దేశీయంగా బుల్లెట్ రైళ్ల తయారీకి సిద్దంగా ఉన్నా టాల్గొ

"మేకిన్ ఇండియా" చొరవతో దేశీయంగా బుల్లెట్ రైళ్ల తయారీకి స్పానిష్‌కు చెందిన ప్రముఖ రైళ్ల తయారీ సంస్థ టాల్గొ సముఖత వ్యక్తం చేసింది. అత్యంత వేగంగా ప్రయాణించే టాల్గొ రైళ్ల గురించి పూర్తి వివరాలు.

Written By:

దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోడీగారు ప్రారంభించిన "మేకిన్ ఇండియా" చొరవతో ఇప్పటికే అనేక సంస్థలు దేశీయంగా తమ ఉత్పత్తుల తయారీకి శ్రీకారం చుట్టాయి. ఈ మేకిన్ ఇండియా చొరవతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లైట్ వెయిట్ హై స్పీడ్ రైళ్లను నిర్మించే టాల్గొ సంస్థ దేశీయంగా తమ రైళ్లను తయారు చేయడానికి సుముఖతను వ్యక్తం చేసింది.

టాల్గొ సంస్థ తమ రైళ్ల మీద మేడిన్ ఇండియా అనే వ్యాక్యాన్ని చూసుకోవాలని తెగ ఆరాటపడుతోంది. ఇండియాలో తమ రైళ్లను తయారు చేసి దేశీయ మరియు అంతర్జాతీయ అవసరాలకు వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది.

ఇందుకు భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేడిన్ ఇండియా అనే అంశం ఆధారంగా దేశీయంగా అడుగుపెట్టి కాస్తో కూస్తో లాభపడాలనే ఆలోచనలో ఉంది.

ఇండియాలో టాల్గొ సంస్థ అవ్రి (AVRI)అనే సరికొత్త బ్రాండ్ పేరుతో నూతన రైళ్లను నిర్మించాలని చూస్తోంది. అవ్రి (Alta Velocidad Rueda Independiente Ligero) అనగా లైట్ హై స్పీడ్ ఇండిపెండెంట్ వీల్ (Light High-Speed Independent Wheel) అని అర్థం. ఈ రైళ్లు తక్కువ బరువును కలిగి ఉండి ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి.

టాల్గొ సంస్థ దేశీయంగా రైళ్ల తయారీని ప్రారంభించడం ద్వారా ఇండియన్ రైల్వే వీటిని తక్కువ ధరల ఏర్పాటు చేయవచ్చు, దేశీయంగా ఉపాధి కల్పన జరుగుతుంది. మరియు విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా దేశ ఆర్థిక శాఖకు ఖజానా చేకూరుతుంది.

టాల్గొ నిర్మించతలపెట్టిన అవ్రి రైలు గరిష్టంగా 600 మంది ప్రయాణికులను సౌకర్యవంతంగా గంటకు 330 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాలకు చేరవేస్తుంది, మరియు అవ్రి రైలు గరిష్టంగా 365 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకోగలదు.

1384 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీ - ముంబాయ్ మార్గంలో అవ్రి రైలును నిడిపితే, ఈ మొత్తం దూరాన్ని కేవలం నాలుగు గంటల 11 నిమిషాల్లో అధిగమిస్తుంది. ఇదే దూరంలో రాజధానికి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించే సమయంలో నాలుగున్నర రెట్లు తక్కువ ప్రయాణ కాలంతో అవ్రి రైలు ద్వారా చేరుకోవచ్చు.

ఈ అవ్రి రైలు ప్రపంచపు అతి తక్కువ బరవున్న హై స్పీడ్ రైలు. అందుకే దీనిని బుల్లెట్ రైలు అని సంభోదిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మిగతా హై స్పీడ్ రైళ్లతో పోల్చుకుంటే ఇది తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది.

ప్రస్తుతం తక్కువ ఇంధనాన్ని వినియోగించే వాహనాల అభివృద్ది, తయారీ, అమ్మకాలు మరియు వినియోగం మీద భారత్ దృష్టి పెట్టింది. కాబట్టి ఈ తక్కువ ఇంధనాన్ని వినియోగించుకునే హై స్పీడ్ ఆవ్రి రైలు మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తోంది టాల్గొ.

టాల్గొ సంస్థ స్పెయిన్‌కు చెందిన RENFE రైల్ సర్వీస్‌కు 15 హై స్పీడ్ అవ్రి రైళ్లను సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

Story first published: Thursday, December 22, 2016, 11:38 [IST]
English summary
Avril: The Bullet Train Talgo Wants To 'Make In India' — Details Revealed
Please Wait while comments are loading...

Latest Photos