భారతీయ వాహన రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు

By N Kumar

టాటా గ్రూప్ ఇది మన దేశంలో అతి పెద్ద వ్యాపార వాణిజ్య సంస్థ. దేశంలో టాటా కుబేరుల కుటుంబం స్థాపించిన అతి పెద్ద సామ్రాజ్యం టాటా గ్రూప్. టాటా వ్యాపార సామ్రాజ్య అభివృద్దిలో రతన్ టాటా కీలక పాత్రను పోషించాడు. ఆయన నాయకత్వంలో టాటా సంస్థ నుండి ఎన్నో రకాల కొత్త ఉత్పత్తులు ఊపిరిపోసుకున్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయంగా టాటా సంస్థ గుర్తింపుకు కారణమయ్యాడు.
Also Read: లీటర్‌కు 100 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు
AUTO EXPO NEWS: ఆటో ఎక్స్ పో వేదిక మీద కన్నుల నిండా కనువిందు చేసిన కత్రినా కైఫ్
ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ మీద ఆయనకు ఎంతో మక్కువ కలదు. రతన్ టాటా గారి నాయకత్వంలో టాటా మోటార్స్ సంస్థలో ఎన్నో వినూత్న ఉత్పత్తులు రూపొందించబడ్డాయి. ఎంతో మంది యువకులు ఇతనిని రోల్ మోడల్ గా ఎంచుకున్నారు. అయితే డిసెంబర్ 28 రతన్ టాటా గారు 78 వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆటోమొబైల్ రంగంలో సాధించిన అపారమైన విజయాలు మరియు ఆసక్తికరమైన సంఘటనల గురించి ప్రత్యేక కథనం మీకోసం...

1. కుటుంబ నేపథ్యం :

1. కుటుంబ నేపథ్యం :

రతన్ టాటా 1937 డిసెంబర్ 28 న గుజరాత్‌లో నావల్ టాటా మరియు సూని దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. తరువాత రతన్ అమ్మమ్మ సంరక్షణలో పెరిగాడు. రతన్ టాటా పుట్టుకతోనే అత్యంత సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతని బాల్య విద్యాభ్యాసం అంతా కూడా ముంబైలోనే గడిచిపోయింది. తరువాత హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఉన్నత చదవులు పూర్తి చేసుకున్నాడు.

2. మొదటి ఉద్యోగం

2. మొదటి ఉద్యోగం

టాటా కుటుబం యొక్క మొదటి వ్యక్తిగత సంస్థ టాటా స్టీల్. రతన్ టాటా ప్రారంభంలో ఒక సాధారణ ఉద్యోగిగా ఈ సంస్థలోకి 1961 లో అడుగుపెట్టాడు. ఆ తరువాత 1991 నాటికి సంస్థకు మంచి పేరుని తీసుకువచ్చాడు. టాటా గ్రూపులకు అప్పట్లో ఛైర్మెన్ గా వ్యవహరించిన జె.ఆర్.డి టాటా తన పదవీ విరమణ అనంతరం టాటా సంస్థలకు రతన్ టాటాను ఛైర్మైన్ గా ఎంపిక చేశారు. వీరు వాహనం రంగంలో ఎదిగిన తీరు గురించి తరువాత స్లైడర్ల ద్వారా తెలుసుకోగలరు.

3. మొదటి ప్యాసింజర్ కారు:

3. మొదటి ప్యాసింజర్ కారు:

టాటా గ్రూప్ సంస్థలను అభివృద్ది చేసే భాగంలో రతన్ టాటా గారు టాటా నుండి మొదటి ప్యాసింజర్ కారును రూపొందించి 1998 లో టాటా ఇండికా అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు. విడుదల చేసిన అనతి కాలంలోనే టాటా ఇండికా అత్యధికంగా అమ్మకాలు నమోదు చేసుకుని రెండు సంవత్సరాల దేశ వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది.

4. రతన్ టాటా కళల కారు

4. రతన్ టాటా కళల కారు

భారత దేశంలో ఇప్పటికి కూడా వాహన యోగానికి నోచుకులేక పోతున్నారు. కారణం ఎన్నో కుటుంబాలు ఆర్థిక పరంగా వెనకబడి ఉండటం మరియు కార్ల ధరలు ఎక్కువగా ఉండటం. దీని స్వతంగా ప్రయాణం అనేది అందరికి కళగానే ఉండేది. అందుకోసం రతన్ టాటా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా టాటా నానో కారును రూపొందించాలని అనుకున్నాడు. తరువాత దీనిని కేవలం లక్ష రుపాయలకే దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత చవవైక కారుగా రికార్డును కూడా సృష్టించింది.

