ఫేస్‌బుక్ వీడియో: సీట్ బెల్ట్ ధరించకపోతే జరిగే పరిణామాలు
By Ravi
ఈ వీడియో చూసిన తర్వాత మీలో కారు నడిపే ప్రతిఒక్కరూ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరిస్తారు. కారును 2 కిలోమీటర్ల దూరం నడిపినా లేదా 200 మైళ్ల దూరం నడిపినా సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. సీట్ బెల్టులు అన్ని సంధర్భాల్లో దానిని ధరించిన వారి ప్రాణాలను రక్షిస్తాయని చెప్పలేం, ఏ కాస్త అవకాశం దొరికినా వారిని ప్రాణాపాయం నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది.
చలనంలో ఉన్న కారులో మనం కూర్చున్నామంటే, కారుతో పాటుగా మనం కూడా వేగంగా వెళ్తున్నట్టే లెక్క. అలాంటప్పుడు, దురదృష్టవశాత్తు ఎదురుగా వచ్చే వాహనాన్ని ఢీకొనడం వల్లనో లేదా ఏ డివైడర్‌నో, కరెంటు స్తంభాన్నో ఢీకొనడం వల్లనో కారు ఉన్నట్టుండి ఆగిపోతుంది. కానీ కారుతో పాటుగా చలనంలో ఉన్న మన శరీరం మాత్రం ఆ వేగాన్ని నియంత్రించుకోలేదు.
ఇది కూడా చూడండి: 'ది సీట్ బెల్ట్ క్రూ' హిజ్రాల సందేశం!
ఎదురుగా వచ్చే/ఉన్న అడ్డంకిని తగిలి కారు ఆగినంత వేగంగా మన శరీరం ఆగలేదు కాబట్టి, అప్పటిదాకా ఆ కారు ప్రయాణిస్తున్న వేగంతోనే మన శరీరం కూడా ముందుకు తూలుతుంది. ఆ సమయంలో కారు ముందు సీటులో కూర్చున్న వారి ఛాతీ డాష్‌బోర్డునో లేక స్టీరింగ్ వీల్‌‌నో (డ్రైవర్) బలంగా ఢీకొంటుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే, ఛాతీ ఎముకలు విరగడం, విరిగిన ఎముకలు ఛాతీలోకి చొచ్చుకుపోయి ఊపిరితిత్తులను, గుండెను ఛిద్రం చేయడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చు.
ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో కూడా అదే విషయాన్ని గ్రాఫిక్స్ రూపంలో చూపించారు. ఈ వీడియో రియల్‌గా జరిగిన యాక్సిడెంట్ కాదు, మోటారిస్టులలో సీట్ బెల్ట్ పట్ల అవగాహన కల్పించేందుకు డిజైన్ చేయబడినది. బలహీనమైన హృదయం కలిగిన వారు దయచేసి ఈ వీడియోని చూడొద్దని మనవి. ఈ వీడియో చూసిన తర్వాతనైనా సీట్ బెల్ట్ పెట్టుకోవటం మర్చిపోకండి ప్లీజ్..!
Post by DriveSpark.
Most Read Articles
English summary
Story first published: Saturday, May 10, 2014, 17:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X