నీటి మీద నడిచే మోటార్ సైకిల్ తయారు చేసిన బీటెక్ స్టూడెంట్స్

Written By:

బీటెక్ స్టూడెంట్స్ తమ ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా నీటి మీద నడిచే మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసారు. ప్రయోగాత్మకంగా కూడా దీనిని నడిపి చూపించారు. మీరు కూడా బీటెక్ స్టూడెంట్స్ అయితే ఈ ప్రయోగం మీద ఓ లుక్కేసుకోండి.

విపిన్ బిఎ, రోని రాజన్, అనంతన్ ఆర్, ఉన్నిక్రిష్ణన్ కెవి, అను సరసన్ మరియు నౌఫల్ హుస్సేన్ అనే విద్యార్థుల బృందం చివరి సంవత్సరం ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఈ నీటి మీద నడిచే వెహికల్‌ను రూపొందించారు.

చూడటానికి చిన్న బోటు, దాని మీద మోటార్ సైకిల్ కనిపిస్తుంద కదూ... అయితే బైకును నడిపితే బోటు ముందుకు కదిలే విధంగా ఇందులో మెకానిజమ్ అభివృద్ది చేశారు. ఇది ఎలా నడుస్తుందో చూద్దాం రండి....

బోటులో ఇంజన్ చక్రం ద్వారా వచ్చే పవర్‌ బోటును ముందుకు నెట్టడానికి కావాల్సిని శక్తిగా మార్చే విధంగా మెకానిజాన్ని రూపొందించారు. ఇందులో ఏ తయారీదారునికి చెందిన బైకునైనా వినియోగించుకోవచ్చు.

బోటులో ఉన్న బైకు అనుసంధానాన్ని తప్పిస్తే, నేల మీద సాధారణ బైకు తరహాలో ఉపయోగించుకోవచ్చు. బైకు మైలేజ్ నేల మీదతో పోల్చితే నీటి మీద నడిచేటప్పుడు తక్కువగా ఉంటుంది.

నీటి మీద వెళ్లేటపుడు బోటు దిశను మార్చడానికి బైకు హ్యాండల్ ఉపయోగపడుతుంది. కాబట్టి నీటి మీద నడిచే మోటార్ సైకిల్ యొక్క దిశను నియంత్రించడానికి బైకు హ్యాండిల్ వినియోగించవచ్చని ఆరు మందితో కూడిన ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల బృందం తెలిపింది.

ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో ఇలాంటి ఉభయచర ద్విచక్ర వాహనాలు అందుబాటులో లేవు. విదేశీ మార్కెట్ల నుండి దిగుమతి చేసుకుంటే వాటి ధరలు లక్షల్లో ఉంటాయి. అయితే వీరు నిర్మించిన ప్రోటోటైప్ ఆంపిబియస్ బైకు ధర సుమారుగా రూ. 20,000 లుగా ఉన్నట్లు తెలిపారు.

బైకు నుండి బోటు ముందుకు కదలడానికి కావాల్సిన సాంకేతికత ఉన్న పరికరం కావాలన్నా లక్షల్లో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే వీరు రూపొందించిన పరికరం అత్యంత చౌకైనది.

ప్రస్తుతం ఈ ప్రోటోటైప్ ఆంపిబియస్ బైకు మీద పేటెంట్ హక్కులు పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పేటెంట్ హక్కులు పొందినతరువాత, సాంకేతికతను మరింత అభివృద్ది చేసి దేశీయ విపణిలోకి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రయోగాన్ని ఎంచుకోవడానికి ప్రధానం కారణం, చెన్నై వరదల్లో సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం చేత దీనిని అభివృద్ది చేసినట్లు చెప్పుకొచ్చారు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Tuesday, April 11, 2017, 15:28 [IST]
English summary
Read In Telugu to know about Students Develop Amphibian Motorcycle
Please Wait while comments are loading...

Latest Photos