హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీలలో ప్రధానంగా వినిపించే పేర్లలో హోండా మోటార్ కంపెనీ కూడా ఒకటి. జపాన్‌కు చెందిన ఈ ఆటోమొబైల్ బ్రాండ్ అమెరికాలో అత్యంత విజయవంతమైన ఫారిన్ ఆటోమొబైల్ బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.

ఇది కూడా చదవండి: ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర నిజాలు

సరసమైన ధరకు నాణ్యమైన ఉత్పత్తలను అందించడంలో హోండాకు సాటి మరొకరు రారన్నా అతిశయోక్తి లేదేమో! ఈ కథనంలో మనం హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలను తెలుసుకుందాం రండి.

ఇది కూడా చదవండి: ఆటోమొబైల్స్ గురించి కొన్ని సరదా నిజాలు

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా ఆటోమొబైల్స్ తయారు చేయడాని కన్నా ముందుగా మోటారైజ్డ్ బైస్కిల్స్ (మోటార్ కలిగిన సైకిళ్లు)ను తయారు చేసేది. ప్రపంచ యుద్ధం తర్వాత ఈ కంపెనీ సంస్థపాకుడు సోయిచిరో హోండా, అతని వద్ద 12 మంది ఇంజనీర్లు బైక్‌లలో ఫిక్స్ చేయగలిగే ఇంజన్లను తయారు చేసేవారు.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా ప్రతి సంవత్సరం 14 మిలియన్లకు పైగా కంబస్టియన్ ఇంజన్లను తయారు చేస్తుంది. అంతేకాదు, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఇంజన్ల తయారీ కంపెనీ. 1959 నుంచి హోండా ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారుగా ఉంది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా తయారు చేసిన 'హోండా ప్రిలూడ్' అనే కారు ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోర్-వీల్ డ్రైవ్ కారు.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

ఇసుజు ద్వారా నిర్మించబడిన ది పాస్‌పోర్ట్ అనే వాహనం, హోండా విడుదల చేసిన మొట్టమొదటి ఎస్‌‌యూవీ.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

ప్రొడక్షన్ వెహికల్‌లో వి-టెక్‌ను ఉపయోగించిన మొట్టమొదటి కంపెనీ కూడా హోండానే.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా సివిక్ హైబ్రిడ్ కారును 2003లో పరిపచం చేశారు. ఇది ఈ సెగ్మెంట్లోనే మొట్టమొదటి నాన్-ప్లగ్ వెహికల్ (బ్యాటరీల చార్జింగ్ కోసం ప్లగ్ చేయాల్సిన అవసరం లేని వాహనం). కారు జీవత కాలం పాటు బ్యాటరీలు మన్నేలా వీటిని తయారు చేశారు.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా సివిక్ కారును 1973లో విడుదల చేశారు. అప్పట్లో ఎదుర్కొంటున్న చమురు మాంద్యాన్ని తట్టుకునేందుకు హైవేపై గ్యాలన్‌కు 40 మైళ్ల మైలేజీనిచ్చేలా దీనిని తయారు చేశారు. దీంతో ఇది ప్రపంచంలో కెల్లా అత్యధిక మైలేజీనిచ్చే కారుగా నిలిచింది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా 2001వ సంవత్సరంలో జపాన్‌లో ప్రపంచంలో కెల్లా రెండవ అతిపెద్ద కారు తయారీదారుగా అవతరించింది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా మార్కెట్ విలువ జిఎమ్, ఫోర్డ్ కంపెనీల రెండింటి మార్కెట్ విలువతో సమానం. హోండా ప్రపంచంలో కెల్లా 8వ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా 1986లో 'అక్యురా' అనే ప్రత్యేక లగ్జరీ బ్రాండ్‌ను విడుదల చేసిన మొట్టమొదటి జపనీస్ కార్ కంపెనీగా నిలిచింది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా ఎ600 అనేది తొలిసారిగా హోండా తయారు చేసిన హోండా కారు. అప్పట్లో ఇది ఫాస్ట్‌బ్యాక్, కన్వర్టిబర్ మోడళ్లలో లభ్యమయ్యేది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

వాస్తవానికి హోండా జపాన్ కంపెనీ అయినప్పటికీ, ఇది అనేక వాహనాలు అమెరికాలోనే ఉత్పత్తి చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లో హోండాకు చాలా ప్లాంట్‌లు, ఆర్ అండ్ డి కేంద్రాలు, ఇంజన్ మరియు ట్రాన్సిమిషన్ ప్లాంట్‌లు ఉన్నాయి.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

యునైటెడ్ స్టేట్స్‌లో తయారైన మొట్టమొదటి ఫారిన్ కారు 'హోండా అకార్డ్'. హోండా 1982లో ఓహియోలోని మేరిస్‌విల్లే ప్లాంట్‌లో అకార్డ్ ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పట్లో అమెరికాలో అత్యధికంగా అమ్ముడుపోయిన మొట్టమొదటి ఫారిన్ బ్రాండ్‌గా కూడా హోండా అకార్డ్ చరిత్ర సృష్టించింది.

హోండాకు సంబంధించి కొన్ని ఆసక్తికర నిజాలు

హోండా కేవలం కార్లు, మోటార్‌సైకిళ్లు మాత్రమే అనేక విశిష్ట ఉత్పత్తులను కూడా తయారు చేసింది. వాటర్‌క్రాఫ్ట్స్, ఆల్-టెర్రైన్ వెహికల్స్, మౌంటైన్ బైక్స్, లాన్ ఎక్విప్‌మెంట్, సోలార్ సెల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్‌తో పాటుగా రోబోట్‌లను కూడా హోండా తయారు చేస్తోంది.

సుజుకి

సుజుకి బ్రాండ్‌కు సంబంధించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర వాస్తవాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయడి.

Most Read Articles

English summary
Japanese car brand the Honda Motor Company has a long and engaging history. Here are some of the interesting facts about Honda. Read on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X