గర్బిణీ స్త్రీలే ఎక్కువగా యాక్సిడెంట్స్ చేస్తుంటారు: స్టడీ

By Ravi

సాధారణంగా గర్భదారణ సమయంలో మహిళలు విమానాలలో వెళ్లటం, హాట్ టబ్బులలో స్నానం చేయటం, స్కూబా డైవింగ్ చేయటం మొదలైన విషయాల పట్ల భయపడుతుంటారు. కానీ, అసలైన మరియు అత్యంత రిస్కయిన డ్రైవింగ్ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోరు. ఫలితంగా వారు ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు.

ఇది కూడా చదవండి: డ్రైవింగ్ చేసే గర్బిణీ స్త్రీల కోసం ముఖ్యమైన చిట్కాలు

ఇటీవలి అధ్యయనాలను గమనిస్తే.. గర్భం దాల్చని సాధారణ మహిళలతో పోల్చుకుంటే, దాదాపు 42 మంది గర్బిణీలు తమ కార్లను యాక్సిడెంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గర్భం దాల్చిన మొదటి, రెండవ నెలల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో స్పష్టమైంది.


కెనడాలోని ఇనిస్టిట్యూట్ ఫర్ క్లినికల్ ఎవాల్యుయేట్ సైన్సెస్ (ఐసిఈఎస్) దాదాపు ఐదేళ్ల పాటుగా సుమారు ఐదు లక్షల మంది మహిళల విషయంలో నిర్వహించిన అధ్యయనంలోని ఫలితాలను వెల్లడి చేశారు. గర్బిణీ స్త్రీలు రెండవ మాసంలో అత్యత వైద్య చికిత్స కోసం వెళ్లే వారి సంఖ్య, ప్రతి 1000 మందికి 4.55 నుంచి 6.47కు పెరిగినట్లు వారు గుర్తించారు.

అయితే, ఇదే సమయంలో అదే వయస్సుకు చెందిన పురుషులు చేసే ప్రమాదాలతో పోల్చుకుంటే, స్త్రీలు చేసే ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతి 1000 మంది డ్రైవర్లకు గాను 8 మంది పురుష డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నట్లు ఇందులో తేలింది. గర్బిణీలు 5వ నెలలో ఉన్నప్పుడు ప్రమాద రేటు ప్రతి 1000 మందికి గాను 7.66గా ఉన్నట్లు వారి గుర్తించారు.

Most Read Articles

English summary
A recent study revealed that pregnant mothers are 42% more likely to crash their cars than women who aren’t pregnant. The risk is especially acute during the first and second month of pregnancy.
Story first published: Thursday, July 17, 2014, 12:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X