నేటి ఫేస్‌బుక్ వీడియో: మంచుపై మహా డ్రిఫ్టింగ్!
By Ravi
తారు రోడ్డుపై రేస్ కారుతో రేసర్లు డ్రిఫ్టింగ్ చేస్తుంటే చాలా ఫన్‌గా ఉంటుంది. అదే తారు రోడ్డుకు బదులు పొడి మంచుతో నిండిన ప్రాంతం అయితే ఈ ఫన్ మరింత రెట్టింపు అవుతుంది. ఈరోజు మన ఫేస్‌బుక్ వీడియోలో అలాంటి ఓ అద్భుతాన్నే చూడబోతున్నాం.
జాన్ ఓల్స్‌సన్ అనే ప్రొఫెషనల్ ఫ్రీస్కీయర్ (ప్రస్తుతం గాయం కారణంగా బ్రేక్‌లో ఉన్నాడు)కి మంచుపై రెగ్యులర్ స్కీయింగ్ ప్యాడ్స్‌తో స్కీయింగ్ చేయటానికి బదులుగా కారుతో స్కీయింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనిపించిందో ఏమో కానీ, టక్కున ఓ పవర్‌ఫుల్ రేస్ కారుతో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు.
Jon Olsson Drifting
మొత్తం 600 గుర్రాల శక్తితో (600 హార్స్ పవర్) సమానమైన ఇంజన్ కలిగిన ఓ ప్రోటోటైప్ రేస్ కారులో జాన్ ఓల్స్‌సన్ మంచుపై డ్రిఫ్టింగ్ చేస్తుంటే ఎవ్వరైనా సరే కళ్లార్పకుండా చూడాల్సిందే. లీ మ్యాన్స్ ప్రోటోటైప్‌లా కనిపించే ఈ కారు, వాస్తవానికి రోడ్ లీగల్ కారు. అంతేకాదు, దీని యజమాని కూడా ఓల్స్‌సన్ కావటం విశేషం.
'రెబెల్లియన్ ఆర్2కె'గా పిలిచే ఈ కారును ఓల్స్‌సన్ గడచిన సంవత్సరంలో జరిగిన గంబాల్ 3000 ర్యాలీలో పాల్గొనేందుకు కస్టమైజ్ చేశారు. అల్టిమా జిటిఆర్ కారును ఆధారంగా చేసుకొని దీనిని తయారు చేశారు. ఇందులో ఆడి ఆర్8 వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. కేవలం 1000 కేజీల బరువును మాత్రమే కలిగి ఉండే ఈ కారు ధర 5 లక్షల యూరోలు (రూ.4.18 కోట్లు).
స్వీడన్‌లోని మంచుతో కప్పబడి ఉన్న సోర్లీన్ పర్వతంపై ఆడి ఆర్6 కారులో డ్రిఫ్ట్ చేయాలనుకున్నానని, కానీ ఆ తర్వాత కస్టమ్ రోడ్ లీగల్ రేస్ కారులో అయితే మరింత ఫన్ ఉంటుదనే ఉద్దేశ్యంతో ఈ రెబెల్లియన్ ఆర్2కె కారును 315 వైడ్ వింటర్ టైర్లతో మోడిఫై చేసి ఈ ట్రైల్ చేశానని ఓల్స్‌సన్ చెప్పుకొచ్చాడు. మరి ఆ స్టన్నింగ్ వీడియోని మనం కూడా చూసేద్దామా..!
Post by DriveSpark.
Most Read Articles
English summary
Story first published: Friday, April 11, 2014, 17:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X