శీతాకాలంలో సురక్షితంగా డ్రైవ్ చేయటం ఎలా?

By Ravi

ఉత్తర భారతాన్ని మంచు కప్పివేస్తోంది. ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతుండటంతో, కొన్ని ఉత్తరాధి రాష్ట్రాలు మంచుతో కప్పబడిపోతున్నాయి. ఇళ్లు, చెట్లు, వాహనాలు, రోడ్లు ఇలా అన్నీ తెల్లటి మంచు కప్పేస్తోంది. చూడటానికి ఇది అందంగా కనిపిస్తున్నప్పటికీ, అక్కడి ప్రజలు పడే ఇక్కట్లు మాత్రం అన్నీ ఇన్నీ కావు.

ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్‌లో మంచు భారీగా కురుస్తోంది. ఉత్తరకాశి, రుద్రప్రయాగ, బద్రినాధ్, కేదార్‌నాధ్, హేమకుండ్ సాహిబ్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ తదితర ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. మంచు కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

జవహర్ టన్నల్‌ను మూసివేయడంతో సుమారు 300 కిలోమీటర్ల మేర పలు చోట్ల వందల సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చాలా వరకూ వాహనాలు దట్టమైన పొడి మంచులో కూరుకుపోయి ఉన్నాయి. శీతల వాతావరణం కారణంగా కొన్ని వాహనాలైతే ముందుకు కదలనని మొండికేస్తున్నాయి.

ఈ శీతాకాలంలో వాహనాల డ్రైవింగ్ విషయంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

శీతాకాలపు డ్రైవింగ్ చిట్కాలు

తర్వాతి స్లైడ్‌లలో శీతాకాలపు డ్రైవింగ్ చిట్కాలను తెలుసుకోండి.

టైర్లు చెక్ చేసుకోవాలి

టైర్లు చెక్ చేసుకోవాలి

శీతాకాలంలో టైర్లు చాలా కీలకమైనవి. గడ్డకట్టిన రోడ్లపై అరిగిపోయిన టైర్లు కలిగిన వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు, వాహనం రోడ్డుపై నుంచి జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మీ టైర్ల పనితీరును ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.

శీతాకాలం కోసం ప్రత్యేక టైర్లు

శీతాకాలం కోసం ప్రత్యేక టైర్లు

శీతాకాలం కోసం ప్రత్యేకమైన టైర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టైర్ల త్రెడ్/బటన్స్ తడిసిన లేదా మంచుతో నిండిన రోడ్లపై మంచి గ్రిప్‌నిస్తాయి. కాబట్టి ఈ వాతావరణానికి అనువుగా ఉండే టైర్లను అమర్చుకుంటే మంచిది.

ఒకవేళ స్కిడ్ అయితే

ఒకవేళ స్కిడ్ అయితే

మంచుతో నిండిన రోడ్డుపై వాహనం నడుపుతున్న స్కిడ్ అవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా, ఇలాంటి సందర్భాల్లో కంగారు పడిపోయి స్టీరింగ్‌ను ఎలా పడితే అలా తిప్పేయకూడదు. ఇలాంటి ఎక్సెసివ్ స్టీర్‌కి బదులుగా వాహనం జారుతున్న దిశకు అపసవ్య దిశలో స్టీర్ చేయాలి.

ఏబిఎస్ తప్పనిసరి

ఏబిఎస్ తప్పనిసరి

శీతల వాతావరణంలో నడిపే వాహనాలకు తప్పనిసరిగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఉండాలి. తడిసిన/మంచుతో కప్పబడిన రోడ్లపై ఏబిఎస్ కలిగిన వాహనాలు ఏబిఎస్ లేని వాహనాలతో పోల్చుకుంటే, తక్కువగా స్కిడ్ అవుతుంటాయి.

ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలు బెస్ట్

ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలు బెస్ట్

మంచుతో కప్పబడిన రోడ్లపై సాధారణ ఫ్రంట్-వీల్ లేదా రియర్-వీల్ డ్రైవ్ కార్ల కన్నా ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలు చక్కగా సూట్ అవుతాయి. యాక్సిలరేషన్ విషయంలో ఈ వాహనాలు చక్కగా సహకరిస్తాయి. కానీ ఇవి కార్నర్స్ వద్ద ఎక్కువ గ్రిప్‌ను ఆఫర్ చేయలేవు.

కనీసం హాఫ్ ట్యాంక్ ఇంధనం

కనీసం హాఫ్ ట్యాంక్ ఇంధనం

శీతాకాల సమయంలో మీ వాహనంలో కనీసం సగం ట్యాంక్ వరకూ ఇంధనం ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా చేయటం వలన ఇంధన లైన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉండదు.

పార్కింగ్ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్ వాడొద్దు

పార్కింగ్ బ్రేక్, క్రూయిజ్ కంట్రోల్ వాడొద్దు

మంచు ప్రాంతంలో వాహనాన్ని నిలపాల్సి వచ్చినప్పుడు పార్కింగ్ బ్రేక్ వాడకపోవటమే మంచిది. అలాగే, జారుడు స్వభావం కలిగిన రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ క్రూయిజ్ కంట్రోల్‌ను ఉపయోగించకూడదు.

నెమ్మదిగా నడపాలి

నెమ్మదిగా నడపాలి

యాక్సిలరేషన్, స్టాపింగ్, టర్నింగ్ వంటివి సాధారణ రోడ్లపై జరిగినంత వేగంగా మంచుతో నిండిన రోడ్లపై జరగవు. కాబట్టి, ఇలాంటి రోడ్లపై నడిపేటప్పుడు చాలా నెమ్మదిగా వ్యవహరించాలి, తొందరపాటు అస్సలు పనికిరాదు.

Most Read Articles

English summary
North Indian high-altitude states hit by snow. Parts of the capital woke up to a dense fog while snowfall covered Kullu, Uttarkashi and Shimla. Snow and ice can create many issues for drivers and their cars. Read our tips and advice on staying safe as we answer some of your most common questions
Story first published: Friday, January 23, 2015, 12:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X