వేసవి తాపాన్ని తట్టుకునేందుకు 10 కూల్ కార్ యాక్ససరీస్

వేసవి మొదలైంది.. భానుడు తన ప్రకోపాన్నంతా ప్రజలపై చూపిస్తున్నాడు.. ఈ వేసవిలో బయటకు వెళ్లాలంటే ఎక్కడ వడ దెబ్బ తగులుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డుపై నడిచి వెళ్లే వారు కాదు, ఏసి కార్లలో వెళ్లే వారికి సైతం ఎండ ప్రభావం పడుతోంది.

ఇది కూడా చదవండి: ఘాట్ రోడ్లపై సురక్షితంగా డ్రైవ్ చేయటం ఏలా

మరి ఈ హాట్ హాట్ సమ్మర్‌లో మీ కారు ప్రయాణం కూల్ కూల్‌గా సాగిపోవాలంటే ఈ కార్ యాక్ససరీస్ తప్పనిసరిగా మీతో ఉండాలి. ఈ యాక్ససరీలు మీకు ఉపకరించడమే కాకుండా, ఎండ వేడి వలన మీ కారు పాడవకుండా కూడా ఉంచేందుకు సహకరిస్తాయి. మరి ఆ కూల్ యాక్ససరీస్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

1. సన్‌గ్లాసెస్ హోల్డర్ (Sunglasses holder)

1. సన్‌గ్లాసెస్ హోల్డర్ (Sunglasses holder)

వేసవి తాపం ముందుగా మన కళ్లను రక్షించుకోవటం ఎంతో అవసరం. అందుకే వేసవిలో ఎక్కువ మంది కూలింగ్ గ్లాస్ (చలువ కళ్లద్దా)లను ఉపయోగిస్తుంటారు. అందులోనూ చాలా మంది ఖరీదైన కూలింగ్ గ్లాస్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, కారులో కూలింగ్ గ్లాస్‌లను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే గీతల పాడవకుండా ఉండేందుకు ఈ సన్‌గ్లాసెస్ హోల్డర్ ఉపకరిస్తుంది.

ఇది ఇరువైపులా క్లిప్‌లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓవైపు క్లిప్‌ను కారులోని డ్రైవర్ సన్‌విజర్‌కు క్లిప్ చేసుకోవాలి. అవసరం లేనప్పుడు కళ్లజోళ్లను తీసి ఈ హోల్డర్‌కు రెండోవైపు ఉన్న క్లిప్‌లో అమర్చుకోవాలి. ఇది సన్‌గ్లాస్‌లను ధృఢంగా పట్టి ఉంచుంది. ఈ సన్‌గ్లాసెస్ హోల్డర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఈబే నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.350.

2. ఏసి కప్ హోల్డర్ (AC cupholder)

2. ఏసి కప్ హోల్డర్ (AC cupholder)

వేసవిలో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాంటప్పుడు ఏదైనా చల్లటి పానీయం గొంతులోకి వెళ్తుంటే, ఆ హాయిని మాటల్లో వర్ణించలేము. అందుకే కారులో ఇలాంటి అదనపు ఏసి కప్‌హోల్డర్లను ఉపయోగించుకొని అందులో పానీయాలను ఉంచుకుంటే, అవి ఏసి ప్రభావానికి చల్లగా ఉండి, అవసరమైనప్పు దాహాన్ని తీర్చుతాయి. ఈ కప్‌హోల్టర్‌ను అవసరమైనప్పుడు ఏసి వెంట్లలో అమర్చుకోవచ్చు, అవసరం లేదనుకున్నప్పుడు తొలగించుకోవచ్చు. దీని ధర సుమారు రూ.200.

3. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (Auto climate control)

3. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ (Auto climate control)

సాధారణంగా హై-ఎండ్ కార్లలో మాత్రమే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ బయటి వాతవరణాన్ని కారు లోపల చల్లదనాన్ని ఆటోమేటిక్‌గా పెంచడం తగ్గించడం చేస్తుంది. బడ్జెట్ కార్లలో ఇలాంటి మోడ్రన్ ఫీచర్ ఉండదు. కానీ క్రిష్‌టెక్ అనే కంపెనీ ఈ సిస్టమ్‌ను సాధారణ కార్లలో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని ఈబే నుంచి కొనుగోలు చేయవచ్చు. ధర సుమారు రూ.4,000.

4. ఎయిర్ ఫ్రెషనర్ (Air freshener)

4. ఎయిర్ ఫ్రెషనర్ (Air freshener)

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కారు లోపల గాలి వేడెక్కి కొన్నిసార్లు కారులో దుర్ఘందం వస్తుంటుంది. కాబట్టి, కారులో మంచి ఎయిర్ ఫ్రెషనర్ ఉంటే, కారులో మంచి సువాసన వస్తుంది. కొన్ని సువాసనలు మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి.

5. డ్యాష్‌బోర్డ్ కవర్ (Dashboard cover)

5. డ్యాష్‌బోర్డ్ కవర్ (Dashboard cover)

కారును ఎక్కువ సేపు ఎండలో ఉంచినా లేక ఇండోర్ పార్కింగ్ సౌకర్యం లేనప్పుడు ఎండలో పార్క్ చేయాల్సి వచ్చినా, ఎండ వలన కారు డ్యాష్‌బోర్డ్ లైఫ్ తగ్గిపోయి, కలర్ షేడ్ అవటం లేదా కొంత కాలానికి ఆ ప్లాస్టిక్ తన ధృడత్వాన్ని కోల్పోయి పగుల్లు రావటం వంటివి జరుగుతుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే, కారు డ్యాష్‌‌బోర్డ్ కవర్‌ను ఉపయోగించాలి. ఇది ఉష్ణాన్ని గ్రహించి ఎండ నుంచి డ్యాష్‌బోర్డ్‌ను రక్షిస్తుంది.

