25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు కావాలా ? అయితే తైవాన్‌కు వెళ్దాం రండి.

By Anil

మానవ ఆవిష్కరణలో ఒక అత్భుతం చరవాణి( మొబైల్ ఫోన్). ప్రస్తుతం కాలంలో సెల్ ఫోన్ ఒక గొప్ప పాత్ర పోషిస్తోంది. దీనిని వినియోగించని వారంటూ ఉండరు. ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త ఫోన్‌ను యువత కొనేస్తోంది. ఇది ఒక హాబిగా మారిపోయింది. దీని వలన ఎలక్ట్రానిక్ పరికరాల చెత్త నానాటికి పెరిగిపోతోంది.

మీరు ఎప్పుడయినా ఆలోచించారా ? వేస్ట్‌గా‌ పడి ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ మవుతున్నాయి అని. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరిగిపోయి వాటి ఉద్గారాలు మరియు పనికి రాని ఎలక్ట్రానిక్ పరికరాలు భూమిని ఎంతగానో కలుషితం చేస్తున్నాయి. దీనిని అరికట్టడానికి ఒక యువకుడు చేసిన ఒక ప్రయత్నం ఇది.

25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు

దాదాపుగా 25,000 పనికి రాని సెల్‌ఫోన్స్ ద్వారా ఈ రోడ్‌స్టర్‌ను రూపొందించాడు.

25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు

దీనిని రూపొందించిన యువకుడు తైవాన్ కు చెందిన వాడు. ఈ కారు ప్రతిమను రూపొందించడానికి దాదాపుగా భారీ మొత్తంలో బంక (గమ్‌) ను ఉపయోగించినట్లు తెలిపాడు

25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు

ప్రస్తుతం దీనిని తైవాన్‌లోని తైపీ సిటి హాలులో ప్రదర్శనకు ఉంచాడు.

25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు

ఇతని ముఖ్య ఉద్దేశం: ప్రజలలో అవేర్‌నెస్ తీసుకురావటం కోసం ఇలా దీనిని రూపొందించానని తెలిపాడు

25,000 ఫోన్లతో రూపొందించబడిన కారు

ఒక సారి మనం దీని గురించి ఆలోచిస్తే అర్థం అవుతుంది. ప్రపంచం మొత్తం కాలుష్య కోరల్లో చిక్కుని విళవిల్లాడుతోంది. దీనికి ఎలక్ట్రానిక్ పరికరాల కాలుష్య కూడా ఒకటి. ఇవి నేలలో ఎన్ని రోజులయినా డీ కంపోజ్ కావు. అందుకే మన వంతు ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించి మన భూ మాతను కాలుష్యం నుంచి కాపాడుకుందాం.

ఆశక్తికరమైన కథనాలు
  1. స్కార్పియో నా మజాకా: రెట్టింపు పొడవుతో నయా స్కార్పియో
  2. మిత్సుబిషి నుండి మొదటి ప్యాసింజర్ జెట్ ప్లేన్
  3. ఫేస్‌బుక్ లో ఎక్కువ మంది చదివిన డ్రైవ్‌స్పార్క్ కథనాలు

ఫోటోలు: సిసిటివి న్యూస్

Most Read Articles

English summary
Taiwanese Artist Created Roadster Using 25000 Old Phones
Story first published: Monday, December 28, 2015, 12:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X