పిలవకుండానే ఇంటికొచ్చిన అతి చెడ్డ అథిది ఇతనే!!

కొంత మంది అథిదులు పిలవకుండానే ఇంటికొస్తారు. అందులో ఇతను ఒకడు,వచ్చి ఏం చేశాడో తెలుసా ? తెలియాలంటే కథనంలోకెళ్లాల్సిందే...

Written By:

చైనాలో జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరూ ప్రమాదానికి గురవ్వలేదు, అసలేం జరిగిందంటే. చైనాలోని జియాంగ్సు ప్రాంతంలోని ఓ హైవీ మీద ఎస్‌యూవీలో వెళుతున్న ఓ వ్యక్తి అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న ఇంటిమీదకు ల్యాండ్ అయ్యాడు. రోడ్డు మీద నుండి మిద్దెమీదకు ఎలా వెళ్లాడు అని సందేహిస్తున్నారా...?

చైనాలోని జియాంగ్సు ప్రాంతంలో హోండా ఎస్‌యూవీ మీద భారీ వేగంతో వెళుతున్న ఓ వ్యక్తి ఓ మూడు చక్రాల బండిని మరియు పాదచారులను తప్పించడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో బ్రేక్ మీద తొక్కాల్సింది పోయి యాక్సిలరేటర్ పెడల్ ప్రెస్ చేసారు. ఇంకే ముందు వాలుగా ఉన్న రోడ్డు మీద చిందులేసుకుంటూ ఎస్‌యూవీ వాహనం దూసుకెళ్లింది. ప్రమాదాన్ని తప్పించడానికి స్టీరింగ్ ప్రక్కకు తిప్పడం జరిగింది.

వెనువెంటనే ప్రక్కనున్న రోడ్డు మీదకెళ్లి, ఆ ప్రక్కనే ఉన్న ఇంటిమీదకు చేరుకుని అంతటితో ఆగిపోయింది. ఈ ఎస్‌యూవీ వాహనం. అదృష్టవశాత్తు ఆ ఇంటిలో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు.

రోడ్డు మీద నుండి అదుపుతప్పిన ఎస్‌యూవీ వాహనం ఇంటి మీదకు ఎలా చేరింది అనే ప్రశ్న ఇక్కడ అందరికీ మెదిలే ఉంటుంది. మీకే కాదు మాకు కూడా ఇదే ప్రశ్న మెదిలింది.

నిజానికి రోడ్డు ప్రక్కన ఉన్న ఆ ఇళ్లు రహదారి అవుటర్ డివైడర్ కన్నా కేవలం ఒక్క అడుగు ఎత్తులోనే ఉండటం, అది కూడా రోడ్డుకు తొమ్మిది అడుగుల దూరంలోనే ఉండటం.

ఈ ఘటన జరిగిన సుమారుగా అరగంట వరకు వెహికల్‌లో ఉన్న వ్యక్తి అలాగే ఉండిపోయాడు. ఆ తరువాత విపత్తు నిర్వహణ బృందం అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఈ భయంకరమైన సంఘటన చూడాలంటే ఈ వీడియో మీద ఓ లుక్కేసుకోండి....

దీనికన్నా భయంకరమైన సంఘటనే లూసియానా దేశంలోని వెబ్‌స్టర్ ప్యారిష్ లో కూడా సంభవించింది. బహుశా ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు కాబోలు...

లూసియానా దేశంలో రోడ్డు మీద పోలీసు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఓ కుర్రాడు తాను నడుపుతున్న టయోటా టకోమా వాహనంతో తప్పించుకునే ప్రయత్నం చేసాడు. వాహనం అదుపు తప్పి ప్రక్కన ఉన్న ఓ పెద్ద ఎగుడుదిగుడు తలం మీదకు వెళ్లి అక్కడ నుండి గాల్లోకి ఎగిరే పార్కింగ్ చేసిన కారు మీదకు దుమికింది.

నిజానికి 18 ఏళ్ల కుర్రాడు నడుపుతున్న వాహనాన్ని దొంగతనంగా తీసుకెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి ముందు ఈ కారు వేగం ఎంతో తెలుసా గంటకు 185కిలోమీటర్లుగా ఉంది.

ఏదైమయినప్పటికీ మొదటి ఫ్లోర్‌లో కట్టిన రెస్టారెంట్‌ను, అదే విధంగా పార్కింగ్ చేసిన కారును చిన్నాభిన్నం చేశాడు. లక్కీగా పార్క్ చేసిన కారులో కూర్చున్న మహిళ ఎలాంటి హాని కలగకుండా తప్పించుకుంది.

ఈ మొత్తాన్ని ఇక్కడ ఉన్న వీడియో ద్వారా వీక్షించగలరు....

ఈ రెండు సంఘటనల నుండి చెప్పొచ్చేంది ఏమిటంటే. వాహనం ఎలాంటిదైనా నిర్ణీత వేగంలోనే నడపడం ఉత్తమం. ఇలాంటి ప్రమాదం జరిగినపుడు డ్రైవర్, అందులో ఉన్న ప్రయాణికులకు అదే విధంగా ఈ మాత్రం సంభందంలేని అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Out-Of-Control SUV Ends Up On A House's Roof — The Worst House Guest Ever?
Please Wait while comments are loading...

Latest Photos