నార్త్ కొరియాను బయపెడుతున్న అమెరికన్ బోయింగ్ బి-52 బాంబర్: ఆసక్తికరమైన విశయాలు

By Anil

ఉత్తర కొరియా దేశం తమ దేశ భద్రత కోసం ఈ మధ్యనే ఒక హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించారు. భారీ విపత్తులను సృష్టించే ఈ బాంజును ప్రయోగించిన అనంతంర దీనికి అద్యం శత్రు దేశంగా ఉన్న దక్షిణ కొరియాకు భయం పట్టుకుంది. అయితే భారీ స్థాయిలో ప్రమాదానికి కారణం అయ్యే హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించిన నేపథ్యంలో అమెరికా ఇప్పుడు ఈ కొరియా చర్యల మీద దృష్టి సారించింది.

అమెరికా తమ దేశ రక్షణతో పాటు ప్రపంచ దేశాలు చేస్తున్న రక్షణ ప్రయోగాల మీద ఎప్పటికి ఓ కన్నేసి ఉంటుంది. అందులో భాగంగా ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబులు మీద చేస్తున్న ప్రయోగాలను పరిశీలించేందుకు అత్యంత శక్తివంతమైన బోయింగ్ వి-52 బాంబర్ విమానాన్ని దక్షిణ కొరియా మీద చక్కర్లు కొట్టించింది. ఇది తెలుసుకున్న దక్షిణ కొరియా అమెరికా చర్యల మీద తీవ్రంగా మండిపడింది.

దక్షిణ కొరియా ఈ బోయింగ్ బి-52 బాంబర్ విమానాన్ని చూసి ఎందుకు బయపడుతోంది మరిన్ని వివరాలు క్రింది కథనంలో.

1. అమెరికా యుద్ద అస్త్రం

1. అమెరికా యుద్ద అస్త్రం

అమెరికా యుద్ద సైన్యంలో అత్యంత ముక్యమైనది బి-52. ఇతర దేశాలను భయబ్రాంతులను చేయడానికి, మరియు అమెరికా యుద్ద సైన్యం యొక్క బలాన్ని తెలియజేయడంలో అమెరికా ఈ బోయింగ్ బి-52 బాంబర్ ప్లేన్‌ను వినియోగిస్తుంది.

 2. దీనినే ఎందుకు ?

2. దీనినే ఎందుకు ?

యుద్దంలో ఉన్నప్పుడు సైన్యానికి ఎక్కువగా సహాయపడేది కూడా ఇదే. సైన్యంలో ఉన్న అన్ని యుద్ద విమానాలలో కెల్లా ఇది అత్యంత శక్తివంతమైనది. ఈ బి-52 విమానానికి ఒకసారి ఇంధనం నింపితే నిరతరాయంగా 19,300 కిలో మీటర్లు దూరం ప్రయాణిస్తుంది.

3.నిర్మూలన

3.నిర్మూలన

ఈ బోయింగ్ బి-52 యుద్ద విమానం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, బాంబులు, మిస్సైల్స్ తో సమానం. ఎందుకంటే ఇందులో ఉన్న విశాలమైన స్థలంలో అనేక బాంబులను మోసుకెళ్లగలదు. భారీ స్థాయిలో బాంబుల వర్షాన్ని కూడా కురిపించగలదు.

4. మొదట వినియోగం

4. మొదట వినియోగం

ఈ బోయింగ్ బి-52 యుద్ద విమానాన్ని 1952 లో అమెరికాలో పరిచయం అయ్యింది. తరువాత 1955 నుండి అమెరికా దీనిని వినియోగించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం అమెరికా వద్ద ఈ బోయింగ్ బి-52 విమానాలు దాదాపుగా 744 వరకు ఉన్నట్లు సమాచారం.

5. అత్యధిక వేగం

5. అత్యధిక వేగం

శత్రువుల గుండెల్లో గుబులుపుట్టించడంలో ఇది ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇందులో భారీ స్థాయిలో భద్రత ఫీచర్లు ఉన్నాయి. ఇది గంటకు 1,000 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అయితే ఇతర ఎయిర్ క్రాఫ్ట్‌లతో పోల్చనపుడు ఇది కాస్త నెమ్మదిగానే ఉంటుంది.

 6. దీని ప్రాముఖ్యత

6. దీని ప్రాముఖ్యత

ఈ బోయింగ్ బి-52 విమానం అత్యంత బరువైన మిస్సైల్స్‌ను మరుయు బాంబులను భారీ ఎత్తు వరకు తీసుకెళ్లగలదు. ఇది దాదాపుగా 31,500 కిలోల బరువును నిరాటకంగా తీసుకెళ్లగలదు. ఇదే దీని ప్రాముఖ్యత.