5. జాగ్వార్, ల్యాండ్ రోవర్ లకు సహాయం

5. జాగ్వార్, ల్యాండ్ రోవర్ లకు సహాయం

రతన్ టాటా గారు తీసుకుంటున్న వ్యాపార నిర్ణయాలు జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి సంస్థల కూడా స్వాగతించాయి. ఆ తరువాత రతన్ టాటా జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ వంటి సంస్థలలో 2008లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. ఇప్పుడు ఇతని నిర్ణయాల పుణ్యమా అని ఈ రెండు దిగ్గజ సంస్థలు అంతర్జాతీయ వాహనం రంగంలో విపరీతమైన అమ్మకాలు సాధిస్తున్నాయి.

6. ఉపాధి కల్పన

6. ఉపాధి కల్పన

దేశ వ్యాప్తంగా అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న వారిలో రతన్ టాటా ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం టాటా వారి సంస్థలలో దాదాపుగా 33,000 మంది ప్రజలకు ఉపాధి లభించింది. దీనికి కారణం రతన్ టాటా గారు తీసుకునే అసాధారణమైన వ్యాపార నిర్ణయాలు అని చెప్పవచ్చు.

 7. కోయంబత్తూరు రహస్య పర్యటన

7. కోయంబత్తూరు రహస్య పర్యటన

గత పది సంవత్సరాలుగా టాటా మోటార్స్ వారు కార్ల తయారీలో ఎన్నో నూతన మార్పులు ఆవిష్కరణలు జరిగాయి. కార్ల యొక్క ఇంజన్‌ల కోసం ఇతర సంస్థల మీద ఆధారపడకుండా ఇండస్ట్రీ స్వతంత్రంగా ఇంజన్‌లను తయారు చేసుకుంది. అయితే ఈ తరుణంలో రతన్ టాటా గారు ఎన్నో సార్లు రహస్య పర్యటనలు కూడా చేశారని అప్పట్లో కొన్ని వార్తా పత్రికలు ప్రచురించాయి.

8. రతన్ టాటా నిష్క్రమణ

8. రతన్ టాటా నిష్క్రమణ

రతన్ టాటా గారు తన 75 సంవత్సరాల వయస్సులో టాటా గ్రూప్ ఛైర్మెన్ నుండి వైదొలగారు. ఆ తరువాత టాటా గ్రుపు సంస్థలకు గౌరవ ఛైర్మెన్ గా సైరస్ మిస్త్రీ ఎంపి కావడం జరిగింది.

9. రతన్ టాటా పెట్టుబడులు

9. రతన్ టాటా పెట్టుబడులు

రతన్ టాటా ఛైర్మెన్ పదవి నుండి వైదొలగిన తరువాత కాలక్షేపం కోసం ఎన్నో స్టార్టప్ సంస్థలలో పెట్టుబడులు పెట్టి ఆ సంస్థలకు తన వంతు సహాయం కల్పించి వాటిని లాభాల బాటలో నడిపించడం మొదలు పెట్టాడు. ఇందులో బాగంగా ఆంపియర్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగంలో కూడా రతన్ గారు పెట్టుబడులు పెట్టారు. అంతే కాకుండా చాలా రకాలల టెక్నాలజీ సంస్థలకు ఈయన నాయకత్వం వహిస్తూ, నూతనంగా కంపెనీలను స్థాపించే వారికి వెన్నుగా నిలుస్తున్నారు.

10. లా ఫెరారి కొనడానికి అంత డబ్బు లేదు...

10. లా ఫెరారి కొనడానికి అంత డబ్బు లేదు...

2013 లో జరిగన జెనీవా మోటార్ షో ని రతన్ టాటా సందర్శించాడు. అప్పడు ఫెరారి కార్ల సంస్థ లుకా డి కార్డియో ను కలుసుకున్నాడు. ఆ సందర్భంలో అక్కడ ఫెరారి వారు ప్రదర్శించిన కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ చూడటానికి ఎంతో అందంగా ఉందన్నారు. ఇది అధ్భుతమైన డిజైన్‌ను పోలి ఉందని తెలిపాడు. అప్పుడు మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు అన లుకాడి తెలపగా, సారీ నా దగ్గర డబ్బులేదని హాస్యాస్పదం చేశారు.

