అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

By Anil

అతి విలాసవంతమైన సీట్లు, లగ్జరీ ఫీచర్లు, అదనపు సౌకర్యాలు ఇలాంటి విదేశాలలోనే చూసుంటారు కదా ? ఇక మీద మన దేశంలో కూడా ఇలాంటి రైళ్లు పరగులు పెట్టనున్నాయి. ప్రయాణాలు చేస్తున్నపుడు ప్రతి ఒక్కరు ఎదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియాలో భాగంగా ఈ లగ్జరీ రైళ్లు ప్రవేశపెట్టనున్నారు.
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత ఉత్కంఠ భరితమైన రైల్ రూట్స్

రంగు రంగుల సీట్లు మరియు అత్యాధునిక సౌకర్యాలను ఈ రైల్వే కోచ్‌లలో అందించారు. ఇప్పటికే ఒక రైలుకు ట్రయర్ రన్ నిర్వహించారు. 24 బోగిలు గల ఈ అత్యాదునిక రైలును భారతీయ రైల్వే పరీక్షించింది.
Also Read: ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు

భారతీయ రైల్వే ప్రయోగాత్మకంగా పరీక్షించిన ఈ లగ్జరీ రైలు గురించి మరింత సమాచారం క్రంది కథనాల ద్వారా తెలుసుకుందాం...

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

ఈ రైలును కేంద్ర ప్రభుత్వం ట్రయల్ రన్ కోసంప్రారంభించింది. దీనిని సిఆర్‍‍‌‌‌డబ్ల్యూయస్ ఆధ్వర్యంలో భోపాల్ మరియు బినా రైల్వే ష్టేషన్‌‌ల మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

24 బోగీలు గలల ఈ రైలు గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ వేగం వద్ద ఈ కొత్త రైలును పరీక్షించారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

ఈ అత్యాధునికి రైలును భోపాల్‌కు చెందిన కోచ్ రిహాబిలేషన్ వర్క్‌షాపు వారు డిజైన్ చేసి అభివృద్ది చేశారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

రైలు ప్రయాణం అనగానే కుదుపుల ప్రయాణం అందరూ అనుకుంటారు. కాని ఇందులో ప్రయాణించిన తరువాత ఆ మాట మరిచిపోతారు. ఎందుకంటే ఇందులో జర్క్-లెస్ సీట్లను

అందించారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

మామూలుగా మనం ఆకు పచ్చ మరియు ఎరుపు రంగులో సీట్లను చూసుంటా. ఇప్పుడు కేంద్ర రైల్వే మూడు విభిన్న రంగుల్లో సీట్లను కల్పించింది. ఎరుపు, ఆకు పచ్చ సీట్ల మధ్యలో వంగపువ్వు (పర్పుల్) రంగు గల సీట్లను కల్పించారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

లోపలి వైపున చూస్తే అతి విశాలమైన బెర్తులు మరియు ప్రతి బెర్తుకు ప్రత్యేకమైన మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌‌లకు ఛార్జింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

భోజనం చేయడానికి ప్రత్యేకమైన టేబుల్స్ మరియు పడుకున్నప్పుడు మనకు మాత్రమే వెలుతురు వచ్చే లైట్లను ఇందులో అందించారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

భారతీయ రైల్వే ఉన్న ప్రధాన సమస్య టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం ఇది దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఇబ్బందిగా మారింది. అందుకోసం ఇందులో అత్యాధునికమైన బయో టాయిలెట్లను కల్పించారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

భారతీయ రైల్వేలు ఇప్పుడు తరచుగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయి. అందుకోసం వీటిని నివారించడానికి ప్రస్తుతం ఈ కొత్త రైళ్లలో ఆ దిశగా మార్పులు చేశారు. ప్రతి భోగి క్రింద భాగంలో రెండు అగ్ని నిరోధకాలను ఏర్పాటు చేశారు. మరియు సీట్లుమ కూడా ఫైర్ ఫ్రూఫ్‌తో తయారు చేశారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

crws దాదాపుగా 111 కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించుకుంది. అందులో నాన్ ఎసి కోచ్‌లు 87, ఎసి 3 టైర్ కోచ్‌లు17, ఎసి 2 టైర్ కోచ్‌లు 5 లను అందించాలని నిర్ణయించుకుంది.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

ఈ తరహా ఫీచర్లతో ఎసి కోచ్ తయారు చేయడానికి 70 లక్షలు మరియు స్లీపర్ కోచ్ ను తయారు చేయడానికి 49 లక్షలు ఖర్చు అవుతుందని వారు తెలిపారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!

ట్రయల్ అనంతరం దీనికి సంభందించిన నివేదికలను భారతీయ రైల్వేకు అందిస్తామని వారు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేవంటే అతి త్వరలో వీటిని పట్టాల మీదకు తెస్తామని తెలుపారు.

అదనపు సౌకర్యాలు, మరింత విలాసవంతమైన కొత్త రైళ్లు! త్వరలో భారతీయ రైల్వేలోకి...!!
  1. అమ్మాయిల కోసం కొన్ని పింక్ కలర్ కార్స్ - ఫొటోలు
  2. ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ బైక్/మోటార్‌సైకిల్ ఫొటోలు
  3. ఫన్నీ కార్ మోడిఫికేషన్స్ - పార్ట్ 3

Most Read Articles

English summary
Stunning Interiors New Train Coaches
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X