 7. కొలతలు

7. కొలతలు

ఈ యుద్ద విమానం పొడవు 159 అడుగులు, వెడల్పు 185 అడుగులు, ఎత్తు 40.8 అడుగులు ఉంది. మరియు దీని బరువు దాదాపుగా 2.20 మిలియన్ కేజీలు కలదు.

 8. శాశ్విత విశ్రాంతి

8. శాశ్విత విశ్రాంతి

1952 లో పరిచయం అయి అప్పుటి నుండి ఇప్పటి వరకు సేవలు అందిస్తున్న ఈ బోయింగ్ బి-52 విమానం 2040 లో పూర్తిగా విధుల నుండి విశ్రాంతి తీసుకోనుంది.

9. ఎన్నో యుద్ద విమానాలు

9. ఎన్నో యుద్ద విమానాలు

యుద్దాలలో బాంబుల దాడిని జరపడం మాత్రమే ముఖ్యం కాదు. సైన్యానికి కావాల్సిన ఎన్నో అవసరాలకు ఇది ఉపయోగపడుంది. అచ్చం ఇలాంటివే వియత్నాంలో జరిగిన యుద్దంలో ఎమ్‌ఐజి-21 ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయగించారు. అయితే ఇవి బోయింగ్ బి-52 బాంబర్ విమానాలకు పోటిగా నిలవలేకపోయాయి.

10. ఉద్యోగులు

10. ఉద్యోగులు

ఈ బోయింగ్ బి-52 యుద్ద విమానాన్ని ఆపరేట్ చేయడానికి కమాండర్, పైలట్, రాడార్ ఆపరేటర్ మరియు ఇతర సేవల కోసం ఐదు మంది ఉంటారు. మరియు ఇందులో చాలా చోట్ల అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేశారు.

 11. ఏవియానిక్స్ టెక్నాలజీ

11. ఏవియానిక్స్ టెక్నాలజీ

అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఉపయోగించిన ఐబిఎమ్ ఎపి-101 అనే కంప్యూటర్‌ను ఈ బోయింగ్ బి-52 లో ఉపయోగించారు. అయితే ఈ పరిజ్ఞానం నాసా మొదటిసారిగా వినియోగించింది.

12. సముద్రంలో గస్తీ

12. సముద్రంలో గస్తీ

రెండు బి-52 విమానాల ద్వారా దాదాపుగా 3.64 లక్షల చదరపు కిలో మీటర్లు సముద్ర భాగాన్ని గస్తీ నిర్వహించ వచ్చు. దీని కోసం ఇందులో ప్రత్యేకంగా రాడార్ వ్యవస్థను ఉపయోగించారు.

13. ఇంజన్

13. ఇంజన్

ఇందులో ప్రాట్ అండ్ వైట్నీ వారి జెఇ57 రకం ఇంజన్ లను వినియోగించారు ఇవి దాదాపుగా 17,000 యంత్రపు శక్తి (థ్రస్ట్) విడుదల చేస్తుంది

14. ధర

14. ధర

ఈ బోయింగ్ బి-52 ధర దాదాపుగా 84 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంటుంది.

 15. ప్రత్యేక వ్యూహం

15. ప్రత్యేక వ్యూహం

యుద్ద భూమిలో శత్రువులు దీనిని నాశనం చేయడానికి ప్రయత్నించి దీని మీదకు దాడి చేసినప్పటికి ఇది సమర్థవంతంగా అక్కడ ఉన్న ఆయుధాలను గుర్తించి వాటిని క్షణాల్లో నాశనం చేస్తుంది.

 16. ఉత్తర కొరియా ఎందుకు భయపడుతోంది

16. ఉత్తర కొరియా ఎందుకు భయపడుతోంది

ప్రస్తుతం ఉత్తర కొరియా భారీ స్థాయిలో ఆయుధాలను నిల్వ ఉంచుకోంది. అయితే కొరియా భూ భాగంలో అమెరికా యుద్ద విమానం బోయింగ్ బి-52 బాంబర్ విమానం గస్తీ అనంతరం కొరియాలో ఉన్న ఆయుధ సామాగ్రిని ఇది అంచనా వేసి ఎక్కడ నిల్వలను నాశనం చేస్తోంది అని ఉత్తర కొరియా ఊహించింది.

ఆసక్తికరమైన విషయాలు...
  • విమాన ప్రమాదంలో విమానం నుండి ప్రయాణికులను వేరు చేసే టెక్నాలజీ
  • శక్తివంతమైన సైనికబలాన్ని కలిగిన దేశాలు: ఇందులో భారత్ ఉందా..

Most Read Articles

English summary
Some Interesting Things About Boeing B 52 Bomber
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X