ప్రారంభానికి సిద్దమైన ప్రపంచపు అత్యంత లోతైన మరియు పొడవైన రైలు సొరంగం

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన మరియు లోతైన రైలు సొరంగం గురించి విన్నారా ? స్విట్జర్లాండ్‌లో సుమారుగా 35 మైళ్లు పొడవుండే రైలు సొరంగాన్ని జూన్ 1, 2016 న ప్రారంభించనున్నారు. సుమారుగా 17 ఏళ్ల సుధీర్ఘ కాలం పాటు ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు. దీని గురించి మరిన్ని విశేషాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

స్విట్జర్లాండ్‌లోని ఎర్ట్స్‌ఫెల్డ్ మరియు బోడి అనే ప్రాంతాల మధ్య ఉన్న గోత్తార్డ్ పర్వత ప్రాంతాల్లో గోత్తార్డ్ బేస్ టన్నెల్ పేరుతో నిర్మించారు.

దీనికి సంభందించిన ప్లాన్‌ను 1947 ‌లోనే డిజైన్ చేసారు. అయితే 17 సంవత్సరాల క్రితం దీనికి సంభందించిన పనులు ప్రారంభించి నేటితో పూర్తి చేశారు.

స్విస్ ఆల్ప్ పర్వత ప్రాంతాల్లో భాగమైన గోత్తార్డ్ కొండల క్రింది సుమారుగా 7454 అడుగుల లోతులో 35.4 మైళ్ల పొడవు మేర ఈ రైలు సొరంగాన్ని నిర్మించారు.

ఈ రైలు సొరంగం నిర్మాణంలో ప్రత్యేకంగా తయారు చేసిన బోరింగ్ యంత్రం ద్వారా రోజుకు సుమారుగా 100 అడుగుల పొడవున రాయిన తొలగించే వారు.

జూరిచ్ మరియు మిలాన్ మధ్య దూరం ప్రయాణించడానికి సుమారుగా రెండు గంటలా 40 నిమిషాలు సమయం పట్టేది. ఈ మార్గంలో అందుబాటులోకి వచ్చిన ఈ సొరంగం ద్వారా ప్రయాణ సమయం గంటకు వరకు తగ్గుతుందని అంచనాలు

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన రైలు సొరంగం పొడవు 57 కిలోమీటర్లుగా ఉంది.

ఈ సొరంగం మొత్తం దూరాన్ని కేవలం 20 నిమిషాల వ్యవధిలో చేధించవచ్చు.

ఈ మార్గం మధ్యలో ఉన్న అన్ని సొరంగాల మొత్తం పొడవు 152
కిలోమీటర్లుగా ఉంది.

సముద్రం మట్టం నుండి గరిష్టం ఎత్తు 550 మీటర్ల (1,800 అడుగుల) వద్ద రైలు సొరంగం నిర్మించారు.

ఈ రైలు సొరంగాన్ని సుమారుగా 17 సంవత్సరాల పాటు నిర్మించారు. ఈ కాలంలో సుమారుగా 28.2 మిలియన్ టన్నుల బండరాళ్లను తొలగించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన మరియు అత్యంత లోతైన రైలు సొరంగం నిర్మాణానికి సుమారుగా 8.4 బిలియన్ యూరోలు ఖర్చు చేశారు.

ఈ సొరంగంలో రోజుకు 260 సరకు రవాణా మరియు 65 ప్రయాణికుల రైళ్లు ప్రయాణించే సామర్థ్యం కలదు.

ఈ సొరంగంలో సరుకు రవాణా రైళ్ల వేగం గంటకు 100 కిలోమీటర్లు మరియు ప్రయాణికుల రవాణా రైళ్లు గంటకు 200 కిలోమీటర్లు వేగంతో వెళ్లాల్సి ఉంటుంది.

ఈ రైలు సొరంగంలో సరుకు రవాణా రైళ్ల గరిష్టం వేగం గంటకు 160 కిమీలు మరియు ప్రయాణికుల రవాణా రైళ్ల గరిష్ట వేగం 250 కిలమీటర్లుగా ఉంది.

ఈ రైలు సొరంగాన్ని వచ్చే జూన్ 1 నాటికి ప్రారంభించి మరియు అధికారికంగా దీనిని డిసెంబర్ 11, 2016 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

  

Read more on: #రైలు #rail
Story first published: Thursday, May 26, 2016, 11:11 [IST]
English summary
Switzerland To Open Worlds Longest And Deepest Train Tunnel
Please Wait while comments are loading...

Latest Photos