ఇండియన్ రైల్వేస్ రికార్డ్ వేగాన్ని బ్రేక్ చేసిన హై స్పీడ్ టాల్గో రైళ్లు

By Anil

ఇండియన్ రైల్వేస్ ప్రతిష్టాత్మకంగా దేశీయ పట్టాల మీద టాల్గో లైట్ వెయిట్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం టాల్గో రైళ్లను వివిధ దశలలో వివిధ రూట్లలో పరీక్షిస్తు వచ్చింది. అయితే మథురా - పల్వాల్ రూట్లో ప్రయోగించిన రైలు అత్యంత వేగంతో పరుగులు పెట్టి ఇండియన్ రైల్వే రికార్డుల్లో ఉన్న గరిష్ట వేగం రికార్డ్‌ను తుడిచివేసింది.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

స్పానిష్‌కు చెందిన టాల్గో రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు అని నిరూపించాయి. కేవలం 39 నిమిషాల్లోనే 85 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించి రికార్డును సృష్టించింది. ప్రయాణ సమయంలో దీని సగటు వేగం గంటకు 130.76 కిమీలుగా ఉంది.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

ఇంతకు ముందు ఇండియన్ రైల్వే నమోదు చేసుకున్న గరిష్టం వేగం రికార్డుల్లో గతిమాన్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని టాల్గో రైళ్లు ఆక్రమించాయి.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

టాల్గో ఇంజనీర్లు మరియు ఇండియన్ రైల్వేస్ రీసెర్చ్ డిజైన్స్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ వారి సమక్షంలో టాల్గో రైళ్లకు పరీక్షలు నిర్వహించారు.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

పరీక్షల్లో భాగంగా సుమారుగా తొమ్మింది అల్యూమినియం లోహంతో తయారైన కోచ్‌లను పట్టాల మీద ప్రయోగించారు. అయితే ప్రయాణికులను ఇందులోకి అనుమతించలేదు.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

ప్రయాణికులు లేకుండా ఇది 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది అదే ప్రయాణికులు ఉంటే ఏ విధమైన వేగాన్ని అందుకుంటుంది అనే విషయం తేలాల్సి ఉంది. రానున్న 40 రోజుల్లోపు ఆగష్టులో మరోసారి మథురా మరియు పాల్వాల్ మద్య పరీక్షించనున్నారు.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

టాల్గో రైళ్ల చివరి పరీక్షలు ఢిల్లీ - ముంబాయ్ రూట్ల మద్య జరిగే పరీక్షలతో ముగింపు కానున్నాయి.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

ముంబాయ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణించే రూట్లోనే టాల్గో రైలును ప్రయోగించనున్నారు. ఈ మార్గంలో సుమారుగా 220 కిలోమీటర్ల వేగాన్ని నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

172 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇండియన్ రైల్వేస్ గురించి ఆసక్తికరమైన నిజాలు

రికార్డ్ బ్రేక్ చేసిన టాల్గో రైళ్లు

భారత దేశపు తొలి సోలార్ రైలు

Most Read Articles

Read more on: #రైలు #rail
English summary
High Speed Talgo Train Smashes Indian Railways Speed Record
Story first published: Thursday, July 14, 2016, 17:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X