 11. పాకిస్తాన్ ఆర్డర్ ను తిరస్కరించిన రతన్ టాటా

11. పాకిస్తాన్ ఆర్డర్ ను తిరస్కరించిన రతన్ టాటా

టాటా వారి యస్‌యువి సుమో గ్రాండ్ దాదాపుగా 380 యూనిట్లు కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం టాటా మోటార్స్ వారిని సంప్రదించగా. రతన్ టాటా ఈ డీల్‌ను తిరస్కరించాడు. ఒక సారి ఇలాగే పాకిస్తాన్‌కు వాహనాలు సరఫరా చేయగా చాలా వరకు టాటా వాహనాలను అక్కడ రీకాల్ గా గుర్తించినట్లు గుర్తు చేశారు. ఈ కారణంగా తరువాత పాక్ కు వాహన సరఫరా నిలిపివేశారు.

12. భారత దేశపు అతి పెద్ద వాహన రంగ సంస్థ

12. భారత దేశపు అతి పెద్ద వాహన రంగ సంస్థ

టాటా మోటార్స్‌ను దేశ వ్యాప్తంగా అతి పెద్ద వాహన రంగ సంస్థగా నిలపడంలో రతన్ టాటా ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చాడు. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో టాటా వారి బస్సులు, వాణిజ్య వాహనాలు, ట్రక్కులు, కార్లు, యస్‌యువిలు, వ్యానులు వంటి విసృత శ్రేణి వాహనాలను అందిస్తోంది. టాటా మోటార్స్ నుండి ఇన్ని రకాల ఉత్పత్తులు విడుగదల అవ్వడానికి రతన్ టాటా గారు ముఖ్యకారకులు అని చెప్పవచ్చు.

13. లెక్కలేనన్ని అవార్డులు

13. లెక్కలేనన్ని అవార్డులు

రతన్ టాటా గారి విజయ ప్రస్థానంలో మన దేశం నుండి మరియు అంతర్జాతీయంగా చాలా అవార్డులు ఇతనిని వరించాయి. మన దేశంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే అవార్డులను 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ మరియు 2008 పద్మ విభూషణ్ అవార్డులు ఇతని వరించాయి.

14. కార్ల ప్రియుడు

14. కార్ల ప్రియుడు

ఇతను కార్లు అంటే మహా ఇష్టం, అందులో కూడా కన్వర్టబుల్ కార్లు మరీ ఇష్టం. కార్ల పట్ల ఇతనికి ఉన్న అభిరుచి, ఇతను ఎలాంటి కార్లను ఎంచుకుంటాడు మరియు ఇతని వద్ద గల కార్ల గురించి తరువాత స్లైడర్ ద్వారా తెలుసుకుందాం రండి.

15. రతన్ టాటా ఫెరారి కారు

15. రతన్ టాటా ఫెరారి కారు

రతన్ టాటా గారు ప్రతి ఆదివారం కూడా తన దగ్గర ఉన్న ఫెరారి కారులో తీర ప్రాంతం రహదారుల మీద ప్రయాణం చేస్తాడు. ఈ కారు నంబరు 111 గా మీరు గమనించవచ్చు. మరియు ఆ రహదారిలో వివిధ రకాల ఫోటో లు తీసి సామాజిక్ మాధ్యమాలలో పోస్ట్ చేయడం ఇతనికి ఎంతో కాలంగా ఉన్న అలవాటు

16. ఫెరారి కారు గురించి

16. ఫెరారి కారు గురించి

నలుగురు వ్యక్తులు కూర్చుని ప్రయణించే వీలున్న ఈ కారు పూర్తిగా కన్వర్టిబుల్ అనగా కారుకు పై భాగంలో ఉన్న టాప్ తెరుచుకోవడం మరియు మూసుకుపోవడం వంటి చేస్తుంది. ఇందులో 4.3-లీటర్ కెపాసిటి గల ఇంజన్ కలదు, ఇది దాదాపుగా 453 బిహెచ్‌పి పవర్ మరియు 485 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

17. టాటా ఇండిగో మెరీనా

17. టాటా ఇండిగో మెరీనా

రతన్ టాటా గారికి కుక్కలు అంటే విపరీతమైన ప్రేమ. వీటి కోసం ప్రత్యేకంగా ఒక కారును కూడా ఏర్పాటు చేశాడు. పూనేలో ని ఫామ్ హౌస్‌లో వీటిని సంరక్షిస్తున్నాడు. ఇతని పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకంగా ఈ కారును వినియోగిస్తున్నాడు.

18. ఇండిగో మెరీనా గురించి

18. ఇండిగో మెరీనా గురించి

టాటా వారి ఇండిగో మెరినా కారు చూడటానికి వ్యాగన్ లా ఉంటుంది. మరియు ఇందులో లోపలి వైపు పెద్దగా స్థలం కూడా ఉండదు. బహుశా ఈ కారణంతోనే కావచ్చు వీటి ఉత్పత్తి ని నిలిపివేశారు.

