విమానంలోని ఈ పది రహస్యాలు మీకు ఖచ్చితంగా తెలియదు!!

మనం చేస్తున్న సురక్షితమైన, సుఖమయైన విమానం ప్రయాణం వెనుక మనకు తెలియని షాకయ్యే రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి...

By Anil

విమానయాన ప్రపంచంలో ఆధునికత రోజుకొక పుంతలు తొక్కడం వలన, విమాన ప్రయాణంలో ఎదుర్కొనే ఇబ్బందులు దాదాపు తగ్గిపోయాయి. అయితే మనం చేస్తున్న సురక్షితమైన, సుఖమయైన ప్రయాణం వెనుక మనకు తెలియని అనేక రహస్యాలు ఉన్నాయి. వాటి గురించి చూశారంటే నిజమేనా అని షాక్ అవ్వక మానరు.

ఇవాళ్టి కథనం ద్వారా విమానంలో మనకు తెలియని రహస్యాలేంటో చూద్దాం రండి....

10. విమానాలు వెళ్లిన మార్గంలో తెల్లటి గీతలు ఎందుకు ఏర్పడతా

10. విమానాలు వెళ్లిన మార్గంలో తెల్లటి గీతలు ఎందుకు ఏర్పడతా

కొన్ని సార్లు విమానాలు ఆకాశంలో వెళ్లిన మార్గాన్ని పరిశీలించినట్లయితే అక్కడ తెల్లటి గీతలు ఏర్పడతాయి కదా..? నిజానికి విమానం యొక్క ఇంజన్‌ల పనితీరు పరిశీలనలో భాగంగా నడిపినపుడు ఇలాంటి గీతలు ఏర్పడతాయి. సాంకేతిక కారణం - విమానం ఇంజన్‌లో ఇంధనం మండిన తరువాత నీటి ఆవిరి పొగతోపాటు బయటకు వస్తుంది. సాధారణంగా విమానాలు తిరిగే ప్రదేశంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి వాతావరణంలో వేడి గాలి ఉంటే ఇలా తెల్లగా కనబడుతుంది. ఉదా- చలికాలంలో ముక్కు నుండి గాలిని బయటకు వదిలినపుడు మనం దీనిని గుర్తించవచ్చు.

09. ఆక్సిజన్ మాస్కుల గురించి

09. ఆక్సిజన్ మాస్కుల గురించి

విమానంలో ఉండే ఉద్యోగులు (ఎయిర్ హోస్టెస్) ఆక్సిజన్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో వివరిస్తుంటారు. కాని అవి గరిష్టంగా ఎంత సమయం పాటు ఆక్సిజన్ అందిస్తాయనే విశయాన్ని వివరించరు. నిజానికి విమానంలో ఉండే ఆక్సిజన్ మాస్కులు 15 నిమిషాలకు ఎక్కువ ఆక్సిజన్ అందివ్వలేవు. వీటి అవసరం సాధారిణంగా ఎప్పుడు ఉంటుందంటే. విమానంలోని పీడనం పూర్తి తగ్గిపోయినపుడు మరియు ప్రయాణంలో ఉన్న విమానం ఎత్తు సడెన్‌గా తగ్గిపోయినప్పుడు.

08. విమానం కిటికీ అద్దం మీద ఉన్న చిన్న రంధ్రం ఏమిటి

08. విమానం కిటికీ అద్దం మీద ఉన్న చిన్న రంధ్రం ఏమిటి

నిజమే కదా... విమానంలో ఉన్న కిటికీల మీద ఉన్న అద్దాలకు చిన్న రంధ్రం ఉంటుంది. ఎందుకంటే ఇది విమానం యొక్క క్యాబిన్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది.

07. విమాన టాయిలెట్లలో యాష్ ట్రే లు ఎందుకు ఉంచుతారు

07. విమాన టాయిలెట్లలో యాష్ ట్రే లు ఎందుకు ఉంచుతారు

మనుషులుకు ఓ గుణం ఉంది. చేయద్దు అంటే చేస్తారు, అచ్చం ఇలాంటిదే విమానంలో కూడా. సిగరెట్లు కాల్చకండి అని పోస్టర్లు అంటించిన చోటే సిరెట్ కాల్చడానికి ప్రయత్నిస్తారు. అయితే టాయిలెట్లో ఎవరూ ఉండరనే ఉద్దేశ్యంతో స్మోక్ చేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి తోడు యాష్ ట్రే కూడా ఏర్పాటు చేయడం ద్వారా తాగచ్చేమో అనే ట్రై చేస్తారు. అలా చేసారా అంతే సంగతులు. మీరు సిగరెట్ కాల్చి అందులో పడేసినట్లు సిబ్బందికి తెలిసిపోతుంది. ఆ తరువాత యథావిధిగా జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

06. విమానం ఎగరడాని రెండు ఇంజన్‌లు అక్కర్లేదు

06. విమానం ఎగరడాని రెండు ఇంజన్‌లు అక్కర్లేదు

ప్రతి విమానంలో కూడా రెండు ఇంజన్‌లు ఉంటాయి. మరికొన్ని లాంగ్ రేంజ్ విమానాలలో రెండు కన్నా ఎక్కువ ఇంజన్‌లు కూడా ఉంటాయి. అయితే విమానం ఎగరడానికి అన్ని ఇంజన్‌లు అక్కర్లేదు. కేవలం ఒక్క ఇంజన్‌తో కూడా విమానం ఎగురుతుంది. ఇలా చేయడం ద్వారా ఇంధన ఆదా అవుతుంది.

5. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు - ఎందుకు ?

5. ప్లేన్ ల్యాండ్ అయ్యేటప్పుడు లైట్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు - ఎందుకు ?

రాత్రివేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు క్యాబిన్‍‌లోని లైట్లను ఆఫ్ మరియు ఆన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ల్యాండింగ్ సమయంలో ఏదయినా ప్రమాదం జరిగితే పారిపోవడానికి మెలుకువలోకి వస్తారని ఇలా చేస్తారు. పగటి పూట ఎలాగో మేల్కొని ఉంటారు కాబట్టి ఇలా చేయాల్సిన అవసరం ఉండదు.

04. ప్రమాదానికి గురికాకుండా విమాన టైర్ల డిజైన్ ఉంటుంది

04. ప్రమాదానికి గురికాకుండా విమాన టైర్ల డిజైన్ ఉంటుంది

విమానం ఎక్కువ వేగం వద్ద ల్యాండ్ మరియు విమానం బరువును మోయడానికి టైర్లు తట్టుకోగలవా అని చాలా మందికి అనుమానం ఉంటుంది. నిజానికి ల్యాండింగ్ సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ప్రేళుడుకు గురికాని విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ టైర్లు గరిష్టంగా 38 టన్నుల బరువును మోయగలవు మరియు గంటకు 170 మైళ్ల వేగం వద్ద కూడా సురక్షితంగా ల్యాండ్ అవుతాయి. కాబట్టి ల్యాండింగ్‌లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరలం లేదు.

03. కొన్ని విమానాలలో రహస్య బెడ్ రూమ్ లు ఉంటాయా....?

03. కొన్ని విమానాలలో రహస్య బెడ్ రూమ్ లు ఉంటాయా....?

నిజమే, కొన్ని విమానాలలో రహస్యం పడక గదులు ఉంటాయి. ప్రత్యేకించి అత్యంత దూరం ప్రయాణించే విమానాలలో ఇలాంటివి ఉంటాయి. అయితే ఇవి ప్రయాణికుల కోసం కాదండోయ్. విమాన సిబ్బంది కోసం ఒక్కోసారి విమానంలో రోజు 16 గంటలు పనిచేసే వారి కోసం ఇలాంటి సదుపాయాలను కల్పించడం జరిగింది. బోయింగ్ 777 మరియు 787 డ్రీమ్‌లైనర్ విమానాలలో ఈ సౌకర్యం ఉంటుంది.

02. విమానంలో సురక్షితమైన సీటు ఉంటుందా...?

02. విమానంలో సురక్షితమైన సీటు ఉంటుందా...?

బస్సుల్లో ఉన్నట్లు విమానంలో సురక్షితమైన సీటు అంటూ ఏమీ ఉండదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా విమానంలో సురక్షితమైన సీటు అంటూ ఏమీ ఉండదని ధృవీకరించింది. టైమ్ బృందం నిర్వహించిన సర్వే ప్రకారం, విమానంలోని మధ్య భాగంలో ఉన్న సీట్ల వద్ద ప్రమాద రేటు తక్కువగా ఉన్నట్లు తెలిసింది.

01. పిడుగులు పడితే విమానాలు పేలిపోతాయా

01. పిడుగులు పడితే విమానాలు పేలిపోతాయా

ఈ అనుమానం చాలా మందికే ఉంటుంది, నిజానికి ఏవియేషన్ చరిత్రలో 1963 నుండి ఇప్పటి వరకు ఈ కారణం వలన ఎలాంటి ప్రమదాం సంభవించలేదు. నిజానికి పిడుగులు చాలా వరకు విద్యుత్‌ను వెదజల్లుతాయి. అయితే ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం ద్వారా క్యాబిన్ ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా డిజైన్ చేయడం జరిగింది.

.

17.5 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే విమానం...

రైట్ సోదరులకన్నా ముందే విమానాన్ని కనుగొన్నది మన భారతీయుడే - ఆధారాలు!

ఒక్కసారిగా నుజ్జునుజ్జయిన 120 BMW కార్లు: వీడియో

మారుతి సుజుకి స్విఫ్ట్

ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ విడుదలతో సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. మెజారిటీ అమ్మకాలతో దూసుకుపోతున్న మారుతి ఇపుడు మార్కెట్‌ను పూర్తిగా తన వశం చేసుకునేందుకు విపణిలోకి 2017 స్విఫ్ట్ అప్‌గ్రేడెడ్ మోడల్‍‌‌కు శ్రీకారం చుట్టుంది. మీకు కూడా దీని మీద ఆసక్తి పెరుగుతోందా... అయితే క్రింది గ్యాలరీలోని ఫోటోలను తప్పకుండా చూడాల్సిందే...

Most Read Articles

English summary
Some Things You Probably Didnt Know About Airplanes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X