యాంకో డిజైన్ నుంచి నత్త (స్నెయిల్) మోటార్‌సైకిల్

By Ravi

మానవుని మేధోశక్తికి అద్యంతాలు లేవనటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదేమో. ప్రతి మనిషిలోని సృజనాత్మకత ఉంటుంది, దానిని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదిగోల అలా సృష్టించినదే ఈ స్నెయిల్ మోటార్‌సైకిల్ (నత్త బైక్).

ఇది కూడా చదవండి: ఎగిరే బైక్

ప్రముఖ డిజైనింగ్ హౌస్ యాంకో డిజైన్ ఈ స్నెయిల్ మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది. ఇదొక ఫోల్డబిల్ ఎలక్ట్రిక్ బైక్ కాన్సెప్ట్. దీనిని పూర్తిగా మడిస్తే, నత్తగుల్ల (స్నెయిల్) మాదిరిగా రింగులు రింగులుగా వృత్తాకారంలోకి మడుచుకుంటుంది.

మనకు కావాలనుకున్నప్పుడు దీని అన్‌ఫోల్డ్ చేసుకొని రెగ్యులర్ ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగా రోడ్డుపై నడుపుకుంటూ పోవచ్చు. ఇది పేరుకే నత్త మోటార్‌సైకిల్ అయినప్పటికీ, ఇది నత్త మాదిరిగా మెల్లిగా కాకుండా వేగంగానే పరుగులు తీస్తుంది.

ఇది కూడా చదవండి: గొడుగు సైజులో మడుచుకునే సైకిల్

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

స్నెయిల్ మోటార్‌సైకిల్

స్నెయిల్ మోటార్‌సైకిల్‌ను యాంకో డిజైన్ హౌస్‌కు చెందిన కావో వీజ్హి, జ్హావో యాన్ మరియు వాంగ్ షుజింగ్ అనే డిజైనర్లు డిజైన్ చేశారు.

స్నెయిల్ మోటార్‌సైకిల్

స్నెయిల్ మోటార్‌సైకిల్‌ను రొటేట్ చేయటం, స్కేలింగ్ చేయటం ద్వారా అన్‌ఫోల్డ్ చేసి రైడబల్ మోటార్‌సైకిల్‌గా మార్చుకోవచ్చు.

స్నెయిల్ మోటార్‌సైకిల్

స్నెయిల్ మోటార్‌సైకిల్ వెనుక చక్రంలో ఓ ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ అమర్చబడి ఉంటుంది, దీని సాయంతోనే ఇది నడుస్తుంది.

స్నెయిల్ మోటార్‌సైకిల్

స్నెయిల్ మోటార్‌సైకిల్‌ను సులువుగా ఫోల్డ్ చేసుకొని ఏ ప్రాంతానికైనా తీసుకువెళ్లవచ్చు.


Source: Yanko Design

Most Read Articles

English summary
Call it a contradiction, but the ‘Snail Motorcycle’ promises to be a fast bike to ride. Designed as a foldable electric motorcycle, once it folds up, the bike is as small as a snail! Easy to carry and speedy to use, the concept looks very outlandish, which is why it interests us.
Story first published: Monday, August 11, 2014, 9:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X