విలియమ్స్ జట్టులో చేరిన తొలి మహిళా ఎఫ్1 డ్రైవర్ 'సూసీ వోల్ఫ్'

By Ravi

అత్యంత ప్రమాదకరమైన మరియు సాహసోపేతమైన ఫార్ములా వన్ రేస్ కేవలం పురుషుల కోసమేనా..? ఇందులో మేము రాణించలేమా..? మాకేంత తక్కువ..? పురుషులతో ఏ మాత్రం తీసిపోకుండా, వారితో సమానంగా రేస్ చూపిస్తానంటోంది ఈ ఆర్గిల్ అమ్మడు. ఆర్గిల్‌లోని ఒబన్‌కు చెందిన సూసీ వోల్ఫ్ ఫార్ములా వన్ (ఎఫ్1) రంగంలో ఉన్న తొలి మరియు ఏకైక మహిళా రేస్ డ్రైవర్.

హాట్ అమెరికన్ ర్యాలీ డ్రైవర్ 'డానికా పాట్రిక్' గురించి తెలుసా..?

ఇప్పటి వరకు 'విలియమ్స్ ఎఫ్1' జట్టుకు డెవలప్‌మెంటల్ డ్రైవర్‌గా వ్యవహరిస్తున్న సూసీ వోల్ఫ్ ఇప్పుడు అదే జట్టులో అఫీషియల్ రేస్ డ్రైవర్‌గా చేరనున్నారు. రెండు దశాబ్ధాల చరిత్రలో అఫీషియల్ గ్రాండ్ ప్రి సెషన్‌లో పాల్గొనబోతున్న మొట్టమొదటి మహిళా డ్రైవర్‌గా సూసీ వోల్ఫ్ మరో అరుదైన కీర్తిని దక్కించుకోనున్నారు. గడచిన సంవత్సరం సిల్వర్‌స్టోన్‌లో నిర్వహించిన యంగ్ డ్రైవర్స్ టెస్ట్‌లో ఈమె బెస్ట్ ఫెర్ఫార్మర్‌గా నిలిచారు.

ది ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ 'సూసీ వోల్ఫ్‌'కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం రండి..!

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

ఆర్గిల్‌లోని ఒబన్‌కు చెందిన సూసీ (31 ఏళ్లు) తొలి మహిళా రేసింగ్ డ్రైవర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాధించుకుంది. అంతేకాకుండా, ఈమె 'ది ఫాస్టెస్ట్ ఉమెన్ ఇన్ ది వరల్డ్' అనే చిత్రంలో కూడా నటించనుంది.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

ఫార్ములా వన్ రేసింగ్‌లో రాణిస్తున్న ఏకైక మహిళ ఎఫ్1 టెస్ట్ డ్రైవర్ 'సూసీ వోల్ఫ్'. ఎఫ్1 రంగంలో ఏకైక మహిళ అయిన సూసీ వోల్ఫ్, తన జీవితం గురించి బిబిసి రూపొందించిన ఓ డాక్యుమెంటరీలో కూడా ఈమె కనిపించనున్నారు.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ ఫార్ములా వన్ రేసింగ్ తాము కూడా తమ సత్తా ఏంటో చూపించగలమంటోంది ఈ అందాల అమ్మడు. సూసీ నటించినున్న ఈ చిత్రంలో లెవిస్ హామిల్టన్, రేసింగ్ దిగ్గజం డేవిడ్ కౌల్ట్‌హార్డ్‌లు కనిపించనున్నారు.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

ఈ చిత్రానికి బిఏఎఫ్‌టిఏ అవార్డుకు నామినేట్ అయిన ఆమె అన్న డేవిడ్ స్టోడ్డార్ట్ (31 ఏళ్లు) దర్శకత్వం వహించనున్నారు. 'విలియం ఎఫ్1' జట్టుకు డెవలప్‌మెంటల్ డ్రైవర్ అయిన సూసీ తన ఎనిమిదవ ఏటనే గో-కార్టింగ్‌ను ప్రారంభించింది.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

ఆస్ట్రియన్ రేసింగ్ డ్రైవర్ టోటో వోల్ఫ్‌ను వివాహమాడిన సూసీ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంది.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

జులై 2012లో జరిగిన టెస్టింగ్ క్రాష్‌లో కుడి కన్ను దృష్టిని కోల్పోయిన స్పనియార్డ్ మరియా డి విల్లోటా తర్వాత ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఏకైక మహిళా డ్రైవర్ సూసీనే.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

సూసీ వోల్ఫ్ విలియమ్స్ జట్టులో చేరక మునుపు ఆమె జర్మనీలోని డిటిఎమ్ సిరీస్‌లలో పాల్గొంది. వరుసగా 7 సీజన్లలో ఆమె పాల్గొంది. ఈమె బిఆర్‌డిసి యంగ్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు రెండు సార్లు నామినేట్ కూడా అయ్యింది.

విలియమ్స్ జట్టులో చేరినసూసీ వోల్ఫ్

వోల్ఫో 2012, ఏప్రిల్‌లో విలియమ్స్‌తో భాగస్వామ్యమైంది. ప్రస్తుత ఎఫ్‌డబ్ల్యూ36 అలాగే ఇదివరకటి ఎఫ్‌డబ్ల్యూ35, ఎఫ్‌డబ్ల్యూ 34 ఎఫ్1 కార్ల యొక్క అభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించింది.

డానికా పాట్రిక్

డానికా పాట్రిక్

స్విమ్‌సూట్ క్యాలెండర్ గర్ల్ కమ్ హాట్ అమెరికన్ ర్యాలీ కార్ రేసింగ్ డ్రైవర్ 'డానికా పాట్రిక్'

ఇన్నెసా తుష్కనోవా

ఇన్నెసా తుష్కనోవా

ర్యాలీ కార్ డ్రైవర్ కమ్ సూపర్‌మోడల్ - ఇన్నెసా తుష్కనోవా

Most Read Articles

English summary
Susie Wolff will join Williams' F1 team. She will be the first female driver in 20 years to participate in an official Grand Prix session. She will participate in two friday practices for Williams'. Woff will participate as part of Williams' development driver for 2014 season. She was 2013, best performer among young drivers test, held at Silverstone.
Story first published: Tuesday, February 25, 2014, 10:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X