19. హోండా సివిక్

19. హోండా సివిక్

రతన్ టాటా గారు అమితంగా ఇష్టపడే మరొక కారు హోండా వారి సివిక్, ఇది ఎంతో స్మూత్‌గా ఉంటుందని రతన్ టాటా గారు చెప్పారు. అప్పుడప్పుడు ఇతను ఈ పెట్రోల్ హోండా సివిక్ కారులో ప్రయాణిస్తుంటాడు.

 20. హోండా సివిక్ గురించి

20. హోండా సివిక్ గురించి

1972 లో తయారు అయిన హోండా సివిక్ కారును రతన్ టాటా గారు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం హోండా వారు సివిక్ లో దాదాపుగా 10 రకాల మోడల్స్‌ను ప్రపంచ మార్కెట్‌కు అందించారు. ఈ మద్యనే హోండా వారు పదవ తరానికి చెందిన సివిక్ కారును మార్కట్లోకి విడుదల చేశారు. మరియు హోండా వారి మొదటి తరం సివిక్ కార్ల ఉత్పత్తిని ప్రస్తుతం నిలిపివేశారు. ప్రపంచ వ్యాప్తంగా హోండా వారు అమ్మకాలు జరుపుతున్న మోడల్ "సివిక్" కారు.

 21. మసెరాటి క్వాడ్రోపోర్ట్

21. మసెరాటి క్వాడ్రోపోర్ట్

మసెరాటి దీని పేరు వినగానే ఇది ఖరీదైన కారు అని ఇట్టే తెలిసిపోతోంది కదా? అవును రతన్ టాటా గారి వద్ద ఉన్న ఖరీదైన కార్లలో ఇదీ ఒకటి . ఇటాలియన్ కు చెందిన మసెరాటి సంస్థ వారు తయారు చేసిన 1963 మోడల్ నాటి మసెరాటి క్వాడ్రోపోర్ట్ స్పోర్ట్స్ కారును వినియోగిస్తున్నాడు.

22. మసెరాటి క్వాడ్రోపోర్ట్ కారు గురించి

22. మసెరాటి క్వాడ్రోపోర్ట్ కారు గురించి

మసెరాటి వారు సృష్టించిన ఈ కారు 1963 లో ప్రపంచ మార్కెట్ కు పరిచయం అయ్యింది. ఈ క్వాడ్రోపోర్ట్‌ మోడల్ కు చెందిన ఆరవ తరం కారు కూడా మార్కెట్లోకి విడుదల అయ్యింది. అప్పట్లో దీనిని ఒక కళగా రతన్ టాటా గారు భావించేవారు.

23. క్వాడిల్లాక్ ఎక్స్‌ఎల్ఆర్

23. క్వాడిల్లాక్ ఎక్స్‌ఎల్ఆర్

రతన్ టాటా కార్లకు ఎంత బానిసో అని ఇతను ఎంచుకునే కార్లే మనకు చెపుతాయి. ఇతని ఖాతాలో ఉన్న మరొక కారు క్యాడిల్లాక్ కు చెందిన ఎక్స్ఎల్ఆర్ కారు.

 24. క్యాడిల్లాక్ ఎక్స్‌ఎల్ఆర్ గురించి మరిన్ని వివరాలు

24. క్యాడిల్లాక్ ఎక్స్‌ఎల్ఆర్ గురించి మరిన్ని వివరాలు

రతన్ టాటా గారి ఈ క్యాడిల్లాక్ ఎక్స్‌ఎల్ఆర్ కారులో 320 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేసే 4.6-లీటర్ కెపాసిటి గల అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలదు. ఇందులో కన్వర్టిబుపల్ ఆప్షన్ కూడా కలదు. ప్రస్తుతం ఇవి అమ్మకాలకు అందుబాటులో ఉన్నాయి.

 25. మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్

25. మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్

రతన్ టాటా గారికి ఎక్కువగా కారు టాపును తెరుచుకునే మరియు మూసుకునే అవకాశం గల కార్లు అంటే ఎంతో ఇష్టం. అందులో భాగంగానే అనేక సౌకర్యాలు గల కన్వర్టిబుల్ మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్ కారును ఎంచుకున్నాడు. ఈ కారు గురించి మరిన్ని వివరాలు తరువాత స్లైడర్‍‌‌లో

26. మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్ గురించి...

26. మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్ గురించి...

మెర్సిడెస్ బెంజ్ 500 యస్‌ఎల్ విలాసవంతమైన కన్వర్టిబుల్ కారులో అత్యంత శక్తివంతమైన 5.0-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్ కలదు . ఈ ఇంజన్ దాదాపుగా 306 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 27.మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్

27.మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్

రతన్ టాటా గారు తన అన్ని కార్లకు ఒక ప్రత్యేకల గ్యారేజి ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మరొక లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్ కు స్థానం కల్పించాడు.

 28. మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్ గురించి....

28. మెర్సిడెస్ బెంజ్ యస్-క్లాస్ గురించి....

ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కార్లకు ప్రత్యేకంగా పేరుగాంచిన సంస్థ మెర్సిడెస్ బెంజ్. మెర్సిడెస్ బెంజ్ వారు ప్రపంచ వ్యాప్తంగా గల విసృత శ్రేణి వినియోగదారులకు రకరకాల విలాసవంతమైన సౌకర్యాలను కల్పింస్తోంది. అయితే మెర్సిడెస్ బెంజ్ వారిని ప్రేమించే వారిలో రతన్ టాటా లేకపోలేడు. ఇతను కూడా దీనిని అమితంగా ఇష్టపడుతున్నాడు.

29. జాగ్వార్ యఫ్-టైపు

29. జాగ్వార్ యఫ్-టైపు

రతన్ టాటా గారు ఈ జాగ్వార్ యఫ్-రకం కారును ప్రపంచ సుందరిగా అభివర్ణించాడు. ఈ జాగ్వార్ కారుకు తన గ్యారేజిలో స్థానం కల్పించాడు. అయితే ఈ జాగ్వార్ యఫ్-టైపు కారు రాకంతో ఇతని కార్ హోమ్ మరింత ఖరీదైనదిగా రూపాంతరం చెందింది.

30.జాగ్వార్ గురించి గుర్తుపెట్టుకోవాల్సినవి...

30.జాగ్వార్ గురించి గుర్తుపెట్టుకోవాల్సినవి...

జాగ్వార్ యఫ్-టైపు కన్వర్టిబుల్ కారులో అత్యధిక శక్తివంతమైన 5.0-లీటర్ కెపాసిటి గల వి-8 ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 488 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రతన్ టాటా గారి కారు గ్యారేజిలో అత్యధిక శక్తివంతమైన మరొక కారు ఇది.

31. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్

31. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్

గౌరవనీయులు రతన్ టాటా గారు ప్రస్తుతం తరచుగా ఈ జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్ కారును ఉపయోగిస్తున్నారు. లగ్జరీ సెడాన్ స్పోర్ట్స్ కారు ఉత్తమ పనితీరును కనబరుస్తుంది.

 32. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్ గురించి

32. జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్ గురించి

రతన్ టాటా గారు అన్ని రకాల అవసరాలకు ఈ కారును ఉపయోగంచ వచ్చు. ఈ జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ఆర్ కారులో అత్యంత శక్తివంతమైన 5.0-లీటర్ కెపాసిటి గల ఇంజన్ కలదు.ఈ ఇంజన్ దాదాపుగా 503 బిహెచ్‌పి పవర్ మరియు 625 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

33. ల్యాండ్ రోవర్

33. ల్యాండ్ రోవర్

ల్యాండ్ రోవర్ వారు అత్యధికంగా అమ్మకాలు చేపట్టిన లగ్జరీ యస్‌యువి కారును తీసుకోవాలని ప్రస్తుతం టాటా సంస్థల యాజమాని రతన్ టాటా భావిస్తున్నారు.

34. క్రిస్లర్ సెర్బిన్

34. క్రిస్లర్ సెర్బిన్

ప్రయాణాన్ని ఎక్కువగా ఆనందించే రతన్ టాటా గ్యారేజిలో మరొక అత్భుతమైన కారు కలదు. రతన్ టాటా కు క్రిస్లర్ వారి సెర్బిన్ మోడల్ కారు అంటే ఎంతో ఇష్టం.

మరిన్ని కథనాలు...
  1. 7000 కార్లను కలిగి ఉన్న అత్యంత సంపన్నుడు సుల్తాన్ ఆఫ్ బ్రునెయి
  2. ముఖేష్ అంబానీ లగ్జరీ కార్ హోమ్... ఎన్ని కార్లు ఉన్నాయో ఓ సారి చూద్దామా...!!
  3. ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న ఆనంద్ మహీంద్రా గురించి ఆశక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
Some Interesting Facts About Ratan Tata
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X