6. సన్ షేడ్స్ (Sun shades)

6. సన్ షేడ్స్ (Sun shades)

కార్ల అద్దాలకు ఉపయోగించే సన్‌ఫిల్ములపై నిషేధం విధించిన తర్వాత అన్ని కార్లలో వీటిని తొలగిస్తున్న సంగతి తెలిసినదే. సన్‌ఫిల్ములు లేకపోవటం వలన ఎండలో డ్రైవ్ చేస్తున్నప్పుడు సూర్యకిరణాలు నేరుగా కారులోకి ప్రవేశించడం, ఫలితంగా ఏసి ఎఫెక్ట్ ఉండకపోవటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి సక్షన్ టైప్ (అద్దాలకు అతికించేందుకు/తొలిగించేందుకు వీలుగా ఉండే) సన్ షేడ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. (కానీ సిటీల్లో వీటిపై కూడా నిషేధం ఉంది).

7. కూలర్ (Cooler)

7. కూలర్ (Cooler)

కూలర్ లేదా కార్ ఫ్రిడ్జ్‌లు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కారులో ఉండే మొబైల్ చార్జింగ్ పోర్ట్ సాయంతో, తక్కువ విద్యుత్తును వినియోగించుకొని ఇవి పనిచేస్తాయి. ఇవి దాదాపు 8 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటాయి. ఇందులో కోక్ టిన్నులు, చిన్న వాటర్ బాటిళ్లు, చాక్లెట్లు వంటి వాటిని చల్లగా ఉంచుకోవచ్చు. దీని ధర సుమారు రూ.4500 ఉంటుంది.

8. కార్ కవర్ (Car cover)

8. కార్ కవర్ (Car cover)

మంచి బ్రాండెడ్ కార్ కవర్లు మీ కారుపై దుమ్ము ధూళి పడకుండా శుభ్రంగా ఉంచేందుకే కాకుండా, సోలార్ రేడియేషన్ నుంచి కూడా మీ కారును కాపాడుతాయి. వేసవిలో కార్లను ఇంటి బయట పార్క్ చేసుకునే వారు తప్పనిసరిగా కార్ కవర్‌ను ఉపయోగించటం చాలా మంచిది.

9. సన్ స్క్రీన్స్ (Sun screens)

9. సన్ స్క్రీన్స్ (Sun screens)

సన్ షేడ్స్ మాదిరిగానే సన్ స్క్రీన్స్ కూడా వేసవిలో చక్కగా ఉపయోగపడుతాయి. బయటి ఎండ లోపలికి రాకుండా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. అయితే, వీటిని సక్షన్ టైప్ సన్ షేడ్స్ మాదిరి ప్రతిసారి అద్దానికి అంటించడం, తొలగించడం చేయాల్సిన పనిలేదు. వీటిని కారు అద్దానికి పై భాగంలో ఫిక్స్ చేసి, క్రింద లాగి ట్యాగ్‌తో లాక్ చేస్తే సరిపోతుంది. అవసరం లేదనుకున్నప్పుడు ట్యాగ్ వదిలేస్తే ఇవి ఆటోమేటిక్‌గా పైకి మడుచుకుంటాయి. సక్షన్ టైప్ సన్ షేడ్స్ కన్నా ఈ సన్ స్క్రీన్స్‌ను ఆపరేట్ చేయటం సులువు. అయితే ఇవి కొంచెం ఎక్కువ ఖరీదును కలిగి ఉంటాయి.

10. సీట్ కవర్స్ (Seat covers)

10. సీట్ కవర్స్ (Seat covers)

వేసవి సీట్ కవర్స్ చాలా ముఖ్యం. ప్రత్యేకించి మీ కారులో లెథర్ సీట్స్ ఉంటే వాటిని కాటన్ సీట్ వర్లతో (లేదా టర్కి టవళ్లతో) కవర్ చేసుకోవటం మంచిది. వేసవిలో లెథర్ సీట్లు తొందరగా వేడెక్కుతాయి, అంతేకాదు ఇవి ఎండ వేడికి కలర్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి విలువైన లెథర్ సీట్లను కాపాడు కోవాలంటే వాటిని సీట్ కవర్లతో కప్పటం మంచిది.

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు 10 కూల్ కార్ యాక్ససరీస్

హాట్ సీజన్‌లో మిమ్మల్ని మరియు ఈ కారును కూల్‌గా ఉంచేందుకు ఈ సమ్మర్ కూల్ యాక్ససరీస్ ఉపయోగపడుతాయని ఆశిస్తున్నాము. ఈ చిట్కాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే, మీ మిత్రులతో దీనిని షేర్ చేయగలరు.

Most Read Articles

English summary
Some countries celebrate the advent of summer by spending as much time as possible outdoors, going to the beach, enjoying picnics, and so on. However, in India things are a little different. Our summers outstay their welcome with a mission to make everyone's lives unbearable. No mild and enjoyable days here, that's for sure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X