ఆటోమొబైల్స్‌కు సంబంధించి కొన్ని ఫన్ ఫ్యాక్ట్స్!

మీరందరూ మనుషులు, జంతువులు, స్థలాలు, వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన అనేక అంశాల గురించి కొన్ని ఆసక్తికర అంశాలను చదివే ఉంటారు. కానీ, ఇప్పుడు ఈ కథనంలో మనం తెలుసుకోబోయే కార్ ఫ్యాక్ట్స్ చాలా ఆసక్తికరంగాను మరియు సరదాగాను ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఆటోమొబైల్స్ గురించి కొన్ని ఆసక్తికర వాస్తవాలు (వరల్డ్‌వైడ్)

నేటి ఆధునిక ప్రపంచంలో ఆటోమొబైల్ (ప్రత్యేకించి కారు) కూడా ఓ నిత్యావసరంగా మారిపోయింది. మానవుడి ప్రయాణ అవసరాలను తీర్చడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించే ఈ ఆటోమొబైల్ కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్‌ను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి.

ఇది కూడా చదవండి: సుజుకి గురించి మీకు తెలియని ఆసక్తికర వాస్తవాలు

జీసెస్ క్రైస్ట్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్

జీసెస్ క్రైస్ట్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్

జీసెస్ క్రైస్ట్ పేరుతో కనీసం 6 డ్రైవింగ్ లైసెన్స్‌లు ఉన్నాయట. మనదేశంలో కూడా ఏదో ఒక చోట భగవంతుడి పేరుతో డ్రైవింగ్ లైసెన్సులు ఉండటం సహజమే. ఎందుకంటే మనషులు కూడా భగవంతుల పేర్లు పెట్టుకుంటుంటారు కాబట్టి.

1931 బుగాటి రాయల్ కెల్నర్ కూపే

1931 బుగాటి రాయల్ కెల్నర్ కూపే

ఇప్పటి వరకు వేలంలో అత్యధికంగా అమ్ముడుపోయున పురాతన కారు 1931 రాయల్ కెల్నర్ కూపే. దీని వెల 87 లక్షల డాలర్లు.

హెవీయెస్ట్ లీమోజైన్

హెవీయెస్ట్ లీమోజైన్

ఇది ప్రపంచంలో కెల్లా అత్యంత బరువైన లీమోజైన్. దీని మొత్తం బరువు 23 టన్నులు. ఇందులో 40 మంది ప్యాసింజర్లు కూర్చోవచ్చు. ఇందులో మూడు లాంజ్‌లు, ఓ ప్రత్యేక బార్ ఉంటాయి.

మొట్టమొదటి కార్ రేడియో

మొట్టమొదటి కార్ రేడియో

మొట్టమొదటి కార్ రేడియోని 1929లో పౌల్ గవిన్ కనుగొన్నారు.

కారులో సూర్యూడి దగ్గరికి..

కారులో సూర్యూడి దగ్గరికి..

ఒకవేళ భూమి నుంచి సూర్యుడికి కారులో ప్రయాణించగలితే, అందుకు పట్టే సమయం 150 ఏళ్లు.

కారును వాష్ చేయరు..

కారును వాష్ చేయరు..

సగటున 53 శాతం మంది నెలలో ఒక్కసారి మాత్రమే తమ కారును వాష్ చేసుకుంటే, 16 శాతం మంది అస్సలు తమ కార్లనే వాష్ చేయరు.

ఎర్ర కార్లు నిషేధం..

ఎర్ర కార్లు నిషేధం..

చైనాలో షాంగై‌లో ఎరుపు రంగు కార్లకు అనుమతి లేదట.

వేటగాళ్ల కన్నా డ్రైవర్లే ఎక్కువగా..

వేటగాళ్ల కన్నా డ్రైవర్లే ఎక్కువగా..

డీర్ (అడివి దుప్పి)లను వేటగాళ్ల కన్నా డ్రైవర్లే ఎక్కువగా చంపేస్తుంటారట (వారి ఫాస్ట్ డ్రైవింగ్ కారణంగా).

రోజు 14 కార్లు మాత్రమే

రోజు 14 కార్లు మాత్రమే

ఫెరారీ సగటు రోజుకు దాదాపు 14 కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

మొట్టమొదటి కార్ రేస్

మొట్టమొదటి కార్ రేస్

మొట్టమొదటి ఆటోమొబైల్ రేస్ 1895వ సంవత్సరంలో అమెరికాలోని చికాగాలో జరిగింది. ఇందులో ఫ్రాంక్ డుర్యియీ సగటున 71.5 మైళ్ల వేగంతో నడిపి విజేతగా నిలిచారు.

Most Read Articles

English summary
In this post we have put together some fun facts related to automobiles in general. Click through the slides and see how many of them you did or did not know.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X