జెడ్06, 2009 మోడల్ 1.5 మిలియన్త్ కార్వెట్ ఉన్నాయి. ఈ ఆరు మోడళ్లు కార్వెట్ మ్యూజియంకు చెందినవి.

ఇకపోతే 1993 మోడల్ కార్వెట్ జెడ్ఆర్-1 స్పైడర్ మరియు 2009 కార్వెట్‌లు జనరల్ మోటార్స్‌కు చెందినవి. నేషనల్ కార్వెట్ మ్యూజియంలోని స్కై డోమ్ సెక్షన్‌లో ఈ సింక్‌హోల్ ఏర్పడింది. ఈ విపత్తులో కేవలం ఒకే ఒక్క పురాతన 1983 మోడల్ కార్వెట్ మాత్రమే మిగిలింది. ఎమెర్జెన్సీ వర్కర్లు ఈ కారును అగాధంలోకి పోకుండా కాపాడగలిగారు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/xwnKie79mKo" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
A 40-foot sinkhole opened up in the National Corvette Museum on Feb 12, 2014, swallowing eight priceless Corvettes in the process.&#13;
Story first published: Friday, February 14, 2014, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X